Tuesday, June 30, 2020

వన్ స్టేట్...వన్ క్యాపిటల్... ఆంధప్రదేశ్...అమరావతి

nris-candle-light-protest-for-amaravati-farmers
జులై 3 న చేయబోయే ప్రదర్శన కు పెరుగుతున్న ఎన్నారై ల మద్దతు
వన్‍ స్టేట్‍...వన్‍ క్యాపిటల్‍ నినాదంలో భాగంగా ఆంధప్రదేశ్‍కు అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలంటూ రాజధాని రైతులు చేస్తున్న పోరాటం 200 రోజులు అవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని తెలుగు ఎన్నారైలంతా అమరావతి రైతులకు మద్దతుగా జూలై 3వ తేదీన వెలుగుపూల సంఘీభావం (క్యాండిల్‍ లైట్‍ ప్రదర్శన) నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర చరిత్రలోనే కాదు...ప్రపంచ చరిత్రలో రాజధాని నిర్మాణానికి వివాద రహితంగా  భూసేకరణ జరిగిన ఏకైక ప్రాజెక్టు అమరావతి. అంతర్జాతీయ ప్రమాణాలతో గొప్ప నగరాన్ని నిర్మించుకుందాం అంటూ అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా అప్పటి ప్రభుత్వం ఎంపిక చేసింది. రాజధాని కట్టాక తొలి ప్రయోజనాలు మీకే ఇస్తాం అని ప్రభుత్వం అధికారికంగా భరోసా ఇవ్వడంతో వివాదరహితంగా వేల మంది రైతులు తమ భూములకు ఒక్కపైసా తీసుకోకుండా రాష్ట్రానికి ఇచ్చేశారు. ప్రభుత్వం మారిన వెంటనే వారి త్యాగం నిష్ఫలంగా మారింది. అప్పటివరకు వేగంగా సాగుతున్న అమరావతి రాజధాని నిర్మాణం  ఆగిపోయింది. తమతో పాటు అందరూ బాగుండాలని చేసిన రైతుల త్యాగం వృథా అయింది. మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు నిరసనకు దిగారు. అలుపెరగకుండా పోరాడుతున్నారు. వారి పోరాటం 200 రోజులకు చేరుకుంది.
అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా ప్రపంచంలోని ఎన్నారైలను ఒక్కతాటిపైకి తెచ్చి వారికి మద్దతుగా వెలుగుపూల ప్రదర్శనకు అమెరికాలోని తెలుగు ప్రముఖులు జయరాం కోమటి ఇచ్చిన పిలుపునకు అన్నీచ్లో నుంచి మంచి స్పందన వచ్చింది. అమెరికా నుంచే కాకుండా ఆఫ్రికా, యూరప్‍, ఆస్ట్రేలియా ఖండాల నుంచి కూడా పలు నగరాల్లో స్థిరపడిన ఎన్నారైలు అమరావతి నిరసనకు మేము కూడా జైకొడతాం అని ముందుకువస్తున్నారు. 200 రోజులు పూర్తయిన సందర్భంగా అమెరికాలోని 200 నగరాల నుంచి జూమ్‍ కాల్‍ ద్వారా జులై 3 రాత్రి 9 గంటలకు క్యాండిల్‍ లైట్‍ నిరసన (వెలుగు పూల సంఘీభావం) తెలుపుదాం అని ఇచ్చిన పిలుపు 300 నగరాలకు చేరింది.అమరావతియే ఏపీ రాజధానిగా  రాష్ట్ర ప్రజలతోపాటు ప్రపంచంలోని ఎన్నారైలు ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థమవుతోంది. ఈ సంఘీభావ కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారంతా కుల,మత, ప్రాంతాలకు అతీతంగా పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమంలో అమెరికాయేతర నగరాలను సతీష్‍ వేమన కోఆర్డినేట్‍ చేస్తుండగా... నాట్స్ తరఫున ఎన్నారై నేతలు డాక్టర్‍ మధు కొర్రపాటి, మోహన కృష్ణ మన్నవ, శ్రీధర్‍ అప్పసాని,  ఆప్టా తరఫున బాబు పత్తిపాటి, విజయ్‍ గుడిసేవ కీలకంగా పాలుపంచుకుంటున్నారు. రత్నప్రసాద్‍, ఠాగూర్‍, సాయి, చందు సోషల్‍ మీడియాలో ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరితోపాటు అమెరికా, ఇతర దేశాలలో దాదాపు 100 మంది ఆయా నగరాల కో ఆర్డినేటర్లుగా ఉంటూ ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహంగా తమ మద్దతు తెలుపుతూ తమ పేర్లను నామినేట్‍ చేస్తున్నారు. కార్యక్రమ విజయవంతానికి అన్నిరకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈస్థాయిలో ఎన్నారైలందరూ ఏకమై నినదించడం గతంలో ఎన్నడూ జరగలేదు ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని అన్న నినాదంతో అందరూ ఒకేతాటిపైకి వస్తున్నారు.
కోవిడ్‍ నిబంధనలు పాటిస్తూన్ఱే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. వివిధ నగరాల్లోని ఎన్నారైలు స్థానిక నిబంధనలు అనుసరిస్తూ ఒక్కోచోట 15-20 మందికి మించకుండా ఈ నిరసనలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.  కార్యక్రమానికి హాజరయ్యే వారంతా కచ్చితంగా నల్లటి మాస్క్ ధరించాలని, కోవిడ్‍ వల్ల ఇతరులతో కలవడానికి ఇబ్బంది పడే వారు కూడా నల్లటి మాస్క్ తో తమ ఇంట్లో నిరసన తెలిపి ఆ ఫొటోను సోషల్‍ మీడియాలో పోస్టు చేయాలని నిర్వాహకులు కోరారు.

మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు... ఈ లీకేజిలు ఏంటిరా బాబూ....

Dil Raju To Approach Cops For Vakeel Saab Leaks
తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్ళీ లీకేజ్ వివాదాలు మొదలయ్యాయి. అసలే కరోనా కారణంగా సినిమాలను విడుదల నోచుకోలేక టాలీవుడ్ పరిస్థితి గందర గోళం గా మారింది మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కొత్త సినిమాలకు సంబంధించిన సీన్స్ ఇంటర్నెట్ వరల్డ్ లో లీక్ చేస్తున్నారు కొందరు. అయితే ఇటీవల అలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్న దిల్ రాజు విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన త్వరలోనే పోలీసులను కూడా కలవబోతున్నట్లు తెలుస్తోంది.
సోమవారం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కి సంబంధించిన ఒక సీన్ లీక్ అయిన విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇంటర్నెట్ లో బాగానే వైరల్ అయ్యాయి. అయితే ఆ లీకేజ్ ఎక్కువ సేపు వైరల్ అవ్వకముందే దిల్ రాజు టీమ్ జాగ్రత్త పడింది. ఆ వీడియో వైరల్ అవ్వకముందే ఫ్యాన్స్ సాయంతో అరికట్టారు. అయితే ఈ లీకేజ్ విషయంపై దిల్ రాజు చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అసలు దీనికి కారకులు ఎవరనే విషయం గురించి కనిపెట్టడంలో బిజీగా ఉన్నారు.
అలాగే దిల్ రాజు పోలీసులను సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సిరియస్ గా తీసుకోకపోతే చాలా ప్రమాదమని దిల్ రాజు ఈ విధంగా అడుగులు వేస్తున్నారట. ఇప్పటికే షూటింగ్స్ పూర్తి చేయలేక సినిమా రిలీజ్ చేయలేక దిల్ రాజు చాలా ఇబ్బంది పడుతున్నాడు. లాక్ డౌన్ కారణంగా తుది దశలో ఉన్న వకీల్ సాబ్ షూటింగ్ తో పాటి దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న మరికొన్ని సినిమాలు కూడా చాలా వరకు మధ్యలోనే ఆగిపోయాయు. నాని V సినిమా రిలీజ్ డేట్ గత కొన్ని నెలలుగా మారుతూనే ఉంది. ఇలాంటి కష్టకాలంలో దిల్ రాజుకి మళ్ళీ మరో దెబ్బ పడటం చర్చనీయాంశంగా మారింది. ఇక వకీల్ సాబ్ కి సంబంధించి ఇంకా 20శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉందట. కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే.. ఇప్పటికే సినిమా రిలీజ్ అయ్యుండేది. ఇక థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరి వకీల్ సాబ్ రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో చూడాలి..

‘సూర్యవంశీ’, ‘83’ చిత్రాలను థియేటర్ లోనే రిలీజ్ చేస్తాం - రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీఇఓ


83 and suryavanshi release on theatre

రెండు భారీ చిత్రాలు ‘సూర్యవంశీ’, ‘83’ కోసం సినీ ప్రేక్ష‌కులు, అభిమానులు ఎంతో ఆతృత‌గా, ఆస‌క్తిగా ఎదురు చూశారు. కానీ క‌రోనా ప్ర‌భావంతో ఈ రెండు సినిమాల విడుద‌ల కాకుండా వాయిదా ప‌డ్డాయి. తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీల‌పై ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. 2020లో దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 13న అక్ష‌య్ హీరోగా న‌టించిన ‘సూర్య‌వంశీ’.. అలాగే క్రిస్మస్ సందర్భంగా డిసెంబ‌ర్‌25న‌ రణ్వీర్ సింగ్ ప్రధానపాత్రలో నటించిన ‘83’ సినిమాను విడుద‌ల చేస్తున్నట్లు రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీఇఓ షిభాషిస్ స‌ర్కార్ తెలిపారు. ఆయ‌న మాట్లాడుతూ ‘‘నవంబర్ 13న దీపావళికి ‘సూర్యవంశీ’, క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ‘83’ చిత్రాలను థియేటర్స్‌లోనే విడుద‌ల చేస్తున్నాం. పరిస్థితులు చక్కబడి ప్రేక్ష‌కులు సినిమా థియేట‌ర్‌కు రావ‌డం ప్రారంభించిన త‌ర్వాతే ‘సూర్యవంశీ’, ‘83’ చిత్రాల‌ను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. రానున్న దీపావళి, క్రిస్మస్‌ల‌కు ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌తాయ‌ని ఆశిస్తున్నాం. లాక్‌డౌన్ త‌ర్వాత రిలీజ్ డేట్స్‌ను అనౌన్స్ చేసిన చిత్రాలివే కావ‌డం గ‌మ‌నార్హం.
అక్ష‌య్‌కుమార్‌, క‌త్రినా కైఫ్‌, గుల్ష‌న్ గ్రోవ‌ర్ త‌దిత‌రులు న‌టించిన ‘సూర్య‌వంశీ’ చిత్రాన్ని రోహిత్ శెట్టి డైరెక్ట్ చేశారు. బాలీవుడ్‌లో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్స్ సింగం, సింబాలుగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ర‌ణ్వీర్ సింగ్ స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ఇవ్వ‌డం విశేషం. మార్చి 27న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. అలాగే క‌బీర్‌ఖాన్ తెర‌కెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ‘83’ ఏప్రిల్ 10న విడుద‌ల కావాల్సింది. క‌రోనా ప్ర‌భావంతో ఈ చిత్రం కూడా వాయిదా ప‌డింది. 1983లో క్రికెట్‌లో విశ్వ‌విజేత‌గా ఆవిర్భ‌వించిన ఇండియ‌న్ టీమ్ ప్ర‌యాణాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇందులో ర‌ణ్వీర్ సింగ్‌, దీపికా, తాహిర్ రాజ్ బాసిన్‌, సాధిక్ స‌లీమ్‌, అమ్మి విర్క్‌, పంక‌జ్ త్రిపాఠి, బోమ‌న్ ఇరాని త‌దిత‌రులు న‌టించారు.