Wednesday, July 8, 2020

నాలో.. నాతో వైఎస్సార్


YS Vijayamma s Nalo Natho YSR Book Launch
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‍ రాజశేఖర్‍ రెడ్డి సతీమణి వైఎస్‍ విజయమ్మ రాసిన నాలో. నాతో.. వైఎస్సార్‍ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డి ఆవిష్కరించనున్నారు. మహానేత 71వ జయంతి సందర్భంగా వైఎస్‍ విజయమ్మ రచించిన ఈ పుస్తకాన్ని ఇడుపులపాయలో ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ విడుదల చేయనున్నారు. దివంగత నేత వైఎస్సార్‍ సహధర్మ చారిణిగా విజయమ్మ తన 37 ఏళ్ల జీవిత సారాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. అనూహ్యంగా 2009 సెప్టెంబర్‍ 2, వైఎస్సార్‍ హెలికాప్టర్‍ ప్రమాదంలో మరణించిన నాటి నుంచి కలిగిన భావోధ్వేగాల సమాహారమే ఈ పుస్తకం. మహా నేత వైఎస్సార్‍ గురించి లోకం ఏమనుకున్నది, ప్రజల నుంచి తాను తెలుసుకున్న విషయాలతో పాటు ప్రజలకు తెలియని కొన్ని అంశాలను తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చినట్లు వైఎస్‍ విజయమ్మ తొలి పలుకుల్లో తెలిపారు.

యాంటీ ట్రస్ట్ విచారణకు దిగ్గజ సీఈవోలు

Tech CEOs to testify before US House anti-trust panel on July 27

అమెరికా టెక్నాలజీ దిగ్గజ కంపెనీల సీఈవోలు హౌస్‍ జ్యూడీషియరీ కమిటీ యాంటీట్రస్ట్ (పోటీ నిరోధానికి సంబంధించి) విచారణకు ఈ నెల 27న హాజరు కానున్నారు. వీరిలో గూగుల్‍ సీఈవో సుందర్‍ పిచాయ్‍, ఫేస్‍బుక్‍ సీఈవో జుకర్‍బర్గ్, యాపిల్‍ టిమ్‍ కుక్‍, అమెజాన్‍ అధినేత జెఫ్‍ బెజోస్‍ ఉన్నారు. ఆన్‍లైన్‍ మార్కెట్‍లో పోటికి సంబంధించి యాంటీట్రస్ట్ ప్యానెల్‍ విచారణలో పాల్గొనాల్సి ఉంటుందని వాషింగ్టన్‍కు చెందిన ఓ పోర్టల్‍ పేర్కొంది.