Sunday, August 30, 2020

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు : మోదీ

 

PM Modi tweets greetings on Telugu Language Day

ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుగులోనే తెలియజేశారు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ, ముఖ్యంగా యువతకు ధన్యవాదాలు అంటూ శనివారం ట్వీట్‍ చేశారు. ఈ సందర్భంగా తెలుగు భాషాద్యమ పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తిని స్మరిస్తూ ప్రధాని నివాళులర్పించారు. గిడుగు తన సాహిత్యంతో, సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు.

లక్షణాలు లేకపోయినా... పిల్లల ద్వారా వైరస్

 Coronavirus spreading through children


కరోనా బారినపడిన పిల్లల్లో ఇన్ఫెక్షన్‍ లక్షణాలు బయటపడకున్నా వారి ద్వారా 3 వారాల పాటు వైరస్‍ వ్యాపించే అవకాశం ఉంటుందని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అక్కడి 22 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఇన్ఫక్షన్‍ లక్షణాలు బయటపడని 91 మంది పిల్లల్లో వచ్చిన మార్పులపై అధ్యయనం చేశారు. వారికి 3 రోజులకు ఒకసారి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 20 శాతం మందిలో ఇన్ఫెక్షన్‍ లక్షణాలు పూర్తిగా వెలుగు చూసేందుకు 3 రోజుల నుంచి 3 వారాలు పట్టింది. వారిలో వైరల్‍ లోడ్‍ మాత్రం పెరుగుతూపోయింది.

ఘనంగా తానా తెలుగు భాషా దినోత్సవం

 

TANA Telugu Basha Dinostavam Celebrations

హాజరైన తెలుగు భాషా ప్రముఖులు 

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించింది. అంతర్జాల వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. తానా మాజీ అధ్యక్షులు జంపాల చౌదరి, వంగూరి ఫౌండేషన్‍ అధినేత డా. వంగూరి చిట్టెన్‍ రాజు, కౌముది నెట్‍ సంపాదకులు కిరణ్‍ ప్రభ, సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్‍ కూచిభొట్ల, పారుపల్లి కోదండరామయ్య తెలుగు భాషోద్యమకర్త, నందివెలుగు ముక్తేశ్వర రావు - ఐఎఎస్‍, నల్గొండ జిల్లా పూర్వ కలెక్టర్‍, గారపాటి ఉమామహేశ్వర రావు, హైదరాబాద్‍ విశ్వవిద్యాలయం, మన్నం వెంకట రాయుడు - మనసు ఫౌండేషన్‍, బెంగళూరు,  డా. సి.ఎం.కె రెడ్డి, అల్‍ ఇండియా తెలుగు ఫెడరేషన్‍, చెన్నై, ప్రో. గణేష్‍ తొట్టెంపూడి - హైడెల్‍ బర్గ్ విశ్వవిద్యాలయం, జర్మనీ, శీను. జి - తెలుగు పలుకు, ఆస్ట్రేలియా, సంజీవ నరసింహ అప్పడు - తెలుగు రేడియో/టి.వి వ్యాఖ్యాత, మారిషస్‍ ప్రభుత్వం, మల్లికేశ్వర రావు కొంచాడ, ఆస్ట్రేలియా, అప్పాజీ అంబరీష దర్భా,  తెలుగు ఖతి రూపకర్త, పురుషోత్తమ్‍ కుమార్‍ గుత్తుల - తెలుగు ఖతి రూపకర్త, హైదరాబాద్‍, వీవెన్‍- సాంకేతిక తెలుగు (లేఖిని), హైదరాబాద్‍, వాడపల్లి శేషతల్పశాయి- ఆంధ్రభారతి.కామ్‍, హైదరాబాద్‍, యర్ర (బర్మా) నాయుడు- తెలుగు బడి, బర్మా తదితరులు ఇందులో పాల్గొన్నారు.

తానా అధ్యక్షులు జయ్‍ తాళ్ళూరి, తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు ప్రసాద్‍ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్‍ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం తెలుగువైభవాన్ని మరోసారి అందరికీ తెలియజేసేలా సాగింది. జయ్‍ తాళ్ళూరి మాట్లాడుతూ, మాతృభాష రాని మనిషి మాటలు డొల్ల/ తలపులోని మాట తెలుపు టెల్ల/ తెడ్డు లేని  పడవ వొడ్డు  చేరుట కల్ల/ తెలుగు వీడ కోయి తెలుగు వాడ.’’ అన్నట్లు...మాతృభాష రాని వారి మాటలు నిస్సారంగా ఉంటాయి. ఏ  విషయాన్ని స్పష్టంగా చెప్పలేరు. తెడ్డు లేని పడవ వొడ్డు చేరడం ఎలా సందేహాస్పదమో... మాతృభాష పునాదిగా లేని వారు కూడా తమ లక్ష్యాన్ని చేరుకోవడం సుసాధ్యం కాదు. కాబట్టి మాతృభాషను ఎవరూ వదలకూడదు. ఎందుకంటే మాతృభాష అనేది కేవలం భావ ప్రసారానికి సాధనం మాత్రమే కాదు. ఒక జాతి సంస్కృతికి వారధి మాతృభాష. ఒక జాతి సమున్నత విజ్ఞానానికి సారధి మాతృభాష. ఒక తరం నుంచి మరో తరానికి విలువైన సాంప్రదాయ సంపదను అందించగల అనుసందాత మాతృభాష. మాతృ భాష ఒక నినాదం కాదు..మాతృభాష ఒక జాతి జీవన విధానం! జాతి మనుగడకు అది ప్రధానం..!, ఇటువంటి భాషను మరచిన ఏ జాతికైనా అస్తిత్వం లేదు అని అంటూ, తానా భాషా వికాసం కోసం  గత నాలుగు దశాబ్దాలుగా ఎంతో కృషి చేసింది.  

అనేక మంది కవులను ప్రపంచ వేదిక కు పరిచయం చేసింది. ‘అంతర్జాల తెలుగు మహా నిఘంటువు’’ను రూపొందించింది. ‘‘అమ్మానాన్న గురు వు పద్యార్చన’’  పేరుతో 6 లక్షల మంది విద్యార్థుల తో ఒకే రోజు పద్యాలు పాడించడం. 50 దేశాలలోని  100 సంస్థలతో  కలిసి 18 వేల మందితో ‘‘తెలుగు సాంస్కృతిక మహోత్సవాలు’’ నిర్వహించడం జరిగింది. అమెరికాలోని ప్రవాసాంధ్రుల పిల్లలకు తెలుగు భాష బోధించటానికి ప్రతిష్టాత్మకంగా అమెరికాలోని అనేక నగరాలలో ‘పాఠశాల’ పేరుతో ఒక బృహత్‍ భాషా యజ్ఞం  నిర్వహిస్తోంది.  ప్రపంచంలోని తెలుగు కవులను, భాషా ప్రియులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి భాషా వికాసానికి తోడ్పడే ఉద్దేశంతో ‘‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’’ ఏర్పాటు చేసి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వివిధ దేశాల్లో భాషా సేవలు చేస్తున్న మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అతిధుల ప్రసంగాలు, సందేశాలు రానున్న భాషా ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన వక్తలంతా తమతమ ప్రాంతాల్లో జరుగుతున్న తెలుగుభాషా పరిరక్షణ చర్యలను తెలుపుతూ, తెలుగు భాష గొప్పదనాన్ని వివరించారు.

సీఎం జగన్ డైనమిక్ లీడర్.. ఆయనకు దేవుడి ఆశీస్సులు ఉంటాయి ‘కింగ్ నాగార్జున' ట్వీట్

 

nagarjuna tweets on ys jagan

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడంపై నాగార్జున స్పందించారు.టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన చిన్నా, పెద్ద ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందినవాళ్లు నాగార్జునకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నాగార్జునకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ‘‘తెలుగు సినీ ప్రపంచంలో ఎందరో గొప్ప నటుల్లో ఒకరైనా అక్కినేని నాగార్జున్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు, మరిన్ని విజయాన్ని ప్రసాదించాని భగవంతున్ని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ ట్వీట్ చేసిన దాదాపు 19 గంటల తర్వాత నాగార్జున స్పందించారు. సీఎం జగన్ డైనమిక్ లీడర్ అని, తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రియమైన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమపూర్వక మాటలకు ధన్యవాదాలు. మీరు ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని ఆకాంక్షిస్తున్నాను. నాకు తెలుసు.. మీ డైనమిక్ లీడర్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వాంగసుందరంగా రూపుదిద్దుకుంటుంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.’’ అని నాగార్జున రిప్లై ఇచ్చారు.

https://twitter.com/ysjagan/status/1299683127028146176

https://twitter.com/iamnagarjuna/status/1299978112579510278

ప్రభాస్‌పై అమెరికన్ పాప్ సింగర్ ఓ హేవ్ మెర్సీ ప్రశంసలు.. బిగ్ థ్యాంక్స్ చెప్పిన రెబల్ స్టార్


htprabhas-thanks-to-american-pop-singer-mercy-for-bang-bang-song-in-saaho

 'సాహో’ సినిమా ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ గతేడాది ఆగస్టు 30న విడుదలైంది. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద బాగానే వసూలు చేసింది.

అయితే, తెలుగు సహా ఇతర భాషల్లో రాణించలేకపోయింది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్ల మేర గ్రాస్ వసూలుచేసింది,ఇదిలా ఉంటే, నేటితో ఈ చిత్రం ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. అలాగే, హీరో ప్రభాస్ తన డైహార్డ్ ఫ్యాన్స్‌కి, చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, అమెరికన్ పాప్ సింగర్, మోడల్ మెర్సీకి కూడా ప్రభాస్ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి ఒక కారణం ఉంది. సాహోలో ‘బ్యాంగ్ బ్యాంగ్’ అంటూ వచ్చే ఇంగ్లిష్ సాంగ్‌ను మెర్సీ ఆలపించారు.

‘సాహో’ ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా మెర్సీకి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బిగ్ థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు, ఆమె పాడిన సాంగ్‌ను కూడా పోస్ట్ చేశారు.మెర్సీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను ‘సాహో’ సెలబ్రేషన్స్‌తో నింపేశారు. ఇప్పటి వరకు అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ప్రభాస్ ఒకరని మెర్సీ కొనియాడారు. నిజాయతీగా చెప్పాలంటే ఆయన గొప్ప వ్యక్తని ప్రశంసించారు. ప్రభాస్‌తో మరోసారి కలిసి పనిచేయాలనుందని పేర్కొన్నారు. అలాగే, ‘సాహో’ వంటి సినిమాలో తనకు పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమని మెర్సీ అన్నారు. చాలా మంచి టీమ్‌తో తాను పనిచేశానని సంతోషంగా చెప్పారు.

Saturday, August 29, 2020

మాతృభాషను కాపాడుకోవడమే ఆ మహానీయుడికి ఘనమైన నివాళి

 

Vice-President-Venkaiah-naidu-starts-webinor-on-Telugu-Basha-Dinostavam-in-Delhi

ఉన్నతమైన సమాజానికి, భాషాసంస్కృతులే చక్కని పునాదులు వేస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య నిర్వహించిన మన భాష- మన సమాజం- మన తెలుగు సంస్కృతి అంతర్జాల సదస్సును ఆయన ప్రారంభించారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి అయిన తెలుగు భాషా దినోత్సవం నాడు భాషా సంస్క•తి, సమాజం పరంగా మనం ఎక్కడున్నామనే అంశాన్ని సింహవలోకనం చేసుకోవడం ముదావహం అని వెంకయ్య వ్యాఖ్యానించారు.

ప్రజలకు అర్థంకాని భాషల్లో ఉన్న విజ్ఞానం సమాజానికి మేలు చేయదని గిడుగు భావించారని గుర్తు చేశారు. అందుకే పుస్తకాల్లో సులభమైన తెలుగును వాడాలని ఉద్యమించారని పేర్కొన్నారు. మాతృభాషను కాపాడుకోవడమే ఆ మహానీయుడికి అందించే ఘనమైన నివాళి అని అన్నారు. మన సంస్కృతి చిరునామాలను భవిష్యత్‍కు అందించడం భాష ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ప్రపంచీకరణ వల్ల భాషలు అంతరించే ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక భాషలమీద ఆయా ప్రాంతాల్లోని వర్సిటీలు అధ్యయనాలు జరపాలని సూచించారు. పురోభివృద్ధిని కోరుకునేవారు మాతృభాషను మరవకూడదని పిలుపునిచ్చారు.

ఏకాంతంగా తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు

 All set for Tirumala Tirupati Brahmotsavam

కొవిడ్‍ కేసులు పెరుగుతున్నందున సెప్టెంబరు 19 నుంచి జరిగే తిరుమల శ్రీనివాసుడి వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి చైర్మన్‍ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అధిక మాసం వల్ల ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయని, అక్టోబరులో జరిగే వేడుకలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవన్‍లో సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈవో అనిల్‍ కుమార్‍ సింఘాల్‍, అదనపు ఈవో ధర్మారెడ్డి, సభ్యులు భాస్కర్‍రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి, శివకుమార్‍, దామోదర్‍రావు నేరుగా హాజరుకాగా, సుధా నారాయణ మూర్తి, రామేశ్వరరావు, కరుణాకర్‍ ఆన్‍లైన్‍లో పాల్గొన్నారు.

ఆమెతో పోల్చితే ఇవాంక బెటర్ : ట్రంప్

 Kamala Harris Not Competent To Be US President Ivanka Better says Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ డెమోక్రాటిక్‍ సభ్యురాలు కమల హారీస్‍పై నోరుపారేసుకున్నారు. అధ్యక్ష పదవికి ఆమె అసలు పోటీదారే కాదన్నారు. ఆమెతో పోల్చితే ఇవాంకా బెటర్‍ చాయిస్‍ అన్నారు. న్యూ హాంప్‍షైర్‍లో జరిగిన రిపబ్లికన్‍ ప్రచార  ర్యాలీలో తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్‍ మాట్లాడుతూ ఒక మహిళ అమెరికా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. అందుకు మద్దతు కూడా తెలుపుతున్నాను. అయితే ఆ పదవికి హారిస్‍ అర్హులు కాదు.. పోటీదారు అంతకన్నా కాదు. వైట్‍ హౌస్‍ సీనియర్‍ సలహాదారు ఇవాంక ట్రంప్‍ అయితే బాగుంటుంది అన్నారు. ట్రంప్‍ మద్దతుదారులు కూడా ఇవాంక అని అరవడంతో ఇది ప్రజల కోరిక నా తప్పు లేదు అన్నారు ట్రంప్‍. రిపబ్లికన్‍ పార్టీ తరపున రెండో సారి అధ్యక్ష పదవికి నామినేట్‍ అయిన తర్వాత నిర్వహించిన తొలి ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్‍.

బయలాజికల్ ఈ తో ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా సంస్థ

 

Hyderabad based Biological E ties up with US college for vaccine production

కరోనా టీకా ఉత్పత్తి కోసం అమెరికాలోని టెక్సాస్‍కు చెందిన బేలోర్‍ కాలేజ్‍ ఆఫ్‍ మెడిసన్‍ (బీసీఎమ్‍) తెలంగాణ ఫార్మా కంపెనీ బయలాజికల్‍ ఈ తో ఒప్పందం కుదుర్చుకున్నది. బీసీఎమ్‍ టీకా ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్నది. వచ్చే ఏడాదిలో టీకా ఉత్పత్తి ప్రారంభమవుతుంది. టీకా తయారయ్యాక వేగంగా పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో బయోలాజికల్‍ ఈ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని, బయలాజికల్‍ ఈ 100 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తుందని బీసీఎమ్‍ అధికారులు తెలిపారు. బయలాజికల్‍ ఈ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‍లో ఉన్నది.

Friday, August 28, 2020

TAMA Mahila Sambaralu Online Event

 

TAMA Mahila Sambaralu Online Event

Registrations : www.tama.org/mahilasambaralu

వేదాద్రి ఎత్తిపోతలకు సీఎం జగన్ శంకుస్థాపన

 

CM Jagan Launches Vedadri Llift Irrigation Scheme

పశ్చిమ కృష్ణా తీరంలోని జగ్గయ్యపేట మండలం వేదాద్రి క్షేత్రం సమీపంలో రూ.368 కోట్లతో భారీ ఎత్తిపోతల పథకానికి ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‍ విధానం ద్వారా ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. వైఎస్‍ఆర్‍ వేదాద్రి ఎత్తిపోతల పేరుతో రూపొందించిన ఈ ఎత్తిపోతల ద్వారా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన 28 గ్రామాల ఎన్‍ఎస్పీ భూములకు సాగునీరు అందనుంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‍కుమార్‍ యాదవ్‍, రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్

 

Minister KTR Review on Basthi Dawakhana

బస్తీ దవఖానాలపై తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‍శాఖ మంత్రి కేటీఆర్‍ సమీక్ష నిర్వహించారు. పేదలకు ప్రాథమిక ఆరోగ్యం అందడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేసిన మంత్రి.. హైదరాబాద్‍లో మరో 100 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బస్తీ దవాఖానాల ద్వారా ప్రతి రోజు 25 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నామని, కొత్తగా నిర్మించబోయే దవాఖానాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతం అయ్యాయని సిబ్బందిని ప్రశంసించారు.

హైదరాబాద్‍ పరిధిలోని 197 బస్తి దావఖానాలు, ఇతర నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి రోజు 5000 పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు 53 రకాల పాథాలజీ, మైక్రోబయోలకీ, బయో కెమిస్ట్రీ వంటి వైద్య పరీక్షలు చేస్తున్నామని కేటీఆర్‍ సృష్టం చేశారు. బస్తి దవాఖానాలకు పేదల నుంచి మంచి స్పందన వస్తుందని, ముందుముందు వీటిని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్‍ వాకాటి కరుణ, జిల్లాల కలెక్టర్లు, పురపాలక శాఖ, జీహెచ్‍ఎంసీ అధికారులు పాల్గొన్నారు

రామ్‌చ‌ర‌ణ్ ఈ విష‌యంలో మొద‌టి అడుగు వేస్తున్నాడు!

 

Ram Charan to join Acharya shoot first

క‌రోనా చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఎంత న‌ష్టాల్లోకి నెట్టేసిందో అంద‌రికీ తెలిసిందే. ఒక‌దానికి ఒక‌టి లింక్ ఉన్న ప‌నులు కావ‌డం వ‌ల్ల చాలా మంది దానివ‌ల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. సినిమాలు రిలీజ్ అవ్వాలంటే థియేట‌ర్లు ఉండాలి. సినిమాలు పూర్తి కావాలంటే షూటింగ్ చెయ్యాలి. షూటింగ్ చెయ్యాలంటే ఎవ్వ‌రూ ధైర్యం చెయ్య‌లేని ప‌రిస్థితి. చిన్న హీరోలు కూడా షూటింగ్ అంటే భ‌య‌ప‌డుతున్నారు. ఇక పెద్ద హీరోల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కొంద‌రు హీరోలు జ‌న‌వ‌రి త‌ర్వాతే షూటింగ్ అని గ‌ట్టిగా చెబుతున్నారు. ధైర్యం చేసి షూటింగ్ పెట్టాల‌న్నా ఎంతో ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. పైగా చిత్ర యూనిట్‌లోని ప్ర‌తి ఒక్క‌రి బాధ్యతా నిర్మాతే తీసుకోవాల్సి వ‌స్తోంది. దీంతో నిర్మాత‌కు మ‌రింత భారం ప‌డుతోంది. ఇప్పుడిప్పుడే ఇత‌ర భాషా హీరోలు షూటింగ్ చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఇప్ప‌డు టాలీవుడ్ హీరోలు కూడా షూటింగుల‌కు బ‌య‌ల్దేరే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీని గురించి ఒక నిర్ణ‌యం తీసుకునేందుకు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ క‌స‌ర‌త్తులు చేస్తోంది.

టాలీవుడ్ నుంచి మొద‌ట‌గా రామ్‌చ‌ర‌ణ్ షూటింగ్‌కి రెడీ అవుతున్నాడు. అయితే అది రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్‌కి కాదు. నాన్న చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `ఆచార్య‌` చిత్రం కోసం. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రారంభం కావ‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టేలా ఉండ‌డంతో చ‌ర‌ణ్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని తెలుస్తోంది. అంటే ఐదు నెల‌లుగా స్తంభించిపోయిన షూటింగును స్టార్ట్ చేసి ముందుకు వెళుతున్న హీరోల్లో మొద‌టి పేరు రామ్‌చ‌ర‌ణ్‌దే. ఈ విష‌యంలో మెగా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక‌వైపు మెగాస్టార్ షూటింగ్ స్టార్ట్ అవుతోంది. మ‌రో వైపు త‌మ అభిమాన యంగ్ హీరో రామ్‌చ‌ర‌ణ్ షూటింగ్‌ను స్టార్ట్ చెయ్య‌డంలో అంద‌రికీ మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తున్నాడ‌ని అభిమానులు సంతోషిస్తున్నారు.

అమెరికాలో మహిళల ఓటు హక్కుకు వందేళ్లు!

 

US marks 100 years since women given right to vote

అమెరికాలో మహిళలకు ఓటు హక్కు వచ్చి వందేళ్ళ పూర్తయింది. మహిళలకు ఓటు హక్కు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేసి బుధవారానికి శత వత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ చారిత్రక వి•యాన్ని గుర్తు చేస్తూ అమెరికా అంతటా సంబరాలు జరుపుకుంటున్నారు. నవంబరు అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా ఈ సందర్భాన్ని గౌరవించుకోవాలని మహిళా రాజకీయ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటు హక్కు కావాలని కోరుతూ దశాబ్దాలుగా మహిళలు సాగించిన పోరాటం అనంతరం ఈ మేరకు 1920 ఆగస్టు 26న అమెరికా రాజ్యాంగానికి 19వ సవరణను లాంఛనంగా ఆమోదించారు. ఓటు వేయడానికి అమెరికా పౌరులకు ఉన్న హక్కును కేవలం లైంగికతను బట్టి ఆ దేశ ప్రభుత్వం లేదా మరే ఇతర రాష్ట్రం నిరాకరించడానికి లేదా కుదించడానికి వీలు లేదు అని ఆ సవరణ పేర్కొంటోంది.

ఈ నేపథ్యంలో ఆగస్టు 26ని మహిళల సమానత్వ దినంగా అమెరికాలో ప్రతి ఏటా పాటిస్తున్నారు. న్యూయార్క్ సెంట్రల్‍ పార్క్లో 19వ శతాబ్దపు మహిళల పోరాటానికి ఆద్యులైన ముగ్గురు శక్తివంతమైన మహిళలు సోజర్నర్‍ ట్రూత్‍, సుశాన్‍ ఆంటోనీ, ఎలజబెత్‍ కేడీ స్టాంటన్‍ల విగ్రహాలను ఆవిష్కంచారు. మహిళలకు ఓటు హక్కు వచ్చే నాటిని వీరు ముగ్గురూ మరణించారు. 19వ సవరణ ఆమోదం చాలా కీలకమైనది, ముఖ్యమైనది, చారిత్రాక విజయమే అయినప్పటికీ ఇది అసంపూర్తిగానే ఉంది అని మాజీ విదేశాంగ మంత్రి, 2016, డెమోక్రాట్‍ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‍ విగ్రహావిష్కరణ అనంతరం వ్యాఖ్యానించారు.