Friday, July 10, 2020

"రొరి" మూవీ లో తెలంగాణా ముఖ్య‌మంత్రి గా శ్రీ కోటాశ్రీనివాస‌రావు గారు

hKota Srinivasa Rao Acting As Telangana CM in Rory Movie

విల‌క్ష‌ణ న‌టుడు కొటాశ్రీనివాస‌రావు వేయ‌ని పాత్ర‌లు లేవ‌నే చెప్పాలి.. భార‌త‌దేశం లో సుమారు అన్ని భాష‌ల్లో న‌టించి మెప్పించిన గొప్ప లెజండ‌రి యాక్ట‌ర్ ఆయ‌న‌. గ‌తం లో చాలా చిత్రాల్లో ముఖ్య‌మంత్రి పాత్ర‌లో క‌నిపించారు. మ‌రికొన్న పాత్ర‌ల్లో అపోజిష‌న్ లీడ‌ర్ గా క‌నిపించారు. కాని మెట్ట‌మెద‌టి సారిగా కొత్త రాష్ట్రం అయిన తెలంగాణా ముఖ్య‌మంత్రి గా న‌టించ‌డం విశేషం. ఈరోజు కొటా శ్రీనివాస‌రావు గారి పుట్టిన‌రోజ‌పు సంద‌ర్బంగా ఈ లుక్ ని రొరి చిత్ర యూనిట్ విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో ఆయ‌న చాలా సెన్సిటివ్ ముఖ్య‌మంత్రి గా వైవిధ్య‌మైన పాత్ర లో న‌టిస్తున్నారు. ఈ పాత్ర పేరు ఆర్‌. రామ‌న్న చౌద‌రి గా ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దాడు. ఈ చిత్రాన్ని సీటీఎస్‌ స్టూడియోస్‌, ఎస్‌టీవీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ సంయుక్తంగా చరణ్‌ రోరి నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మెద‌టి లుక్ ని ఇటీవ‌లే విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఫస్ట్‌లుక్ కి సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన క్రేజ్ రావ‌టం విశేషం..భీన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ప్ర‌భాస్ మూవీ నంబర్ 20 పాన్ ఇండియా చిత్రం 'రాధేశ్యామ్‌' ఫస్ట్ లుక్

Radhe Shyam First Look Released

బాహుబలి1, బాహుబ‌లి2, సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న "రెబ‌ల్‌స్టార్" ప్ర‌భాస్ త‌న 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. "రెబ‌ల్‌స్టార్" ప్ర‌భాస్ స‌ర‌స‌న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని "రెబ‌ల్‌స్టార్" కృష్ణంరాజు గారు స‌మ‌ర్పించ‌గా, వంశి, ప్ర‌మెద్‌, ప్ర‌శీద లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎన్నో సూప‌ర్‌హిట్స్ అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్ , యూవి క్రియెష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై నిర్మిస్తున్నారు.  ఇప్ప‌టికే యూర‌ప్ లాంటి విదేశాల్లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరణ జరుపుకొని 70% టాకీ పార్ట్ ని పూర్తిచేస‌కుంది. మిగ‌తా షూటింగ్ పార్ట్ ని ఈ కొవిడ్‌-19 ప్ర‌భావం క్రైసిస్ ముగిసిన వెంట‌నే సెట్స్ మీద‌కి తీసుకువెలతారు. అయితే ఈ చిత్రానికి సంబందించిన ఫ‌స్ట్ లుక్ మ‌రియు టైటిల్  కొసం యావ‌త్ ప్ర‌పంచం లోని అభిమానులంతా ఎంత‌లా ఎదురు చూసారో చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ క్ష‌ణం ఈరోజు రావ‌టం తో అభిమానులంతా సంబ‌రాల్లో మునిగిపోయారు. ఈరోజు ఈ చిత్రం టైటిల్ ని "రాధేశ్యామ్" అంటూ ఎనౌన్స్ చేశారు. దాంతో పాటే మెద‌టిలుక్ ని కూడా రిలీజ్ చేశారు. అలానే ఈ సినిమా తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో విడుదల అవ్వనుంది.
"రెబ‌ల్‌స్టార్" ప్ర‌భాస్‌-రాధాకృష్ణ కుమార్ కాంబినేష‌న్‌
బాహుబలి రెండు పార్టుల త‌రువాత "రెబ‌ల్‌స్టార్" ప్ర‌భాస్ పాన్ ఇండియాస్టార్ గా ఎదిగారు అంతే కాదు  సౌత్ ఇండియాలో మెట్ట‌మెద‌టి పాన్ ఇండియా స్టార్ గా ప్ర‌భాస్ రికార్డ్ సాధించారు. ఆ త‌రువాత వ‌చ్చిన సాహొ రెవెన్యూ ప‌రంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ స‌త్తా మ‌రోక్క‌సారి చాటింది. అలాగే జిల్ చిత్రం తో ద‌ర్శ‌కుడు గా 100 మార్క్ లు వేసుకున్న ద‌ర్శ‌కుడు రాదాకృష్ణ కుమార్, వీరిద్దరి కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం రాధేశ్యాం. ఈ చిత్రం ఢిఫ‌రెంట్ ల‌వ్ స్టోరి గా తెర‌కెక్కుతుంది. మేక‌ర్ గా మంచి గుర్తింపు పోందింన రాధాకృష్ణ కుమార్ కి రెండ‌వ చిత్రం గా ఇది తెర‌కెక్కుతుంది. ఈ క్రేజి కాంబినేష‌న్ కొసం అభిమానుల్లో మ‌రియు సినిమా ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు భారీగా పెరుగుతున్నాయి.

గొపికృష్ణ మూవీస్‌-యూవిక్రియెష‌న్స్ నిర్మాణం లో రెబ‌ల్‌స్టార్ కృష్ణం రాజు గారు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. గొపికృష్ణ మూవీస్ బ్యాన‌ర్ లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు కృష్ణం రాజు గారు నిర్మించారు. మంచి క‌థాబ‌లం వున్న చిత్రాలు నిర్మిస్తూ స‌క్స‌స్ కి కేరాఫ్ అడ్రాస్ గా నిలిచిన గొపికృష్ణ మూవీస్ బ్యాన‌ర్ ఇప్ప‌డు లేటెస్ట్ స‌క్స‌స్ ఫుల్ నిర్మాణ సంస్థ యూవిక్రియెష‌న్స్ బ్యాన‌ర్ తో క‌లిసి నిర్మాణం చెప‌ట్ట‌టంతో "రాథేశ్యామ్"  ట్రేడ్ లో ట్రెండ్ సెట్ట్టింగ్ ఫిల్మ్ గా క్రేజ్ ని సొంతం చేసుకుంది.
రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌-పూజాహెగ్డే కాంబినేష‌న్‌
రాధేశ్యామ్‌ అనే టైటిల్ ని వీరిద్ధ‌రి కాంబినేష‌న్ చూసి పెట్టారా అనుకునేలా ఈ జంట మెద‌టి లుక్ లో వున్నారంటే ఆశ్చ‌ర్యం లేదు.. అంత‌లా ఇమిడిపోయారు ఈ స్టిల్ లో ఇటీవ‌లే బుట్ట‌బొమ్మ గా ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్ని ఆక‌ట్టుకున్న పూజాహెగ్డే ఈ చిత్రం లో మ‌రింత‌గా ఆక‌ట్టుకుంటుంది. ప్రేమికులుగా రాథేశ్యామ్ అని అంద‌రి ప్ర‌శంశ‌లు పొందే విధంగా ఈ మెద‌టి లుక్ ఆకట్టుకొవటం విశేషం.

రాధేశ్యామ్ మెద‌టి లుక్‌
"రెబ‌ల్‌స్టార్" ప్ర‌భాస్‌, పూజాహెగ్డే ల‌తో బార్బిడాల్ డాన్స్ పోజ్ తో రిలీజ్ చేసిన మెద‌టి లుక్ చాలా ల‌వ్‌లీ గా వుండ‌టం అంద‌ర్ని ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా ప్ర‌భాస్‌, పూజా ఇద్ద‌రూ ప్రేమ‌కి ప్ర‌తిరూపంగా వుండ‌టం.. ఎర్ర‌టి స‌ముద్రాన్ని గౌనుగా వాడ‌టం ద‌ర్శ‌కుడి క్రియెటివిటి క‌నిపిస్తుంది. ప్రేమ‌ని చూపిస్తూ దాని వెన‌క స‌మ‌స్య‌ని ఈ పిక్చ‌ర్ లో చూపించారు. చెప్ప‌క‌నే చెప్పారు రెబ‌ల్‌స్టార్ రేంజి ని ఈ లుక్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌ర్ని ఆక‌ట్టుకొవ‌టం తో యూనిట్ అంతా ఆనందంగా వున్నారు.
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, స‌త్య‌రాజ్‌, భాగ్య‌శ్రీ, కునాల్ రాయ్ క‌పూర్‌, జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌రాం, స‌చిన్ ఖేడ్‌క‌ర్‌, భీనా బెన‌ర్జి, ముర‌ళి శ‌ర్మ‌, శాషా ఛ‌త్రి, ప్రియ‌ద‌ర్శి, రిద్దికుమార్‌, స‌త్యాన్ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:  సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస ఎడిటర్ :  కొటగిరి వెంక‌టేశ్వ‌రావు యాక్ష‌న్‌, స్టంట్స్‌ : నిక్ ప‌వ‌ల్‌ సౌండ్ డిజైన్ : ర‌సూల్ పూకుట్టి  కొరియోగ్ర‌ఫి : వైభ‌వి మ‌ర్చంట్‌  కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌ : తోట విజ‌య భాస్క‌ర్ అండ్ ఎకా ల‌ఖాని వి ఎఫ్ ఎక్స్ సూప‌ర్‌వైజ‌ర్‌ : క‌మ‌ల్ క‌న్న‌న్‌ ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ : ఎన్‌.సందీప్‌ హెయిర్‌స్టైల్‌‌ : రోహ‌న్ జ‌గ్ట‌ప్‌ మేక‌ప్‌ : త‌ర‌న్నుమ్ ఖాన్ స్టిల్స్‌ : సుద‌ర్శ‌న్ బాలాజి ప‌బ్లిసిటి డిజైన‌ర్‌ : క‌బిలాన్‌ పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను  కాస్టింగ్ డైర‌క్ట‌ర్‌ : ఆడోర్ ముఖ‌ర్జి ప్రోడక్షన్ డిజైనర్ : ర‌‌వీంద‌ర్‌ చిత్ర స‌మ‌ర్ప‌కులు : "రెబ‌ల్‌స్టార్" డాక్ట‌ర్ యు వి కృష్ణంరాజు  నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌శీదా, దర్శకుడు : రాధాకృష్ణ కుమార్.

Wednesday, July 8, 2020

నాలో.. నాతో వైఎస్సార్


YS Vijayamma s Nalo Natho YSR Book Launch
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‍ రాజశేఖర్‍ రెడ్డి సతీమణి వైఎస్‍ విజయమ్మ రాసిన నాలో. నాతో.. వైఎస్సార్‍ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డి ఆవిష్కరించనున్నారు. మహానేత 71వ జయంతి సందర్భంగా వైఎస్‍ విజయమ్మ రచించిన ఈ పుస్తకాన్ని ఇడుపులపాయలో ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ విడుదల చేయనున్నారు. దివంగత నేత వైఎస్సార్‍ సహధర్మ చారిణిగా విజయమ్మ తన 37 ఏళ్ల జీవిత సారాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. అనూహ్యంగా 2009 సెప్టెంబర్‍ 2, వైఎస్సార్‍ హెలికాప్టర్‍ ప్రమాదంలో మరణించిన నాటి నుంచి కలిగిన భావోధ్వేగాల సమాహారమే ఈ పుస్తకం. మహా నేత వైఎస్సార్‍ గురించి లోకం ఏమనుకున్నది, ప్రజల నుంచి తాను తెలుసుకున్న విషయాలతో పాటు ప్రజలకు తెలియని కొన్ని అంశాలను తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చినట్లు వైఎస్‍ విజయమ్మ తొలి పలుకుల్లో తెలిపారు.

యాంటీ ట్రస్ట్ విచారణకు దిగ్గజ సీఈవోలు

Tech CEOs to testify before US House anti-trust panel on July 27

అమెరికా టెక్నాలజీ దిగ్గజ కంపెనీల సీఈవోలు హౌస్‍ జ్యూడీషియరీ కమిటీ యాంటీట్రస్ట్ (పోటీ నిరోధానికి సంబంధించి) విచారణకు ఈ నెల 27న హాజరు కానున్నారు. వీరిలో గూగుల్‍ సీఈవో సుందర్‍ పిచాయ్‍, ఫేస్‍బుక్‍ సీఈవో జుకర్‍బర్గ్, యాపిల్‍ టిమ్‍ కుక్‍, అమెజాన్‍ అధినేత జెఫ్‍ బెజోస్‍ ఉన్నారు. ఆన్‍లైన్‍ మార్కెట్‍లో పోటికి సంబంధించి యాంటీట్రస్ట్ ప్యానెల్‍ విచారణలో పాల్గొనాల్సి ఉంటుందని వాషింగ్టన్‍కు చెందిన ఓ పోర్టల్‍ పేర్కొంది.

Tuesday, July 7, 2020

యూఎస్ లో 1,30,000 దాటిన కరోనా మరణాలు

us-coronavirus-death-toll-passes-130000-johns-hopkins
కట్టడి చేయకపోతే ఇక ఆశ వదులుకోవాల్సిందే...ఆంథోనీ ఫౌసి
కరోనా వైరస్‍ అమెరికాను వణికిస్తోంది. అక్కడ లక్షల్లో కేసులు నమోదు కావడమే కాకుండా మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.  యూనైటెడ్‍ స్టేట్స్లో ప్రస్తుతం 130,284 మంది కరోనాతో మరణించారు. ఇది బ్రెజిల్‍లో మరణాల సంఖ్య కంటే రెండు రెట్లు అధికం. యూఎస్‍లో మొత్తం జనాభా 328మిలియన్లు కాగా, బ్రెజిల్‍ జనాభా 210 మిలియన్లుగా ఉంది.
కరోనా కట్టడికి అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో దేశ్యవాప్తంగా కరోనా కేసులు ఒక్కరోజే లక్షల్లో నమోదయ్యే అవకాశం ఉందని నేషనల్‍ ఇనిస్టిట్యూట్‍ ఆఫ్‍ అలెర్జీ అండ్‍ ఇన్ఫెక్షియస్‍ డీసీజేస్‍ హెడ్‍ డాక్టర్‍ ఆంథోనీ ఫౌసీ ఇప్పటికే హెచ్చరించారు. గుంపులుగా తిరగకండి...మాస్క్లు ధరించండి చెబుతున్నా పట్టించుకోవడం లేదు. దీనిపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోతే అమెరికాలో రోజుకు లక్షల్లో మరణాలు సంభవించడం ఖాయమని ఫౌసీ అఞటున్నారు. ఇప్పటికే ఈ విషయమై ఆయన పలువురితో చర్చించారు.

POCO M2 ప్రో విడుదల


POCO M2 Pro smartphone launch announcement
స్నాప్‌డ్రాగన్ 720జి5000 ఎంఎహెచ్ బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జర్ ఇన్-బాక్స్‌తో అందుబాటులోకి వస్తున్న POCO M2 ప్రో
 రూ.13,999 ధరలో ప్రారంభమయ్యే POCO M2 Pro జూలై 14 మధ్యాహ్నం 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
స్వతంత్ర స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్ POCO, నేడు  ఇప్పుడు తమ నూతన స్మార్ట్‌ ఫోన్ POCO M2 ప్రోను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. పనితీరు, సామర్థ్యాల మధ్య సమతుల్యతను కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసుకునేందుకు జులై 14 మధ్యాహ్నం 12 గంటల నుంచి రూ. 13,999  ప్రారంభ ధరలో అందుబాటులో వస్తోంది.
‘‘ఫీల్ ది సర్జ్” అనే ట్యాగ్‌లైన్‌తో POCO M2 ప్రో అత్యుత్తమ-ఇన్-క్లాస్ లక్షణాలు మరియు అధునాతన సాఫ్ట్‌వేర్‌తో అధిక-నాణ్యత కలిగిన కాంపోనెంట్లతో చక్కని సమతుల్యతను అందిస్తుంది.
నాజూకు పనితీరు చూపిస్తుంది
POCO M2 ప్రో క్వాల్‌కామ్® స్నాప్‌డ్రాగన్™ 720G ప్రాసెసర్‌తో అందుబాటులోకి వస్తుండగా, శక్తి సామర్థ్యాన్ని నిర్ధారించే 8nm ఫాబ్రికేషన్ ప్రాసెస్‌ను కలిగి ఉంది. ప్రాసెసర్‌లో ఎనిమిది క్రియో™ 465 కోర్లు (2 x గోల్డ్ - కార్టెక్స్- A76 2.3GHz వద్ద క్లాక్ చేయబడ్డాయి మరియు 6 x సిల్వర్ - కార్టెక్స్- A55 1.8 GHz వద్ద క్లాక్ చేయబడ్డాయి), మరియు క్వాల్‌కామ్ అడ్రినో™ 618 GPU ఇందులో ఉండగా, ఇది ఫోన్ పనితీరును మరియు సామర్థ్యాన్ని సమతుల్యం చేస్తుంది; మరోవైపు, స్నాప్‌డ్రాగన్‌లో ఎలైట్ గేమింగ్ లక్షణాలు ఆహ్లాదకరమైన గేమింగ్ పనితీరు హామీని అందిస్తుంది.
6GB వరకు LPDDR4X RAMతో సమ్మిళితమైన, POCO M2 Pro గేమింగ్‌తో పాటు తీవ్రమైన మల్టీ టాస్కింగ్‌కు అనుగుణంగా దీన్ని తయారు చేశారు. ఇందులో స్టోరేజ్‌ను 128 జిబి వరకు విస్తరించుకునేందుకు ప్రత్యేకమైన UFS2.1 మైక్రో ఎస్‌డి స్లాట్‌ కలిగి ఉంది.
33W ఫాస్ట్ ఛార్జర్ ఇన్-బాక్స్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఆన్‌లైన్ షాపింగ్ నుంచి గేమింగ్ వరకు, ఎక్కువ సమయం వీక్షించే సిరీస్ నుంచి పనికి సంబంధించిన ఫోన్ల వరకు; ప్రతిదీ స్మార్ట్‌ ఫోన్-ఫస్ట్ అనేలా ప్రతి ఒక్కరూ మారిపోవడంతో, వినియోగదారులకు తమ మొబైల్ ఫోను ఉపకరణంలో దీర్ఘకాలం పని చేసే బ్యాటరీ అత్యవసరం. POCO M2 ప్రో 5,000mAh అంతర్నిర్మిత బ్యాటరీని కలిగి ఉంది.
ఇది వినూత్నమైన 33W ఫాస్ట్ ఛార్జర్‌ను కలిగి ఉండగా, ఇది ఫోన్‌ను కేవలం 30 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ చేస్తుంది.
48MP AI క్వాడ్ కెమెరా
క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగిన POCO M2 ప్రో 48 ఎంపి వైడ్ కెమెరా, 8 ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 5 ఎంపి మ్యాక్రో కెమెరాతో పాటు 2 ఎంపి డెప్త్ సెన్సార్‌తో, M2 ప్రోను చాలా సమర్థవంతమైన షూటర్‌గా మార్చుతుంది.
8MP అల్ట్రా-వైడ్ కెమెరాతో వినియోగదారులు 119 డిగ్రీల కోణంలో చిత్రాలను తీసుకునేందుకు, 5MP మ్యాక్రో కెమెరా క్లోజప్ షాట్లను పూర్తి డిటెయిల్స్‌తో తీసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తూ, ఆటో-ఫోకస్‌తో అందుబాటులోకి వస్తోంది మరియు 1080p లో వీడియోలను ఇది షూట్ చేయగలదు.
సాఫ్ట్‌వేర్‌కు పెద్ద పీట వేస్తున్న POCO M2 ప్రో కెమెరా యాప్‌లో వివిధ మోడ్‌లను కలిగి, వినియోగదారులు హార్డ్‌వేర్‌ను ఎక్కువగా ఉపయోగించుకునేలా చేస్తుంది. రా మోడ్‌ను ఉపయోగించి, వినియోగదారులు తక్కువ మొత్తంలో కుదింపుతో చిత్రాలను తీసుకుని, ఫొటో ఎడిటింగ్‌లో మరింత విస్తృత సౌలభ్యాన్ని పొందవచ్చు. అయితే, ప్రో-కలర్ మోడ్ ఉపకరణంలో వీక్షణ వర్ణాలను వృద్ధి చేస్తుంది. ప్రో వీడియో మోడ్ దీన్ని కదిలే చిత్రాలకు విస్తరించింది.

వీటితో పాటు, POCO M2 ప్రో నైట్ మోడ్‌తో 16 ఎంపి స్క్రీన్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది- మొట్టమొదటిసారిగా, సముదాయం నుంచి వచ్చిన డిమాండ్‌కు ధన్యవాదాలు.
POCO లాంచర్ 2.0
POCO లాంచర్ 2.0పై పని చేయడమం అనేది వినూత్న విధానం కాగా, M2 ప్రో ఐకాన్ ప్యాక్‌లు, గ్రిడ్‌లు మొదలైన వాటితో అత్యంత అనుకూలమైన యాప్ డ్రాయర్‌ను డిఫాల్ట్‌గా మార్చుతుంది. వినియోగదారులు గతంలో ఎన్నడూ లేని విధంగా POCO మరియు Google డిస్కవర్ కోసం MIUIలో మైనస్ వన్ స్క్రీన్ మధ్య ఎంచుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది.
వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించి, POCO M2 ప్రో 16.9 సెం.మీ. (6.67 అంగుళాలు) ఫుల్ డిస్‌ప్లేను, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో పాటు జెడ్-షాకర్ హాప్టిక్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ట్రిపుల్ కార్నింగ్ ® గొరిల్లా ® గ్లాస్ 5తో, P2i నానో-కోటింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో రక్షణ అందిస్తూ, ఉపకరణాన్ని నీరు మరియు ధూళి నిరోధకంగా మార్చుతుంది. స్ట్రక్చరల్ ఫ్రంట్‌లో, POCO M2 ప్రో చట్రంపై రీ ఇన్‌ఫోర్స్‌డ్ మూలల్ని కలిగి ఉంటుంది.

NATS EVENT: Chitchat on Cricket

NATS EVENT Chitchat on Cricket An insight in to cricket world from the gallery on JULY 11

NATS EVENT: Chitchat on Cricket- An insight in to cricket world from the gallery on Saturday, JULY 11, 2020 @12:00 PM EST

Wednesday, July 1, 2020

రివ్యూ : క్రైమ్ థ్రిల్లర్ '47 డేస్'

47 days movie review
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
ఓ టి టి వేదిక : ZEE 5
నటీనటులు: సత్యదేవ్, శ్రీకాంత్ అయ్యంగార్, పూజా జవేరి, రోహిణి, రవివర్మ. సత్య ప్రకాశ్, ముక్తార్ ఖాన్, కీర్తి దామరాజు   తదితరులు
ఎడిటింగ్ : యస్. ఆర్. శేఖర్, ఆర్ట్ : బ్రహ్మ కడలి,  సంగీతం : రఘు కుంచె,
సినిమాటోగ్రఫీ : జి.కె. సహా నిర్మాత : అనిల్ కుమార్ సోహ్ని
నిర్మాతలు : విజయ్ డొంకాడ, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, దబ్బర శశి భూషణ్ నాయుడు
కథ, దర్శకత్వం : ప్రదీప్ మద్దాలి
విడుదల : 2020 జూన్ 30  
నలభై ఏళ్ళ క్రితం  మెగాస్టార్ చిరంజీవి, జయ ప్రధ హీరో హీరోయిన్లుగా వెర్సిటైల్ డైరెక్టర్ కె బాలచందర్ కాంబినేషన్‌లో వచ్చిన '47 డేస్' అనే  తెలుగు తమిళ్ సినిమా అప్పట్లో మంచి క్రేజీ  మూవీ గా వచ్చింది.    మళ్లి అదే  టైటిల్‌తో  ఓ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనడం సహజం. యువ హీరో సత్యదేవ్ హీరోగా దర్శకుడు ప్రదీప్ మద్దాలి కలయికతో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా జూన్ 30న ఓ టి టి ప్లాటుఫామ్ జీ 5 లో విడుదల అయ్యింది. సింగర్, సంగీత దర్శకుడు రఘు ఈ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించారు. ఈ లాక్ డౌన్ సమయంలో ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ అయింది. ‘జీ5’లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం  
కథ :వైజాగ్‌లో ఏసీపీగా పనిచేసే సత్య (సత్యదేవ్) చిన్నప్పటి నుండి తనతో అనాధ ఆశ్రమంలో పెరిగిన పద్దూ (రోషిణి ప్రకాష్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇక అంతా హ్యాపీగా వెళ్తున్న వాళ్ల లైఫ్ లో సడెన్ గా పద్దూ ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. అసలు పద్దూ అలా ఎందుకు చేసిందో అర్ధం కాక సత్య డిప్రెషన్ లో వెళ్లి జాబ్ నుండి సస్పెండ్ అవుతాడు.  ఆరు నెలల సస్పెన్షన్‌లో ఉంటారు. తన భార్య పద్దు మరణం  విషాదంతో బాధపడుతూ.. ఆమె మరణం వెనుక కారణాలను అన్వేషిస్తుంటాడు. అదే సమయంలో ఫార్మా కంపెనీ అధినేత శ్రీనివాసరావు అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఆ రెండు మరణాలకు పోలీకలు ఉండటంతో అధికారులు దృష్టికి తీసుకెళ్తాడు. అయితే అప్పటికే ఆ కేసు ఫైల్స్ మూసి వేయడం వల్ల దర్యాప్త చేయడానికి పోలీసు కమిషనర్ నిరాకరిస్తారు. అయితే తన ప్రయత్నాలను మానుకోకుండా రాజారాం అనే హెడ్ కానిస్టేబుల్‌ సహాయంతో దర్యాప్తు చేస్తుంటాడు. ఈ క్రమంలో జూలియట్ (పూజా జవేరి) అనే యువతి ఈ దర్యాప్తులో కీలకంగా మారుతుంది.

కథలో ట్విస్టులు తన భార్య పద్దు మరణానికి అసలు కారణమేమిటి? అదే క్రమంలో ఫార్మా కంపెనీ అధినేత శ్రీనివాసరావు మృతి వెనుక వాస్తవాలు ఏమిటి? సత్య దర్యాప్తులో తన స్నేహితుడు, పోలీస్ ఆఫీసర్ రవి (రవి వర్మ) ఎలాంటి పాత్ర పోషించాడు? ఇక రాజారాం హెడ్ కానిస్టేబుల్ (శ్రీకాంత్ అయ్యంగార్) ఎలాంటి సహకారం అందించారు. వేర్వేరు సంవత్సరాల్లో ఒకే రోజు జరిగిన రెండు మరణాలకు లింక్ ఏమైనా ఉందా? జూలియట్ ఈ దర్యాప్తులో ఎంత వరకు ఉపయోగపడిందనే చిక్కు ముడులకు సమాధానమే ఈ చిత్ర కథ.
నటి నటుల హావభావాలు:సత్యదేవ్ వన్ మ్యాన్ షోతో నడిచిన ఈ సినిమాలో.. సత్యదేవ్ రెండు గెటప్స్ లో చక్కగా నటించాడు. తన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారనిపిస్తుంది,  ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ సప్సెన్స్ సీక్వెన్స్ స్ లో సత్యదేవ్ చాలా బాగా నటించాడు. సినిమాకే హైలైట్ గా నిలిచాడు. ఇక హీరోయిన్ గా నటించిన రోషిణి ప్రకాష్ తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో హీరోయిన్ గా చేసిన పూజాజవేరి కూడా తన పరిధి మేరకు  బాగానే నటించింది. విలన్ గా నటించిన ముక్తార్ ఖాన్  కూడా చాల బాగా నటించాడు. అలాగే హీరో ఫ్రెండ్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. ఇక దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని లవ్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సెకెండ్ హాఫ్ లో ఆయన రాసుకున్న కొన్ని సస్పెన్స్ సీన్స్ మరియు విలన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ కూడా పర్వాలేదనిపిస్తోంది.
సాంకేతిక వర్గం పని తీరు :
దర్శకుడు ప్రదీప్ మద్దాలి గురించి దర్శకుడు ప్రదీప్ మద్దాలి రాసుకొన్న స్క్రిప్టులోనే చాలా లోపాలు ఉన్నాయి. నాసిరకమైన స్క్రీన్ ప్లే కారణంగా కథలో ఇన్వెస్టిగేషన్ తీరు ఆకట్టుకోలేకపోయింది. క్రైమ్ థ్రిల్లర్‌కు కావాల్సిన థ్రిల్లింగ్ మూమెంట్స్ ఎక్కడా కనిపించవు. కథాపరంగా బలంగా ఉండి ఉంటే డైరెక్షన్ పరంగా కూడా ఆకట్టుకొని ఉండే వారేమో అనిపిస్తుంది. టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా  మ్యూజిక్ సినిమాకు ప్లస్ ఆయింది. రీరికార్డింగ్ ఫర్వాలేదనిపిస్తుంది.  అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. అయితే దర్శకుడు ఆకట్టుకునే ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకుని ఉండి ఉంటే సినిమా  ఇంకా బాగుండేది.

తీర్పు :
47 డేస్’ అంటూ వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మరియు న్యూ ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నా.. ఇంట్రస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు కథనాన్ని దెబ్బ తీశాయి. అయితే ఈ లాక్ డౌన్ లో ఖాళీగా ఉంటే మాత్రం..సత్యదేవ్, శ్రీకాంత్ అయ్యంగార్ ఫెర్ఫార్మెన్స్‌ కారణంగా సినిమాకు కాస్త గౌరవం దక్కే అవకాశాలు పెరిగాయి. దర్శకుడిగా ప్రదీప్ మద్దాలి ప్రయత్నంలో నిజాయితీ కనిపించినా కథలో కొన్ని లోపాల కారణంగా ఆశించినంత ఫలితం దక్కకపోవచ్చు..... బాడ్ సినిమా మాత్రం కాదు... ఓ సారి చూడొచ్చు.  

సినీ పరిశ్రమ పాలిట శాపంగా కరోనా రక్కసి - కేవలం నాలుగు చిత్రాల రన్ తో 2020 అర్ధ భాగం


2020 ఏడాదిలో అర్ధ2020 Telugu Movies First Half Reviewభాగంగా ఒడిదుడుకుల మధ్య ముగిసిపోయింది. ఈ ఆరు నెలలలో సినిమా థియేటర్స్ రన్నింగ్ లో వున్నది  కేవలం 81 రోజులు మాత్రమే. భారీ విజయాలతో శుభారంభం అందించిన టాలీవుడ్ కరోనా  రక్కసి దెబ్బకు కుదేలయ్యింది. ప్రస్తుతం షూటింగులు, సినిమాల రిలీజ్ లేక భారతీయ సినిమా పరిశ్రమ అవస్థలు పడుతున్నది. ఇక గత ఆరు నెలల్లో సినిమాల రిలీజ్, అవి సాధించిన విజయాలు, కలెక్షన్లను ఓ సారి పరిశీలిద్దాం. జనవరి నుంచి జూన్ వరకు ఏ సినిమాలు బాక్సాఫీస్‌ను కుదిపేశాయి.. ఏ చిత్రాలు అపజయం పాలయ్యాయొ చూద్దాం. టాలీవుడ్ 2020 సంవత్సరంలో తొలి నెల జనవరిలో ఆగస్త్య మంజు దర్శకత్వం వహించిన బ్యూటిఫుల్ చిత్రంతో, అలాగే నటుడు సత్య ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఊల్లాలా ఊల్లాల చిత్రంతో మొదలైంది. ఆ తర్వాత  ఉత్తర, హల్‌చల్, వైఫ్ ఐ, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో, ఎంత మంచి వాడవురా, డిస్కో రాజా, డబ్‌స్మాష్, అశ్వత్థామ, చూసి చూడంగానే చిత్రాలు విడుదలయ్యాయి.

తరువాత  ఫిబ్రవరి నెలలలో జాను, 3 మంకీస్, సవారీ, డిగ్రీ కాలేజ్, నీవల్లే నేనున్నా, వరల్డ్ ఫేమస్ లవర్, ఒక చిన్న విరామం, శివ 143, లైఫ్ అనుభవించు రాజా, భీష్మ, ప్రెజర్ కుక్కర్, వలయం, చీమ ప్రేమ మధ్యలో భామ, రాహు, హిట్: ది ఫస్ట్ కేస్, స్వేచ్ఛ రిలీజ్ అయ్యాయి.
ఇక మార్చిలో కాలేజ్ కుమార్, పలాసా 1978, ఓ పిట్ట కథ, అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, మార్చి 13న మాధ, అర్జున చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత కరోనా విజృంభించడం, లాక్ డౌన్ కారణంగా సినిమాల ప్రదర్శన నిలిపివేయడంతో సినిమా పరిశ్రమ ఎప్పుడూ లేని సంక్షోభం లో కూరుకు పోయింది.  

ఆ తరువాత ఇక ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు  వరకు కూడా సినిమా హాళ్ల మూసివేత కొనసాగుతుండటంతో నిర్మాత, దర్శకులు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. ఏప్రిల్‌లో అమృతరామం, మే నెలలో రన్, జూన్‌లో పెంగ్విన్, కృష్ణ అండ్ హిజ్ లీల, 47 డేస్ చిత్రాలు సక్సెస్‌ఫుల్‌గా రిలీజ్ అయ్యాయి. ఇలా ఆరు నెలల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఇలా కనిపించింది. ఈ అయిదు చిత్రాలలో కేవలం ఒకే ఒక చిత్రం కృష్ణ అండ్ హిజ్ లీల ని జనాలు  స్ట్రీమింగ్ చేస్తున్నారు.  
2020 ఏడాదిలో తెలుగు సినిమా పరిశ్రమకు జోష్‌ను ఇచ్చిన చిత్రాల్లో అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు ముందు వరుసలో ఉంటాయి. ఈ చిత్రాలు రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం 262 కోట్ల గ్రాస్ అంటే 161.22 కోట్ల షేర్ ని రాబట్టింది. అలాగే మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతూ 260 కోట్ల గ్రాస్ అంటే 144 కోట్ల షేర్ ని  సొంతం చేసుకొన్నది. ఇక భీష్మ 28.52 కోట్ల షేర్ ని,  హిట్ 7.26 కోట్ల వసూళ్లు సాధించడంతో హిట్ చిత్రాలుగా నిలిచాయి.
బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్‌ను కలెక్షన్లపరంగా డిజాస్టర్ అయినా  చిత్రాల్లో రవితేజ నటించిన' డిస్కో రాజా' (7.81 కోట్లు),  సమంత, శర్వానంద్ నటించిన' జాను' (7.92 కోట్లు), విజయ్ దేవరకొండ నటించి 'వరల్డ్ ఫేమస్ లవర్' రూ.9.17 కోట్లు, నాగశౌర్య నటించిన' అశ్వత్తామ' రూ.4.31 కోట్లు, కల్యాణ్ రామ్ నటించిన 'ఎంత మంచి వాడవురా' రూ.(6.38) కోట్లు రాబట్టాయి. అయితే ఈ చిత్రాలు చేసిన బిజినెస్ కంటే తక్కువగా వసూళ్లను రాబట్టడంతో డిస్టిబ్యూటర్లు నష్టపోయారనేది సినీ మార్కెట్ అభిప్రాయం. 

87 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఉత్సవాలు రద్దు

Lalbaugcha Raja, Ganesh Festival Mumbais Biggest Cancelled Due To Covid
ముంబయి వాసులకు లాల్‍బాగ్చా రాజా గణపతీ పై .. కరోనా ప్రభావం ఆయన మీద కూడా పడింది. ఈ సారి లాల్‍బాగ్ఛా రాజా ఉత్సవాలకు అక్కడి ప్రజలు దూరం కానున్నారు. వైరస్‍ ఉద్ధ•తి కారణంగా ఈ ఏడాది లాల్‍బాగ్‍ ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు నిర్ణయించారు. 87 ఏళ్ల చరిత్రలో ఉత్సవాలను రద్దు చేయడం ఇదే తొలిసారి. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో  ఈ ఏడాది విగ్రహాన్ని ప్రతిష్టించడం లేదు అని లాల్‍ బాగ్‍ గణేశ్‍ మండలి కార్యదర్శి సుధీర్‍ సాల్వి వెల్లడించారు. ముంబయిలోని లాల్‍బాగ్‍ వద్ద ఏటా గణేశ్‍ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు పెద్దఎత్తున హాజరవుతుంటారు. అయితే ఈ ఏడాది పండగ సమయంలో రక్తదాన,  ప్లాస్మా థెరసీ శిబిరాలను ఏర్పాటు చేయనున్నామని నిర్వాహకులు వెల్లడించారు.