Saturday, April 25, 2020

ఇలాంటి లక్షణాలు కరోనాకు సంకేతాలు!



ఇలాంటి లక్షణాలు కరోనాకు సంకేతాలు!
మీ కాలి వేళ్లలో ఏమైనా మార్పులు కనిపించాయా? కాలి వేళ్ల గోరు చుట్టూ లేదా కాళ్ల కింద చర్మం పగిలినట్లు లేదా కమిలినట్లు ఉన్నదా? దురద లేక నొప్పి కలుగుతున్నదా? ఇలాంటి లక్షణాలు కరోనాకు సంకేతాలు కావచ్చని అమెరికా వైద్యులు చెబుతున్నారు. కొవిడ్‍ టోస్‍ గా పేర్కొనే ఈ లక్షణాలు ఎక్కువగా పిల్లలు, యువతతోపాటు కొద్దిపాటి వైరస్‍ లక్షణాలున్న వారిలో కనిపిస్తున్నట్లు చర్మ వ్యాధి నిపుణుడు డాక్టర్‍ అమీ పల్లెర్‍ తెలిపారు. అయితే ఇవి కరోనా లక్షణా లేనా అన్నది కచ్చితంగా చెప్పలేమన్నారు.

ఎన్టీఆర్ సరసన శ్రుతిహాసన్ ?



ఎన్టీఆర్ సరసన శ్రుతిహాసన్ ?
అరవిందసమేత  వీరరాఘవ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్‍, దర్శకుడు త్రివిక్రమ్‍ కాంబినేషన్‍లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్‍.రాధాకృష్ణ(చినబాబు), నందమూరి కల్యాణ్‍రామ్‍ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో కథానాయికగా ఇప్పటివరకు పూజా హెగ్డే, కియారా అద్వానీల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలోని హీరోయిన్‍ పాత్ర కోసం శ్రుతీహాసన్‍ పేరు కూడా చిత్రబృందం పరిశీలిస్తోందనే టాక్‍ ఫిల్మ్ నగర్‍లో వినిపిస్తోంది. దాదాపు ఏడేళ్ల క్రితం వచ్చిన రామయ్యా వస్తావయ్యా చిత్రంలో ఎన్టీఆర్‍ సరసన ఓ కథానాయికగా శ్రుతీహాసన్‍ నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. మళ్లీ ఈ జోడీ కుదురుతుందా? వెయిట్‍ అండ్‍ సీ.

5 సెకన్లలో కరోనా పరీక్ష

5 సెకన్లలో కరోనా పరీక్ష
వ్యక్తులను తాకకుండా వారి నుంచి ఎలాంటి నమూనాలు సేకరించకుండా, కేవలం ఐదు క్షణాల్లో కరోనా గుట్టును తేల్చే ఎక్స్ర్‍ సాఫ్ట్ వేర్‍ పరీక్షా విధానం కొలిక్కి వచ్చింది. ఈ సాఫ్ట్వేర్‍ను ఉపయోగించడానికి ఆమోదం తెలపాలంటూ రూర్కీ ఐఐటీ ఇండియన్‍ కౌన్సిల్‍ ఆఫ్‍ మెడికల్‍ రీసెర్చ్ (ఐసీఎంఆర్‍)ను కోరింది. రూర్కీ ఐఐటీలోని సివిల్‍ ఇంజినీరింగ్‍ విభాగం ప్రొఫెసర్‍ కమల్‍ జైన్‍ మాట్లాడుతూ సాఫ్ట్వేర్‍లో ఒక వ్యక్తి ఛాతి ఎక్స్రేను అప్‍లోడ్‍ చేయగానే కేవలం ఐదు సెకన్లలోనే కొవిడ్‍ 19 వైరస్‍ సోకిందా? లేదా? అనే ఫలితం వస్తుందన్నారు.