Monday, May 25, 2020

ఎపీలో పాల‌న‌పై మేథోమ‌ధ‌నం నేటి నుంచి...

ఎపీలో పాల‌న‌పై మేథోమ‌ధ‌నం నేటి నుంచి...

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త పార్టీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌వుతున్న సంద‌ర్భంగా ప్ర‌భుత్వం మేధో మ‌ధ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నుంది. ఏడాది కాలంలో చేసిన ప‌నులు చేయాల్సిన ప‌నుల‌పై స‌మీక్ష‌ల‌తో ఈ మేధో మ‌ధ‌నం సాగ‌నుంది. సోమ‌వారం ప్రారంభ‌మ‌య్యే ఈ మేథో్ మ‌ధ‌న కార్య‌క్ర‌మం ఈ నెల 30 వ‌ర‌కూ కొన‌సాగుతుంద‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. 
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను  నెరవేర్చే దిశగా  రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వం లోని ప్రభుత్వo ఏడాది కాలంలో చేప‌ట్టిన‌ ప్రభుత్వ సం క్షేమ పథకాల అమలు పై నే ప్ర‌ధానంగా ఈ మేధోమథనం జ‌రుగ‌నుంది. ఇందులో భాగంగా   తిరుపతి ఎస్. వి యూనివర్సిటీ సెనేట్ హాల్ వేదికగా రేపటి నుండి 29వ తేదీ వరకు మన పాలన‌- మీ సూచన పేరుతో ఆ జిల్లా మంత్రుల స్వీయ పర్యవేక్షణ లో ప్రజలు, లబ్ధిదారులు,నిపుణుల తో ప్ర‌త్యేక కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త తెలిపారు... 

5 రోజ‌లు...కార్య‌క్ర‌మాలివీ...
సోమ‌వారం ఉ.10.25 గంటల కు మేథో మ‌ధ‌న కార్యక్రమం ప్రారంభమవుతుందని, 10:30 గంటల నుండి 1.30 గంటల వరకు రాష్ట్ర స్థాయిలో సీఎం క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని, 1-30 నుంచి 2-30  వరకు భోజన విరామం అనంతరం 2:30 గంటలకు   జిల్లా కలెక్టర్ ప్రారంభోత్స‌వ ప్ర‌సంగం అనంతరం జిల్లా ఇం చార్జి  మంత్రి  గౌతమ్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిలు ప్ర‌సంగిస్తారు.  అనంత‌రం సంబంధిత శాఖ‌ల‌కు సంబంధించి స‌మీక్ష ఉంటుంది. అలాగే సా.4 గం నుండి 5 గంల వరకు పథకాల లబ్ధిదారుల తో ముఖాముఖి నిర్వ‌హిస్తున్నారు. మొదటి రోజు పరిపాలన సంస్కరణలు, సంక్షేమం.. పరిపాలన వికేంద్రీకరణ పై తీసుకున్న చర్యలు 
రెండవ రోజు వ్యవసాయం, అనుబంధ రంగాలపై చర్చ మూడవ రోజున విద్యా రంగ సంస్కరణలు పథకాలపై లబ్ధిదారులు, నిపుణులతో మేఘమధనం , నాల్గవ రోజున పరిశ్రమలు, పెట్టుబడుల రంగo, నైపుణ్యాల పెంపు వాటర్ గ్రిడ్ ఇతర సంబంధిత అంశాలపై చర్చ, ఐదో రోజున వైద్య ఆరోగ్య శాఖ లో సంస్కరణ లు,ఆరోగ్యశ్రీ పైన స‌మీక్ష‌లు జ‌రుగుతాయి. చివ‌ర‌గా 30 న రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్రారంభిస్తారు. 

ఇది అంతులేని వింత క‌థ‌...!


ఇది అంతులేని వింత క‌థ‌...!
ప్ర‌భాస్‌, అనుష్క ఇద్ద‌రూ క‌లిసి బిల్లా, మిర్చి, బాహుబ‌లి సిరీస్‌లో న‌టించారు. ఈ ఇద్ద‌రి గురించి మొద‌టి నుంచి రూమ‌ర్స్ వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నార‌నే రూమ‌ర్స్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. వీళ్లకు సంబంధించి ఎప్పుడు న్యూస్ బ‌య‌టికి వ‌చ్చినా దాన్ని ఇద్ద‌రూ ఖండిస్తూ వ‌స్తున్నారు. తామిద్ద‌రం స‌హ‌స‌టులం, మంచి స్నేహితులం. అంతేత‌ప్ప మా మ‌ధ్య ఎలాంటి ఎఫైర్ లేదు అని ప‌దే ప‌దే చెబుతున్నారు.
ఈ విష‌యాన్ని కృష్ణంరాజు కూడా చాలా సార్లు ఖండించారు. అయినా వీరికి సంబంధించిన రూమ‌ర్స్ అస్స‌లు త‌గ్గ‌డం లేదు. ఏదో ఒక సంద‌ర్భంలో ప్ర‌భాస్‌, అనుష్క‌ల ప్రేమాయ‌ణం గురించి మీడియాలో ప్ర‌స్తావ‌న వ‌స్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఈమ‌ధ్య అనుష్క త‌ల్లి ప్ర‌ఫుల్లా శెట్టి సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందిస్తూ..`అనుష్క, ప్ర‌భాస్ స‌హ‌న‌టులు మాత్ర‌మే. వారి మ‌ధ్య ఎలాంటి ఎఫైర్ లేదు. అయితే నిజ జీవితంలో అనుష్క‌కు ప్ర‌భాస్ లాంటి ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ జీవిత భాగ‌స్వామి కావాల‌ని కోరుకుంటున్నాను` అని వ్యాఖ్యానించింది. దీంతో ప్ర‌భాస్‌, అనుష్క వ్య‌వ‌హారం మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. మ‌రి దీనిపై నెటిజెన్లు ఎలా స్పందిస్తారో! ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూడాలి.

Saturday, May 16, 2020

ఉద్యోగులకు జొమాటో ఉద్వాసన

ఉద్యోగులకు జొమాటో ఉద్వాసన
తమ సిబ్బందిలో 13 శాతం మందిని తొలగించబోతున్నట్టు ఆన్‍లైన్‍ పుడ్‍ ఆర్డిరింగ్‍ ప్లాట్‍ఫామ్‍ జొమాటో ప్రకటించింది. కోవిడ్‍ 19 సంక్షోభం ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. గత రెండు నెలల్లో కంపెనీ వ్యాపారం ఊహించనివిధంగా మారిపోయింది. ఈ మార్పులు శాశ్వతంగా ఉంటాయని భావిస్తున్నామని జొమాటో స్థాపకుడు, సీఈవో దీపిందర్‍ గోయెల్‍ కంపెనీ వైబ్‍సైట్‍లో పేర్కొన్నారు. జొమాటోలో ఎక్కువ కాలం పని లభించని ఉద్యోగులు ఆరు నెలలపాటు 50 శాతం జీతంతో కొనసాగవచ్చని ప్రకటించారు.

'అల‌.. వైకుంఠపురములో’ మరో కొత్త రికార్డు

'అల‌.. వైకుంఠపురములో’ మరో కొత్త రికార్డు
అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘అల‌.. వైకుంఠపురములో’. జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి రికార్డ్‌ కలెక్షన్లు సాధించడమే కాకుండా మ్యూజికల్‌గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. సినిమా విడుదల‌కు ముందే ఈ చిత్రంలోని ‘సామజవరగమనా..’ ‘రాములో రాములా..’, ‘బుట్టబొమ్మా బుట్టబొమ్మా..’ పాటలు కొత్త రికార్డులు సృష్టించాయి. ఈ సినిమా విడుదలై 5 నెల‌లు దాటిపోయినా ఏదో ఒక విధంగా ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలికాలంలో లాక్‌డౌన్‌ కారణంగా అందరూ ఇంటికే పరిమితం కావడంతో తమకు నచ్చిన పాటల‌కు టిక్‌టాక్‌లు చేయడం, డాన్సులు చేస్తూ వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం వంటివి చేస్తున్నారు.
బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పాశెట్టి, ఒకప్పటి టాప్‌ హీరోయిన్‌ సిమ్రాన్‌, అస్ట్రేలియా క్రికెట్‌ ప్లేయర్‌ డేవిడ్‌ వార్నర్‌ ‘బుట్టబొమ్మా..’ పాటకు స్టెప్పులేస్తూ తీసిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం విశేషం. కలెక్షన్లపరంగా, మ్యూజికల్‌గా ఇన్ని రికార్డులు క్రియేట్‌ చేసిన ‘అల‌.. వైకుంఠపురములో’ చిత్రం మరో రికార్డును సాధించింది. ఈ చిత్రంలోని పాటలు 1 బిలియన్‌ వ్యూస్‌ సాధించాయి. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్‌ సంస్థ తమ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. ‘
అల‌.. వైకుంఠపురములో’ ఆల్బ‌మ్‌ను సూపర్‌హిట్‌ చేసి 1 బిలియన్‌ వ్యూస్‌ సాధించేలా చేసిన సంగీత ప్రియుల‌కు ధన్యవాదాలు. ఈ చిత్రంలో నటించిన నటీనటుల‌కు, సంగీత దర్శకునికి, గీత రచయితల‌కు, సింగర్స్‌కు, ఇతర చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేసింది గీతా ఆర్ట్స్‌..

Friday, May 15, 2020

గుంటూరులో 500 పేద కుటుంబాలకు నాట్స్ సాయం.

గుంటూరులో 500 పేద కుటుంబాలకు నాట్స్ సాయం.
తెలుగునాట లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన వంతు సాయం చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలోని ప్రగతి నగర్, మదర్ థెరిస్సా, కాలనీలలో 500పేద కుటుంబాలకు నాట్స్ నిత్యావసరాలను పంపిణీ చేసింది.
నాట్స్ ఉపాధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి ఆర్థిక సాయంతో నాట్స్ ఈ నిత్యావసరాలను సామాజిక దూరం పాటిస్తూ పేదలకు అందించింది. శాసనమండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు చేతుల మీదుగా పేదలకు ఈ సాయం చేయడం జరిగింది. గుంటూరు నగరంలో లాక్‌డౌన్‌తో ఉపాధి లేక పేదలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న విషయం బాపయ్య చౌదరి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆయన స్పందించి 500 పేద కుటుంబాలకు సాయం చేయడం నిజంగా అభినందనీయమని లక్ష్మణరావు అన్నారు..
భవిష్యత్తులో కూడా పేదలకు, పేద విద్యార్ధులకు సాధ్యమైనంత సాయం చేయాలని ఆయన కోరారు. సేవే గమ్యం అనే నినాదం తో నాట్స్ ఇలాంటి మరెన్నో భవిష్యత్‌ కార్యక్రమాల ద్వారా నిరూపిస్తుందని నాట్స్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి పేర్కొన్నారు.

మహేష్ తో ఒకసారి మిస్ చేసుకున్నా....ఈ సారి వదిలిపెట్టను - క్వీన్ కంగ‌నారౌన‌త్

మహేష్ తో ఒకసారి మిస్ చేసుకున్నా....ఈ సారి వదిలిపెట్టను - క్వీన్ కంగ‌నారౌన‌త్
జాతీయ స్థాయిలో నటనా పరంగా ప్రతిభ వున్నా నటి క్వీన్ కంగ‌నారౌన‌త్. ఆమె పర్సనల్ విష‌యానికి వస్తే త‌న‌కు ఏది మ‌న‌సుకు అనిపిస్తే దానిని నిర్మోహ‌మాటంగా, ఎదుటి వారు బాధ‌ప‌డతారేమో అనే ఆలోచ‌న లేకుండా ముఖం మీద‌నే చెప్పేయ‌డం కంగనా నైజం. అంద‌రు అది పొగ‌రు అంటే ఆమె మాత్రం దానిని త‌న ముక్కుసూటిత‌నం అని అంటుంది. ఆమె ప్ర‌వ‌ర్త‌న కొంద‌రికి మాత్రం బాగా న‌చ్చుతుంది. కానీ ఇదే ముక్కుసూటిత‌నం ఈమెని ప‌లు వివాదాల్లో ఉంటుంది. ఈమె చేసింది ఒకే ఒక తెలుగు చిత్రం ఏక్ నిరంజ‌న్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టించిన విష‌యం తెలిసిందే. అప్పట్లో అందిరితో కలివిడిగా వుండే అజాత శత్రువు డార్లింగ్ ప్ర‌భాస్ తో కూడా ఈమె ఏక్ నిరంజ‌న్ స‌మ‌యంలో గొడ‌వ ప‌డింద‌ని అంటారు. ఇక త‌న మాజీ బోయ్ ఫ్రెండ్ హృతిక్ రోష‌న్ నుంచి దీపికా ప‌డుకోనే వ‌ర‌కు అంద‌రు ఈమె టార్గెట్ కి గురైన‌వారే. అలాగ‌ని త‌న తీరుని మార్చుకునే ర‌కం కాదు ఈమె. తాజాగా ఈమె ఓ ఇంట‌ర్వ్యూలో తాను మిస్ అయిన ప‌లు చిత్రాల గురించి చెప్పుకొచ్చింది.
మ‌హేష్ బాబు కెరీర్ లోనే పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన పోకిరి చిత్రం టాలీవుడ్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. పోకిరి మూవీ ఓ ట్రెయిన్డ్ సెట్ చేసి మ‌హేష్ ప్రిన్స్ స్థాయి నుంచి టాలీవుడ్ సూప‌ర్ స్టార్ అయ్యాడు. 2006లో విడుద‌లైన పోకిరి చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా న‌టించింది. పోకిరి త‌ర్వాత ఇలియానా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఏకంగా టాలీవుడ్‌లోనే కోటి రూపాయ‌ల పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకుంది. అయితే ఈ చిత్రంలో మొదట మ‌హేష్‌తో న‌టించే అవ‌కాశం క్వీన్ కంగ‌నా రౌన‌త్‌కి వ‌చ్చింద‌ట‌. ఈ విష‌యాన్ని కంగ‌నానే ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ, నేను మొద‌ట నాగార్జున హీరోగా నటించిన 'బాస్ ఐ ల‌వ్ యూ' చిత్రం కోసం ఆడిష‌న్స్ కి హాజ‌ర‌య్యాను. అక్క‌డ చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. ఆడిష‌న్స్ ఎలాగో క‌ష్ట‌ప‌డి పూర్తి చేసినా అందులో న‌టించ‌డం ఇష్టం లేక ఆ చిత్ర యూనిట్ కి దొరక్కుండా నా ఫోన్ నెంబ‌ర్ మార్చేసాను. ఆ త‌ర్వాత కొత్తవారితో గ్యాంగ్ స్ట‌ర్ అనే మూవీ ఆడిష‌న్స్ కి వెళ్లాను.
అదే స‌మ‌యంలో పూరీ జ‌గ‌న్నాథ్ మ‌హేష్ పోకిరి కోసం ఆడిష‌న్స్ జ‌రుపుతూ ఉంటే దానికి కూడా హాజ‌ర‌య్యాను. ఒకేసారి గ్యాంగ్ స్ట‌ర్, పోకిరి రెండు చిత్రాల‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. గ్యాంగ్ స్ట‌ర్ కి డేట్స్ ఇచ్చేయ‌డం వ‌ల్ల పోకిరి చిత్రం అవ‌కాశాన్ని వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. నేను డేట్స్ ఇచ్చిన సినిమా ఆర్థికపరంగా ఇబ్బందులు ఉండడం వల్ల నేను ఒక్క షాట్ కూడా చేయకుండానే అది ఆగిపోయింది. ఆనాడు ఒక వేళ పోకిరిలో న‌టించి ఉంటే టాలీవుడ్ లో నేను మరింత ఉన్నత స్థానం లో ఉండేదానిని అని చెప్పుకొచ్చింది. నిజ‌మే.. ఎందుకంటే పోకిరి సినిమాయే ఒక సంచ‌ల‌నం.
ఆ సినిమాతో ఐటెం గర్ల్ గా చేసిన ముమయత్ ఖాన్ ఫుల్ బిజీ అయ్యింది. ద‌క్షిణాదిన హీరోలలో నాకు మ‌హేష్ అంటే చాలా ఇష్టం. అవకాశం వస్తే మ‌హేష్ బాబుతో ఖ‌చ్చితంగా ఓ చిత్రం చేస్తాను. మ‌హేష్‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని మాత్రం బ‌ల‌మైన కోరిక‌గా ఉంద‌ని కంగ‌నా చెప్పుకొచ్చింది. మరి ఆ కాంబినేషన్ ఏ దర్శకుడు సెట్ చేస్తాడో చూద్దాం.

మనిషి విలువలు పెరిగి మానవత్వం పరిమళిస్తున్న సమయం ఈ కరోనా లాక్ డౌన్ -‌ గోపీచంద్‌

మనిషి విలువలు పెరిగి మానవత్వం పరిమళిస్తున్న సమయం ఈ కరోనా లాక్ డౌన్ -‌ గోపీచంద్‌

కరోనా సంక్షోభం వలన సినిమా షూటింగు లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు తన వంతు సహాయం అందించాడు గోపీచంద్. అంతే కాకుండా తన ఇంటి పరిసరాల్లో వున్నా పేద కుటుంభాలకు నిత్యావసర వస్తువులు, ఆహరం అందించి తన ఉదారతను చాటుకున్నా ఈ మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా స్విలర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న భారీ చిత్రం ‘సీటీమార్‌’. ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. తరుణ్‌ అరోర ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 50% చిత్రీకరణ పూర్తి చేసుకుని లాక్‌డౌన్‌ వల్ల వాయిదా పడిరది. కరోనా ప్రభావంతో స్టే హోమ్ స్టే సేఫ్ పాటిస్తూ ఈ విరామ సమయం లో ఏం చేస్తున్నారో మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ చెప్పిన ముచ్చట్లివీ...
షూటింగ్‌కి వెళ్లడం లేదే అని మీ వాళ్ళు ఏమైనా అడుగుతున్నారా?
- మా పెద్దబ్బాయి విరాట్‌ అడిగాడు. కరోనా వైరస్‌ వచ్చిందనీ, బయటికి వెళ్లకూడదని, చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పా. తనక్కూడా అర్థమైంది. ఇంట్లోకి ఎవ్వరినీ రానివ్వకూడదు కదా అంటూ, శానిటైజర్‌తో చేతు కడుగుతున్నాడు (నవ్వుతూ). ఆరేళ్లొచ్చాయి కాబట్టి ఏం చెప్పినా వెంటనే అర్థం చేసుకుంటున్నాడు.
కుటుంబంతో గడిపేందుకు ఇదొక మంచి అవకాశం కదా?
- మా పెద్దబ్బాయితో హోమ్‌ వర్క్‌ చేయిస్తున్నా, డ్రాయింగ్‌ వేయిస్తున్నా. బిజిగా తీరిక లేని జీవితంతో ఫామిలీతో గడపలేకపోయిన వాళ్లకి ఈ విరామం గొప్ప అవకాశం. ఇది వరకు నేను పిల్లల్ని చూసుకోవడంలో కష్టం ఏముందిలే అనుకునేవాణ్ని. అసలు విష్యం ఇప్పుడు అర్థమవుతోంది. మా చిన్నబ్బాయి వియాన్‌ ఇప్పుడు పరిగెడుతున్నాడు. ఇద్దరూ ఏదో ఒక వస్తువు కోసం పోటీపడుతుంటారు. వాళ్లని కంట్రోల్‌ చేయడం చాలా పెద్ద పనే.
కరోనా పరిణామాలపై మీకెలాంటి ఆలోచలు వస్తున్నాయి?
- లోకమంతా ఇలా ఒకే విషయంపై ఆగిపోయే రోజులొస్తాయని కలలో కూడా ఊహించలేదు. ప్రపంచానికి ఇదొక సంకేతంలా అనిపిస్తోంది. యంత్రం లా స్పీడ్ గా కొనసాగే లైఫ్ లో ఓయ్ కొంచెం ఆగండి, మీరేం చేస్తున్నారో ఒక్క సారి ఆలోచించండి అని చెప్పినట్టు ఉంది. ఈ కొన్నాళ్లల్లోనే ప్రకృతిలో చాలా మార్పు చూశా. యాభై శాతం కాలుష్యం తగ్గిపోయింది. పక్షులు, జంతువుల స్థానాన్ని మనం ఇంతగా ఆక్రమించేశామా అనిపించింది. మా ఇంటి పక్కన పార్క్‌లో పక్షులు ఉండేవి కాదు. ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటి కిల కిల రవాలతో మనసు ఎంతో ఆహ్లదపరుస్తోంది.
దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ వాటికి ఇప్పుడు వచ్చినట్టు అనిపిస్తోంది. కరోనా వల్ల మనలో మార్పు వస్తుంది. ఇకపై మన జీవితాలు మరోలా ఉండబోతున్నాయి అనిపిస్తుంది. ఇప్పుడు డబ్బున్నోడు, లేనోడు ఒక్కటే. ఒకరికొకరు సాయం చేసుకోవాలి, పక్కవాడు బాగుంటే మనం బాగుంటామనే ధోరణిలో మనం ఆలోచిస్తున్నాం. మనిషి విలువ ఇప్పుడు తెలుస్తుంది.
లాక్ డౌన్ తర్వాత సినీ పరిశ్రమలో పరిస్థితులు ఇదివరకటిలా ఉండవేమో కదా? 
- కచ్చితంగా కొన్ని మార్పులైతే వస్తాయి. కరోనాకి వ్యాక్సిన్‌ వచ్చాక గానీ అందరికీ పూర్తిగా ధైర్యం రాదు. అప్పటిదాకా భయంగా భయంగా బతకాల్సిందే. సినిమా అంటే ఎక్కువమంది కలిసి పనిచేయాల్సి ఉంటుంది, సినిమా చూసేది కూడా సమూహంగానే. మనం కష్టపడి చిత్రీకరణ పూర్తి చేసినా థియేటర్‌కి ప్రేక్షకులు రావాలి కదా, వాళ్లు రావాలంటే ముందు భయం తొలిగిపోవాలి. ఇదంతా జరగడానికి సమయం పడుతుంది.
ఈ సమయంలో మీకు ఏమైనా మిస్‌ అయ్యామన్న ఫీలింగ్‌ ఉందా?
` స్నేహితుతో కలిసి గడపడమంటే నాకు చాలా ఇష్టం. అదిప్పుడు బాగా మిస్‌ అవుతున్నా. ఫోన్‌లో టచ్‌లో ఉంటున్నాం. ప్రభాస్‌, నేను అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నాం. కరోనా ప్రభావం మొదలైన సమయంలోనే తను జార్జియా వెళ్లాడు. నేను ‘అక్కడ ఇలా ఉందంట, ఇక్కడిలా ఉందంట.. జాగ్రత్త’ అంటూ మెసేజెస్‌ పంపుతుండేవాణ్ని. ‘ఏం పర్లేదురా, ఇప్పటివరకూ బాగానే ఉంది, మేం కూడా వచ్చేస్తున్నాం’ అని తిరిగి వచ్చేసాడు. తను తిరిగొచ్చాక 14 రోజు స్వీయ క్వారంటైన్‌లోనే ఉన్నాడు’’.
ప్రస్తుతం మీరు చేస్తున్న ‘సీటీమార్‌’ సినిమా ఎంతవరకూ వచ్చింది? 
‘- 'సీటీమార్‌’ సినిమా 50 శాతం పూర్తయింది. ద్వితీయార్ధం మొదలైన సమయంలోనే కరోనాతో బ్రేక్‌ పడిరది. కుటుంబ అనుబంధాతో కూడిన క్రీడా నేపథ్య చిత్రం. నేను, తమన్నా ఇద్దరం కబడ్డీ కోచ్లుగా కనిపిస్తాం. ప్రొ కబడ్డీ చూసి నా పాత్ర కోసం సిద్ధమయ్యా. ఆట గురించి అన్ని విషయాలు తెలుసుకున్న.. అలాగే సంపత్‌ నందితో ఇదివరకే ఒక సినిమా చేశాను. వెరీ టాలెంటైడ్‌ డైరెక్టర్‌. ఈ చిత్రాన్ని కూడా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవ విడుదల చేసిన ఫస్ట్‌ుక్‌కి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి గారు ప్రెస్టీజియస్‌గా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
మీ సినీ కెరీర్లో ఒక మలుపు తిప్పిన తేజతో సినిమా ఎప్పుడూ?
- తేజతో నేను ఎప్పుడో సినిమా చేయాలి. ఆయన ఈమధ్యే ‘అలివేలు మంగ వేంకటరమణ’ అనే కథ చెప్పారు. అది చాలా నచ్చింది. ఆమధ్య రజనీకాంత్‌ సినిమాలో నటిస్తున్నావట కదా అని కొంతమంది తమిళ స్నేహితు ఫోన్‌ చేసి అడిగారు. నిజం కాదని చెప్పా. రజనీతో సినిమా చేస్తున్న దర్శకుడు శివ, నేను కలిసి రెండు సినిమాలు చేశాం. శివ, నేను అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటాం. మీరెప్పుడు చెబితే అప్పుడు సినిమా చేస్తాను సర్‌ అంటుంటాడు. ‘నువ్వు తమిళంలో బాగా చేస్తున్నావు కదా, పెద్ద హీరోతో చేయడం నీకు మంచిది. మనం తర్వాత చూసుకుందాం’ అని చెబుతుంటా’.

Thursday, May 14, 2020

TANA fight against COVID 19 with Indian Red Cross Society in Repalle

TANA fight against COVID 19 with Indian Red Cross Society in Repalle

TANA masks are distributed with TANA LOGO & REDCROSS logo on the occasion of the Indian Red Cross 100 years celebration. 1000 TANA masks are distributed to blood donors along with certificates by chief guest Honorable AP minister Sri Mopidevi Venkata Ramana on 5/8/2020 at Repalle government hospital and REDCROSS office. Ex- MLA Sri Devineni Mallikarjunrao, TANA FOUNDATION TRUSTEE Yarlagadda Venkata Ramana, DCFS, MRO, CI, Repalle Hospital Superintendent, REDCROSS secretary Dr. Vasantha Veera Raghavayaa Garu and other dignitaries participated. It is a huge success and everyone appreciated the masks with logos.

TACO Virtual 5K Run/Walk for Charity on May 23


TACO Virtual 5K Run/Walk for Charity on May 23
TACO Virtual 5K Run/Walk for charity.
Where: Walk/Run On a trail, On a treadmill, in your neighborhood.
When: Friday 5/15/2020 to Saturday 5/23/2020
How: Register online at http://tacosite.com/taco/v5krun/ (deadline to register is May 23, 2020). Run or walk your 5K (3.1 miles).
Wear your Fit bit/Apple Watch or Track Manually. Submit your finish photo to taco5kcharity@gmail.com.  
Donation:
$10 registration per Person.
$25 registration per Family.
Proceeds will be used towards Columbus Blessing Boxes/COVID Relief.
Virtual 5K Closing Event: Health Webinar to discuss important information about Maintaining Health and Wellness during current situation on Saturday, May 23rd, 2020 at 5 PM via Zoom Call. Details to follow.

TATA Presents Live Telecast of Music Beatz with Sreerama Chandra

TATA Presents Live Telecast of Music Beatz with Sreerama Chandra
Telangana American Telugu Association presents
Live Telecast of Music Beatz
with
Sreerama Chandra(Indian Idol Fame)
on
Friday, May 15,20209.00 PM EDT | 8.00 PM CDT | 6.00 PM PDT
Please Subscribe & Watch Live On 

దాన కర్ణుడి వారసత్వం మనకు రాలేదా?

దాన కర్ణుడి వారసత్వం మనకు రాలేదా?
'కరోనాకూడా ప్రకృతి వైపరీత్యమేడబ్బున్నవారు మానవత్వం చూపించే తరుణం ఇదేఎంత సంపాదించినా ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే
‘ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కర్ణుడి దానగుణాన్ని స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నాడుఅనుకున్న వెంటనే ఆయన కర్ణుడి వద్దకు వెళ్లారు సమయంలో కర్ణుడు అభ్యంగ స్నానానికి సిద్ధం అవుతూ తలకు నూనె రాసుకుంటున్నాడుఆయనకు ఎడమ వైపు రత్నాలు పొదిగిన నూనె గిన్నె ఉంది... కుడి చేతిలో నూనె ఉందిశ్రీకృష్ణుడి దృష్టి నూనె గిన్న మీద పడిందికర్నా..ఆ గిన్నె ఎంతో బాగుందినాకిస్తావాఅని అడిగాడువెంటనే కర్ణుడు ఒక్క క్షణం అయినా ఆలోచించకుండా ఎడమ చేత్తో గిన్నె తీసితీసుకో కృష్ణాఅని ఇచ్చాడుదానికి కృష్ణుడుకర్ణా ఎడమ చేత్తో దానం చేయటం మంచిది కాదని నీకు తెలియదా...అని ఆక్షేపించాడుదానికి కర్ణుడుకృష్ణానా కుడిచేతిలో నూనె ఉందిచేయి శుభ్రం చేసుకొని వచ్చి కుడిచేత్తో పట్టుకొని గిన్నె నీకు ఇచ్చే లోపు ఏమైనా జరగవచ్చునా ప్రాణాలు పోవచ్చులేదా నా ఆలోచన మారిపోవచ్చుఅందుకే అటువంటిదేమీ జరగకుండా వెంటనే నూనె గిన్నె ఇచ్చేశానుఅంతేగానీ ఎడమ చేత్తో దానం ఇవ్వకూడదనే విషయం తెలియక కాదుఆహాదానశీలతలో కర్ణుడిని మించిన వారు లేరుఅని శ్రీకృష్ణుడు సంతోషించాడు…”
ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే భరత జాతి ముద్దుబిడ్డలమని, రామాయణ, మహాభారత కావ్యాలు మా వారసత్వ పునాది అని గొప్పలు చెప్పుకునే మన ప్రజలకు కర్ణుడి దాన వారసత్వం వచ్చినట్లు కనిపించటం లేదు. ప్రస్తుత 'కరోనా' కాలంలో ఈ సందేహం రాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కాస్తో కూస్తో దానం చేయగల సత్తా ఉన్న వారంతా 'లాక్ డౌన్' లో ఇంట్లో ఉంటూ సమయం ఎట్లా గడపాలా... అనే ఆలోచన చేస్తున్నారే కానీ, ఈ దేశానికి మనం ఏం చేయగలం, పేద- మధ్యతరగతి ప్రజలను ఏవిధంగా ఆదుకోగలం... అనే ఆలోచన చేస్తున్న వారు అరుదుగా కనిపిస్తున్నారు.
నేను మా బాల్కనీలో మొక్కలు నాటా, మీరు నా ఛాలెంజ్ స్వీకరించి మీరు కూడా మీ బాల్కనీలో మొక్కలు నాటతారా? అని ఒకరు ట్వీట్ విసిరితే, మరొకరు నేను ఇల్లు తుడుస్తున్నా, మీరు కూడా తుడుస్తారా- అని మరొకరు వాట్సాప్ వీడియో పెడుతున్నారు. మరొకరు నేను ఈ రోజు అరటికాయ పచ్చడి చేశా, మీరేం చేశారు. అని మరొక సెలబ్రిటీ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అంతేగానీ దేశం స్థితిగతులను అర్ధం చేసుకోవటం, వివక్ష నుంచి పేదరికం నుంచి అజ్ఞానాంధకారం నుంచి ప్రజలను చైతన్య వంతులను చేద్దామని కానీ, అవసరంలో ఉన్న వారిని ఆదుకుందామని గానీ, మొత్తం బాధ్యతను భుజాన వేసుకొని మోస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడదామని కానీ, తృణమో... పణమో... నేరుగా దానం చేద్దామని కానీ ఆలోచించే వారు మనకు కనిపించటం లేదు. 
'కరోనా వైరస్ వ్యాధి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. అభివృద్ధి పేరుతో మనిషి చేస్తున్న విధ్వంసం, సృష్టిస్తున్న కాలుష్యం, తవ్వుతున్న గనులు, నరుకుతున్న అడవులు వల్లే ప్రకృతి వైపరీత్యాలు సంభవించేది. ఒక రకంగా చెప్పాలంటే 'కరోనా' కూడా ప్రకృతి వైపరీత్యమే. ఇష్టానుసారం ప్రయోగాలు చేసి, ఆ ప్రయోగాలు అదుపుతప్పిన ఫలితంగా కరోనా వైరస్ జనం మీద పడింది. దీన్ని ఎలా కట్టడి చేయాలో తెలియక అగ్ర రాజ్యాలు సైతం తలలు పట్టుకుంటున్నాయి. మనదేశంలో కాస్త నయం. యూకే, రష్యా దేశాల్లో స్వయానా ప్రధానమంత్రులు సైతం కరోనా బారిన పడ్డారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదీ స్పష్టమవుతుంది. మనదేశం విషయానికి వస్తే దాదాపు 130 కోట్ల మంది జనాభా అన్ని పనులు మానుకొని 'లాక్ డౌన్' తో కాలం గడపాల్సి వస్తోంది. దీంతో శ్రమనే నమ్ముకొని జీవించేవారి ఉపాధి చక్రం ఆగిపోయింది. కటిక పేదలు. రెక్కాడితే గానీ డొక్కాడని వారికి ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. అభిమానం చంపుకొని చేయిచాచలేక మరికొందరు తల్లడిల్లిపోతున్నారు. ఖాళీకడుపులతో కొందరు, అర్థాకలితో మరికొందరు రోజులు వెళ్లదీస్తున్నారు. ఇక హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు తదితర నగరాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు రైలు పట్టాలు పట్టుకొని వేలాది కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి సొంత ఊళ్లకు వెళ్లే సాహసం చేస్తున్నారు. నిలువ నీడలేక, ఆకలితో కడుపు నకనకలాడిపోతంటే, ఏం చేస్తారు. పాపం వాళ్లు మాత్రం. సొంత ఊరికి చేరుకుంటే కల్లోగంజో తాగి బతక వచ్చని తాపత్రయం. ఇటువంటి శ్రమజీవుల కష్టాలు చూసినా... మనదేశంలో డబ్బున్న మారాజుల మనసులు కదల్లేదు.
ప్రపంచంలోని దానకర్ణుల జాబితా చూస్తే... అందులో మనవాళ్ల పేర్లు మచ్చుకైనా కనిపించవు. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్, ఫేస్ బుక్ మార్క్ జుకెన్ బర్గ్, అమెజాన్ జెఫ్ బోజన్, ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, మైఖేల్ డెల్, ట్విట్టర్ జాక్ డోర్సేయ్, ఇన్వెస్టర్ జార్గ్ సోరెస్, మైఖేల్ బ్లూమ్ బర్గ్... ఇలా అంతా తెల్లవాళ్లే ఉంటారు. 
* వారెన్ బఫెట్ కొంతకాలం క్రితం 46 బిలియన్ డాలర్లు (1 బిలియన్ డాలర్లు- రూ.7,500 కోట్లు) దానధర్మాల కోసం కేటాయించారు. ఇంత పెద్దమొత్తంలో ప్రజలకు సాయం చేయటానికి ముందుకు వచ్చిన వారు ఇటీవల కాలంలో మనకు కనిపించరు.
* ప్రపంచం లో ప్రసిద్ధ గాంచిన పరోపకారి జార్జ్ సోరోస్ , ఆయన సంపాదించినా ఆస్తిలో 32 బిలియన్ డాలర్స్ " ది ఓపెన్ సొసైటీ ఫౌండషన్స్ దాతృత్వ ఏజెన్సీ" కి ఇచ్చారు.
* చైనాకు చెందిన అలీబాబా.కామ్ వ్యవస్థాపకుడు జాక్ మా, దాదాపు 4.6 బిలియన్ డాలర్ల మొత్తాన్ని జాక్ మా ఫౌండేషన్ ద్వారా సాధారణ ప్రజల కోసం వెచ్చిస్తున్నారు. డబ్బు ఇవ్వటమే కాదు, అంతకంటే పెద్ద మనసు ఆయనకు ఉంది. "జాగ్రత్తగా వాడమని ఈ సొమ్ము ప్రజలు నాకిచ్చారు. అందుకే అందులో కొంత మొత్తాన్ని వాళ్ల కోసమే వాడుతున్నా" అంటారాయన. | 
* స్విట్జర్లాండ్ కు చెందిన హన్స్ జోర్గ్, చికాగోలో అత్యంత ధనికుడైన కెన్నెత్ గ్రిఫిన్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన బ్లాక్ స్టోన్ సహ వ్యవస్థాపకుడు స్టీఫెన్ స్వార్జ్ మ్యాన్, క్రెడిట్ కార్డ్ బిలియనీర్ డెన్నీ శాన్ఫోర్డ్, కాలిఫోర్నియాకు చెందిన స్టీవర్ట్ అమెరికాలో తాము చదువుకున్న విద్యా సంస్థలకు పెద్ద మొత్తాలు విరాళంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. 
* కరోనా వైరస్ పై పరిశోధనలకు ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సే 1 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. ఈ సొమ్ము ఆయన ఆస్తిలో దాదాపు మూడో వంతుకు సమానం. అయినా ఆయన వెనుకాడలేదు. ఇంతకంటే మంచి కారణం ఏముంటుంది, నా సొమ్ము ఖర్చు చేయటానికి... అని పేర్కొన్నారు. 
* కొవిడ్-19 పై పోరాటానికి బిల్ (బిల్ గేట్స్) అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ 100 మిలియన్ డాలర్లు ఇచ్చింది. 
కొద్ది మంది మనదేశంలోనూ లేకపోలేదు.....
* రూ. 1500 కోట్లు ఇచ్చిన రతన్ టాటా, అవసరం అయితే నా ఆస్తినంతా ధారపోయటానికి సిద్ధంగా ఉన్నా- అన్నారు. ఇంతకంటే గొప్ప మనసు వేరేవరికైనా ఉంటుందా.
* బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, నిజజీవితంలోనూ హీరోనే. కొవిడ్-19 పై పోరాటానికి రూ.25 కోట్లు ఇచ్చారాయన. ఇంత పెద్దమొత్తంలో పీఎం కేర్స్ నిధికి విరాళం ఇచ్చిన సెలబ్రిటీ మరొకరు లేరు. "నేను జీవితాన్ని ప్రారంభించినప్పుడు నా దగ్గర ఏమీ లేదు. ఆ స్థితి నుంచి నేను ఎంతో కొంత దానం చేయగల స్థాయికి వచ్చాను. ఒకప్పుడు నేను ఉన్న స్థితిలో ఇప్పుడున్న వారి కోసం ఆ మాత్రం సాయం చేయలేనా...' అని స్పూర్తిదాయకమైన రీతిలో ఆయన ట్వీట్ చేశారు. 
* గుప్తదానాలు చేయటంలో, ఏదైనా స్వయంగా ముందుండి అండగా నిలబడటంతో విప్రో గ్రూపు అధిపతి అజీం ప్రేమ్ జీ అందరికీ ఆదర్శం. తన జీవితంలో ఆయన ఇంతవరకూ వివిధ సందర్భాల్లో 21 బిలియన్ డాలర్ల మేరకు దానాలు ఇచ్చారు. 2019 లో ఆసియలోనే నెంబర్ వన్ పరోపకారిగా ఆయన ఒక చరిత్ర సృష్టించారు. 
కష్టాల్లో ఉన్న మనిషికి, తోటి మనిషి సాయపడకపోతే... ఇక జీవితానికి అర్థం ఏముంటుంది. కాస్తో కూస్తో డబ్బున్నవారు మానవత్వం చూపించే తరుణం ఇదే కదా. రాజకీయ నాయకులైనా, సినీ ప్రముఖులైనా, అగ్రశ్రేణి వ్యాపారస్తులైనా... వారు ఎంచుకున్న రంగాల్లో ఘన విజయాలు సాధించి ఉండవచ్చు. తరగని ఆస్తులు కూడబెట్టి ఉండవచ్చు. కానీ ఏమి లాభం. ఎల్లకాలం ఎవరికైనా గుర్తుంటారు. పది మందికీ సాయపడి వారు మెచ్చుకుంటేనే కదా, ఎవరికైనా శాశ్వత కీర్తి దక్కేది. ప్రస్తుత పరిస్థితుల్లో... మధ్యతరగతి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కదిలి వచ్చి చేతనైనంత సాయం చేస్తున్నారు. కానీ తరతరాలుగా తిన్నా తరగనంత ఆస్తులున్న కొందరు మాత్రం బయటకు రావటం లేదు.
కార్పొరేట్ సంస్థలు కొంత నయం. పీఎంకెర్స్ నిధికి తన సీఎస్ఆర్ నిధులను విరాళాలుగా ఇచ్చాయి. తప్పనిసరిగా లాభాల్లో 2 శాతం సొమ్ము సీఎస్ఆర్ కింద ఖర్చు చేయాల్సి ఉండటంతో... ఇచ్చాయి. కానీ, వాటికి ప్రజల పై - దేశంపై అంత ప్రేమ ఉంటుందా? అని నిలదీశే వారు కూడా ఉన్నారు. కానీ ఏదో ఒకరకంగా ముందుకు వచ్చి సాయం చేస్తున్నాయి. కాబట్టి వాటిని మెచ్చుకోవలసిందే. కానీ ధనికులు ఆ మాత్రం అయినా చేయలేదుగా, దీన్ని బట్టి మనకు అర్ధం అవుతున్నదేమిటంటే, తప్పనిసరి అయితేనే - మనం సాయం చేస్తామన్నమాట. ఇదేదో బాగానే ఉంది. అటువంటి రూల్స్ మనదేశంలో తీసుకువస్తే పోలా... 
మనదేశంలో ఆస్తి హక్కు ఉంది. అందుకే ప్రజలు ఆస్తులు కూడబెట్టి, తమ వారసులకు ఇచ్చిపోతున్నారు. వారు పనిచేసినా, చేయకపోయినా తల్లితండ్రులు ఇచ్చి వెళ్లిన ఆస్తులతో కాలుకింద పెట్టకుండా కూర్చొని తినిపోతున్నారు. అందువల్ల జనాభాలో కొంతమంది ఎప్పటికీ బద్ధకస్తులుగా ఉండిపోతున్నారు. మనిషనే వాడు ఎవరైనా శ్రమపడి తన కాళ్లమీద తాను బతకాలి. తన అవసరాలు తీరిపోయిన తర్వాత మిగిలిన సొమ్మును ప్రజలకు, ప్రభుత్వానికి ఇచ్చివేయాలి- అని సామ్యవాదం మనదేశంలో ఎప్పటికైనా వస్తుందా? వస్తుంది, ఎప్పుడంటే ఆస్తి హక్కును సవరిస్తే. ఒక వ్యక్తి తన ఆస్తిపాస్తులు మొత్తాన్ని తన వారసులకు ఇవ్వకుండా కొంత భాగాన్ని అయినా ప్రభుత్వానికి ఇవ్వాలనే నిబంధన తీసుకువచ్చినప్పుడు సాధ్యమవుతుంది. అసలు ఇటువంటి నిబంధన తీసుకువస్తే మన సమాజం ఎంతగానో మారుతుంది. మనిషిలో స్వార్ధం తగ్గుతుంది. నానా గడ్డికరిచి ఎదుటి వారిని  మోసం చేసి లేదా లంచాలు తీసుకొని తరతరాలకు తరగని గని మాదిరిగా ఆస్తులు కూడబెడదామనే దుర్బుద్ధి లేకుండా పోతుంది. ఎంత సంపాదించినా ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే కాబట్టి ఆశ తగ్గి, తన అవసరాలకు సరిపడా సంపాదించి మిగిలిన సొమ్ము ప్రజలకు దానం చేద్దామనే ఆలోచన వస్తుంది. ఈ దిశగా ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. 
ఎంత కూడబెట్టిన పోయేటప్పుడు ఎత్తుకుపోయేదేమీ లేదని వారికి తెలిసినంతగా మనకు తెలియదేమో. కర్మ సిద్ధాంతాన్ని నమ్మే దేశం మనది. తత్వ జ్ఞానం ఎన్నో శతాబ్దాల కిందే ఇక్కడ పరిఢవిల్లింది. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన 'గీత' ను రేడియోల్లో వినటమే కానీ దాన్ని ఆచరించటం తెలియని మనుషులుగా మారిపోయాం మనం.
తూర్పు ఐరోపా నుంచి భారతదేశం పశ్చిమ ప్రాంతం వరుస విజయాలతో జగ్తజేత అనిపించుకున్న గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆయన చేతులు బయటకు కనిపించే విధంగా పెట్టి సమాధి కట్టారు. జీవితాంతం ఎంత సాధించినా తీసుకుపోయేది ఏమీ లేదని ప్రజలకు చెప్పటానికి అలా చేశారు.
దీన్ని అమెరికా, ఐరోపా తదితర అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టే ఆ దేశాల నుంచి దానధర్మాలు చేసే వారు అధికంగా ఉంటున్నారు. అసలు సేవ, దానగుణం అనేది తెల్లవాళ్ల రక్తంలోనే ఉందనిపిస్తుంది. వాళ్ల మత విశ్వాసాల్లో, ఆచార వ్యవహారాల్లో, జీవన విధానంలో... ఎదుటి వారికి సేవ చేయటం, సాయపడటం.... అండగా నిలవటం అనేది ఒక తప్పనిసరి గుణంగా కనిపిస్తుంది. అటువంటి ఆలోచన కానీ, అలవాటు కానీ మనకు లేకపోవటం నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. దానికి తగ్గట్లుగా ఆ దేశాల్లోన్ని కొన్నింటిలో వారసత్వపు పన్ను అమల్లో ఉంది. ఒక వ్యక్తి ధనికుడు అయితే, అతినికి నిర్దిష్టమైన పరిమితికి మించి సొమ్ము ఉంటే అందులో దాదాపు సగభాగం అతను చనిపోయిన తర్వాత ప్రభుత్వానికి చెందుతుంది. మిగిలిన సగభాగం మాత్రమే ఆయన వారసులకు దక్కుతుంది. దీనివల్ల వారు తాము బతికి ఉండగానే దానధర్మాలు అధికంగా చేసే పరిస్థితి ఏర్పడింది... 
మానవ సేవే మాధవ సేవ" అన్నారు. కానీ మనం దానికి పూర్తిగా భిన్నం. గుళ్లో పూజలకు, ఊరేగింపులకు, ఉత్సవాలకు ఎంత సొమ్మైనా ఇస్తాం. కానీ ఆకలితో ఉన్న వాళ్లను మాత్రం పట్టించుకోం. అందుకే మనం దానగుణంలో వెనుకబడిపోయాం . ఈ విషయంలో ఇతర దేశాలు ఎంతో ముందున్నాయి. కేవలం ధనిక దేశాలే కాదు, మనకంటే లేదా మనస్థాయిలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం ఈ విషయంలో పెద్ద మనసు కలిగి ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు ప్రస్తావిస్తాను చూడండి... 
* ఫిలాంత్రోఫీ (దాన గుణం) అనేది అమెరికా రాజ్యాంగంలోనే ఉంది. దాని ప్రియాంబుల్ లో న్యాయం, ప్రజా సంక్షేమం, స్వేచ్ఛ పునాదులుగా అమెరికా సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశాన్ని ప్రస్తావించారు. 2019 " గివింగ్ యూఎస్ఏ " నివేదిక ప్రకారం అంతకు ముందు ఏడాది కాలంలో అమెరికా ప్రజలు సేవా కార్యక్రమాల కోసం 410 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు...
* దానగుణం ఉన్న ప్రజలు అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా తర్వాత స్థానాల్లో మ్యాన్మర్, న్యూజీల్యాండ్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, కెనడా, నెదర్లాండ్స్, శ్రీలంక, ఇండోనేషియా ఉన్నాయి.
* ఆఫ్రికాలో అత్యంత దానగుణం ఉన్న దేశం కెన్యా ఒక అపరిచితుడు ఎదురొస్తే, సాయం చేయటానికి కెన్యాలో 68 శాతం మంది ప్రజలు ముందుకు వస్తారు..... 
* గల్ఫ్ దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్ ప్రజలు ఎదుటివారికి ఏదైనా చేయాలని తహతహ లాడతారు. చివరికి మనకు పొరుగున ఉన్న థాయ్ ల్యాండ్ కూడా దానసూచీ (డొనేషన్ ఇండెక్స్)లో ఎంతో ముందు స్థానంలో ఉంది.
* 128 దేశాల ఈ సూచీలో మనదేశం 82వ స్థానంలో ఉంది. ఈ విషయంలో పాకిస్థాన్, నేపాల్ కంటే కూడా మనం వెనుకబడే ఉన్నాం. 
* డబ్బున్న వారే దానం చేయగలరని అనుకోవటం పొరపాటు. దానం చేయటం అనేది గుణం మీద " ఆధారపడి ఉంటుంది. పర్సు మీద కాదు. మ్యాన్మర్, శ్రీలంక, ఇండోనేషియా దేశాలను ఐక్యరాజ్యసమితి లోయర్- మిడిల్- ఇన్కమ్ దేశాలుగా పేర్కొంది. అయినా ఆదేశాలు దాన సూచీలో ఎంతో ముందు ఉన్నాయి. తెరవేద బుద్ధిజాన్ని శ్రీలంక, మాన్మర్ దేశాలు అనుసరిస్తున్నాయి. దీనివల్ల దానం చేయటం అనేది ఆ దేశాల్లో మత, సాంస్కృతిక ఆచారంగా నిలిచిపోయింది.
* ఎదుటి వారికి చేతనైనంత సాయం చేయటం మనకు ఎంతో మానసిక సంతృప్తినిస్తుంది. దానివల్ల మనసు తేలిక పడుతుంది. సంతోషం కలుగుతుంది. ఈ ప్రంచంలో అత్యంత సంతోషంగా జీవించే దేశం నెదర్లాండ్స్. 2019 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ - ప్రకారం ఈ దేశం నెంబర్ వన్ దేశం. ఆ దేశ ప్రజల్లో సగానికి పైగా ప్రజలు దానం చేయటాన్ని మించిన సంతోషం మరొకటి లేదని భావిస్తారు.  
ఎదుటివారికి సాయపడకుండా ఏ వ్యక్తి ధనవంతుడు కాలేడు- అని ప్రముఖ అమెరికా ఫిలాంత్రోఫిస్ట్ అండ్రూ కార్నేజ్ అన్నారు. ఈ మధ్య వచ్చిన మహేష్ బాబు సినిమా ఒకదాంట్లో కూడా ఇదే విషయాన్ని మనసుకు హత్తుకునేట్లు చెప్పారు. శ్రీమంతుడు- ఆ సినిమా. అందులో ఒక డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. “రేయ్ ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయ్యాలి, లేకపోతే లావైపోతారు" అనే డైలాగ్. ఈ సినిమా చూసి ఆహా, ఏం సినిమా - అన్నారు. ఈ డైలాగ్ ను పదేపదే వల్లె వేస్తూ, ఏం చెప్పాడురా మహేష్ బాబు, అన్నారు. అంతేగాక దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పల్లెటూళ్ల అభ్యున్నతికో, పేద ప్రజల ప్రగతికో, లాభసాటి వ్యవసాయానికో... నడుంకట్టిన వాళ్లు లేరు. ఎదుటివారికి ఏదైనా ఇవ్వటం... అనే దానగుణాన్ని మన సంస్కృతిలో భాగంగా చేర్చుదామని, దాన్ని అలవాటుగా మార్చుకుందామని ఆలోచించే వారు అరుదుగా కనిపించే సమాజంలో మనం బతుకుతున్నాం. మనం - ఇస్తా ఉంటే, మనకు వస్తూ ఉంటుంది- అనే నిజం తెలీకుండా కాలం గడుపుతున్నాం. ఈ కఠోర వాస్తవాన్ని, కరోనా వైరస్... మనందరికీ స్పష్టంగా చెబుతోంది. ఇకనైనా మనం మారదామా.
ఎల్.మారుతీ శంకర్మేనేజింగ్ డైరెక్టర్

7సీస్ ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్. 98494 55777

ప్రజావ్యతిరేక ప్రభుత్వం: ఏపీ తెదేపా

ప్రజావ్యతిరేక ప్రభుత్వం: ఏపీ తెదేపా

ఆంద్రప్రదేశ్ లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఏపీ తెదేపా మండిపడింది. బుధవారం నిర్వహించిన తెదేపా పాలిట్ బ్యూరో సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు చేశారు.


గ్యాస్ లీకేజి బాధితులకు అండ:
విశాఖ గ్యాస్ లీకేజి మృతులకు టిడిపి పోలిట్ బ్యూరో నివాళులు అర్పించింది. అదే విధంగా రెండు రాష్ట్రాలలో కోవిడ్ మృతులకు నివాళులు అర్పించారు.  బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులను ఆదుకోవాలి:
రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, చేనేత కార్మికులు, కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటాన్ని ఖండించింది. తక్షణమే ఆయా కుటుంబాల వారిని  ఆదుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది.
విశాఖ..ఉదంతం పై చర్యలేవీ..

మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ సహా విశాఖలోని జలాశయాల్లో నీళ్లు కలుషితం కావడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లలోకి వచ్చినవాళ్లు కూడా విషవాయువు తీవ్రతకు భయపడి  మళ్లీ వెళ్లిపోవడం ఆందోళనకరం.
ఎంత పరిధిలో ప్రజలు విషవాయువుల దుష్ప్రభావానికి లోనవుతారు, వాటి దుష్పరిణామాల నుంచి బాధితులను కాపాడటం, ద్రవరూపంలో ఉండే స్టైరీన్ వాయువుగా మారడం, అందులో రసాయనం ఏమైనా కలిసిందా, భవిష్యత్తులో అక్కడి ప్రజల ఆరోగ్యంపై, పంటలపై, ఇతర జీవరాశిపై ప్రభావాల గురించి సమగ్రంగా, శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి. ఇది మానవ తప్పిదమే అని ఆ రోజే చెప్పాం. దానిపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశాం. బాధితులు అందరినీ కాపాడాలి, సైంటిఫిక్ డేటా విశ్లేషించాలని కోరాం.

ట్యాంకు వద్ద 20డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచాల్సింది, 154డిగ్రీలకు వెళ్లింది, మేము వెళ్లినప్పుడు 135డిగ్రీలు ఉందని విచారణకు వెళ్లిన వాళ్లే చెప్పారు. ఏవో కొద్దిగా శ్వాస సమస్యలే తప్ప పెద్ద సమస్య లేదని అధికారులు మొదట తేలిగ్గా చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దీనిని చాలా తేలిగ్గా తీసుకున్నారు. మల్లీ నేషనల్ కంపెనీ అంటూ పరిశ్రమకు వత్తాసుగా మాట్లాడారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే పూడ్చాలి. బాధితులను ఎలా ఆదుకోవాలన్నదే ప్రధానం. గ్యాస్ లీకేజి దుర్ఘటన దుష్ప్రభావాన్ని ఎలా అధిగమించాలన్నదే ముఖ్యం.

ఎల్జీ పాలిమర్స్ కంపెనీని మూసేయాలని, నిందితులను శిక్షించాలని, బాధితులను ఆదుకోవాలని తీర్మానం ఆమోదించారు. అంతేకాకుండా
ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరపాలి. ఇది మానవ తప్పిదం కాబట్టి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలి. 12మంది చావుకు కారణమైన ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని శిక్షించాలి. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. దీర్ఘకాలంలో ప్రజల ఆరోగ్యంపై, పర్యావరణంపై పడే ప్రభావం అధ్యయనం చేయాలి. ఇక్కడి గాలి, మట్టి, నీటిపై దుష్ప్రభావాన్ని కనుగొనేందుకు నిపుణుల కమిటి వేసి అధ్యయనం చేయాలి. నివేదికల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలి.

అక్కడ పండే పంటలు తినరాదని, పాలు తాగరాదని, ఆహారం తీసుకోరాదని నిపుణుల హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని తదుపరి చర్యలు చేపట్టాలి. ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు ఉచితంగా అందజేయాలి. విష వాయువులు పీల్చి బాధితులైన ప్రజలు  కొన్నాళ్లు పని కూడా చేయలేరు, కాబట్టి వారికి జీవనోపాధి కల్పించాలి. ఐదారు కిమీ పరిధిలో విష వాయువులు  వ్యాపించినందున, పరిహారం కూడా ఆ పరిధిలో బాధితులు అందరికీ ఇవ్వాలి.

దక్షిణ కొరియాలో, ఇతర దేశాల్లో  ఇలాంటి దుర్ఘటనలు జరిగిన చోట్ల ఇచ్చిన పరిహారాలను అధ్యయనం చేసి విశాఖ బాధితులకు మెరుగైన పరిహారం అందజేయాలి.  ప్రతి వ్యక్తికి హెల్త్ చెకప్ చేయాలి. హెల్త్ ప్రొఫైల్ ఉండాలి. బాధితులు అందరికీ ఎలక్రాికనిక్ హెల్త్ రికార్డులు మెయింటైన్ చేయాలి.

ఐదారు గ్రామాల మధ్య ఒక సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నెలకొల్పాలి. విషవాయు బాధితులు అందరికీ ఆ హాస్పటల్ లోనే ఎప్పటికప్పుడు అత్యున్నత చికిత్స అందించాలి. పశుగ్రాసం కూడా విషపూరితం అయ్యింది కాబట్టి బైటనుంచి దాణా తెప్పించి అందజేయాలి.

ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు చేసుకోవాలి,  ‘‘మావాళ్లు కూడా చనిపోతే బాగుండని కోటి వస్తుందని అనుకుంటున్నారనే’’ వ్యాఖ్యలు వైసిపి నేతల అమానుష ధోరణికి నిదర్శనం.6వేల టన్నులు స్టైరీన్ ను లోడ్ చేసి పంపుతున్నామని ఒక మంత్రి అంటారు. 18వేల టన్నులు ఉందని మరో మంత్రి చెబుతారు. 13వేల టన్నుల ఉందని మరొకరు అంటారు. మంత్రుల వ్యాఖ్యలతో ప్రజల్లో గందరగోళం.  ఇప్పటికి కూడా ఎల్జీ పాలిమర్స్ కంపెనీది తప్పు అని వైసిపి నాయకులు చెప్పలేక పోతున్నారు.
ట్యాంకర్లలో ఉన్న స్టైరీన్ ను విదేశాలకు పంపడంపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజలు పీల్చిన విష వాయు దుష్ప్రభావాన్ని, ప్రజల ప్రాణాలకు, పంటలకు, పాడి పశువులకు జరిగిన నష్టాన్ని పట్టించుకోడం లేదు.
ముఖ్యమంత్రిస్థాయిలో ఉన్న వ్యక్తి దుర్ఘటనా స్థలానికి వెళ్లకుండా,  నేరస్తులను ముందే కలిస్తే ఇక న్యాయం ఎక్కడ జరుగుతుంది..?  నేరం చేసినవాళ్లతో సీఎం సమావేశం పెట్టుకోడాన్ని ఏమనాలి..? దుర్మార్గుల చేతిలో అధికారం ఉండటం ప్రజల దురదృష్టం. బాధితుల దురదృష్టం. బాధితులకు న్యాయం జరిగేదాకా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. రాజీలేని పోరాటం చేస్తుంది.
కరోనా విస్తృతి వైసీపీ పాపమే:
రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే కరోనా రాష్ట్రంలో విస్తృతం అయ్యింది. గుంటూరులో వైసిపి నాయకుడు ఇచ్చిన విందు వల్ల దుష్ఫలితాలు చూశాం. వైసిపి ఎమ్మెల్యేలే కరోనా సూపర్ స్ప్రెడర్లుగా మారారు. శ్రీకాళహస్తిలో ట్రాక్టర్ల ర్యాలీ, నగరిలో, కనిగిరిలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి వైరస్ వ్యాప్తికి కారణం అయ్యారు. రేషన్ పంపిణీలో, మద్యం అమ్మకాలతో కరోనా మరింతగా వ్యాపించేలా చేశారు.
బైటనుంచి వచ్చినవాళ్లను క్వారంటైన్ కు పంపాలని టిడిపి మొదటినుంచి చెబుతోంది. కానీ వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కరోనా మామూలు ఫ్లూ లాంటి జ్వరమేనని, పారాసిటమాల్, బ్లీచింగ్ చాలని తేలిగ్గా మాట్లాడారు. 

అన్నిదేశాల్లో, రాష్ట్రాల్లో ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచడంపై శ్రద్ద పెడుతుంటే, మన రాష్ట్రంలో మాత్రం నాసిరకం మద్యం బ్రాండ్ల ద్వారా వ్యాధి నిరోధక శక్తి దారుణంగా దెబ్బతీస్తున్నారు. లిక్కర్ వల్ల ఇమ్యూనిటి దెబ్బతింటుంది, అలాంటిది నాసిరకం మద్యం వల్ల దుష్పరిమాణాలు మరీ అత్యధికం. లిక్కర్ డోర్ డెలివరీ చేయండి, క్యూలైన్లలో జనాన్ని గుంపులుగా నిలబెట్టవద్దని న్యాయస్థానాలు హెచ్చరించాయంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. హాట్ జోన్లలో నిత్యావసరాలు ఇంటింటికీ సరఫరా చేయాలి. ప్రజల ఆరోగ్యం నిశితంగా పరిశీలించాలి.
జిఎఫ్ ఎస్ టి అధ్యయనాలను ప్రశంసించిన పోలిట్ బ్యూరో:
జిఎఫ్ ఎస్ టి చేసిన అధ్యయనాన్ని పోలిట్ బ్యూరోలో ప్రశంసించారు. మొత్తం దేశానికే ప్రయోజనకరమైన అధ్యయనాలు చేయడాన్ని అభినందించారు.

జోన్ల వర్గీకరణపై, ఎంఎస్ ఎంఈ రంగాన్ని ఆదుకోవడంపై సూచనలు చేశారు. 80% ఉపాధి కల్పించే రంగం ఎంఎస్ ఎంఈ రంగమే కాబట్టి వడ్డీలేని రుణాలు ఇచ్చి ఎంఎస్ ఎంఈ రంగాన్ని ఆదుకోవాలి. కార్మికులకు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించగలిగే సామర్ధ్యం పెంచేలా చూడాలి.
రైతుల వద్ద పంట ఉత్పత్తులను ప్రభుత్వమే సేకరించాలి, కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. హార్టీ కల్చర్, ఆక్వా కల్చర్, సెరి కల్చర్ రైతాంగాన్ని ఆదుకోవాలి.
వలస కార్మికులను కేరళ ప్రభుత్వం గెస్ట్ వర్కర్లుగా పేర్కొంది. వాళ్లను ఆతిథ్య కార్మికులుగానే చూడాలి. అన్నివిధాలా ఆదుకోవాలి.

కుంభకోణంపై ధ్వజం:
కరోనా కష్టకాలంలో బ్లీచింగ్ లో కూడా రూ70కోట్ల కుంభకోణానికి పాల్పడటాన్ని ఖండించారు. కరోనా కిట్ల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని, నాసిరకం శానిటైజర్లు, నాసిరకం మాస్క్ లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆరోపించారు. కిరోసిన్ కంపు కొడుతున్నాయని మాస్క్ లు అక్కడే పారేశారన్నారు.

లాక్ డౌన్ లో కూడా ఇసుక దందాలు, గ్రావెల్ తరలింపును ఖండించారు.  మద్యం దుకాణాల వద్ద టీచర్లను నియమించడాన్ని తప్పుపట్టారు. మడ అడవులను విచక్షణారహితంగా నరికేయడం వల్ల భవిష్యత్తులో తీరప్రాంతానికి తుఫాన్ల ముప్పు ఉంటుందని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆవభూముల కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడటాన్ని గర్హించారు.

టిడిపి ప్రతినిధుల బృందాలు రెండు ఈ ప్రాంతాల్లో పర్యటించి వీటిపై నిజ నిర్దారణ చేయాలని తీర్మానించారు. పేదలకు ఇళ్ల స్థలాల ముసుగులో భూముల కొనుగోళ్లలో ప్రతి నియోజకవర్గంలో వైసిపి నాయకులు భారీ అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఎకరం రూ 7లక్షలు చేయని భూములను రూ70లక్షలకు కొని వాటాలు వేసుకుని పంచుకోడాన్ని గర్హించారు. ముడుపుల కోసమే మద్యం రేట్లను భారీగా పెంచాలని దుయ్యబట్టారు.

ఫ్రంట్ లైన్ వారియర్లకి అభినందన:
ప్రాణాలు కూడా లెక్కపెట్టుకోకుండా కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్లను అభినందించారు.
ఫ్రంట్ లైన్ వారియర్లకు కావాల్సిన పిపిఈలు(మాస్క్ లు, సూట్లు, ఐషీల్డ్ గాగుల్స్..) ఇవ్వలేక పోవడాన్ని ఖండించింది.

పేదలు, వలస కార్మికుల ఆకలి దప్పులను ఏపిలో వైసిపి ప్రభుత్వం ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రతి పేద కుటుంబానికి రూ5వేలు ఇవ్వాలని కోరినా స్పందన లేదన్నారు. అన్నా కేంటిన్లు తెరవాలి, బీమా పునరుద్దరించాలి, ప్రతి పేద కుటుంబానికి రూ 10వేలు ఇవ్వాలి. కేరళ తరహాలో 17రకాల నిత్యావసర సరుకులు రాబోయే లాక్ డౌన్ లో కూడా ఇంటింటికి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు

కరెంటు ఛార్జీల పెంపు దారుణం:
ఈ విపత్కర పరిస్థితిలో కరెంటు ఛార్జీలను పెంచడాన్ని సమావేశం ఖండించింది. కరెంటు ఛార్జీలు పెంచేది లేదని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ గాలికి వదిలేసి 4రెట్లు పెంచారన్నారు లాక్ డౌన్ పీరియడ్ లో కూడా మున్సిపల్ ట్యాక్సులు వసూలు చేయడాన్ని ఖండించారు. ఇప్పటికే ఆర్టీసి ఛార్జీలు పెంచారు. ఇసుక, మద్యం ధరలు, పెట్రోల్, డీజిల్  రేట్లు పెంచేశారు. ధరలు పెంచి భారాలు వేయడాన్ని గర్హించారు.

పేదలకు అండగా...
పంటలు అమ్ముడుపోక నష్టాల్లో మునిగిన రైతులు, ఉపాధి కోల్పోయిన కార్మికులకు మద్దతుగా 12గంటల నిరాహార దీక్షలు చేసిన టిడిపి నాయకులను పోలిట్ బ్యూరో అభినందించింది. కూరగాయలు, నిత్యావసరాలు, కోడిగుడ్లు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసిన దాతలను అభినందించింది. మద్యం దుకాణాలు మూసేయాలని, ప్రజారోగ్యం కాపాడాలని 12గంటల దీక్షలు చేసిన తెలుగు మహిళలను అభినందించిది.

తప్పుడు కేసులకు ఖండన...
టిడిపి నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో గర్హించింది. విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటనలో బాధితులపై, వారికి అండగా నిలబడ్డ ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడాన్ని ఖండించింది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన దాతలపై కూడా కేసులు పెట్టడం నీచంగా పేర్కొంది. అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేసింది.

మహానాడు వర్చువల్
టిడిపి మహానాడును వర్ట్యువల్ గా నిర్వహించడంపై పోలిట్ బ్యూరోలో చర్చించారు. అందులో చేపట్టాల్సిన తీర్మానాలు, కమిటిల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు.

ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు, ఎల్ రమణ, పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, రావుల చంద్రశేఖర రెడ్డి, ప్రతిభా భారతి, నారా లోకేష్, గల్లా జయదేవ్ , అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, అరుణ కుమారి, వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Wednesday, May 6, 2020

ప్రభుత్వం నుండి పోస్ట్ ప్రొడక్షన్ అనుమతి కై ఎదురు చూస్తున్న టాలీవుడ్

ప్రభుత్వం నుండి పోస్ట్ ప్రొడక్షన్ అనుమతి కై ఎదురు చూస్తున్న టాలీవుడ్లాక్ డౌన్ నుంచి చిత్ర‌సీమ మిన‌హాయింపులు కోరుకుంటు తెలుగు సినీ పరిశ్రమ తామ బాధ‌లు, ఇబ్బందులు, స‌మ‌స్య‌లు చెప్పుకుంటూ సినిమాటోగ్రఫీ మినిస్టర్ త‌ల‌సాని శ్రీ‌నివాస యాదవ్ తో మే ౫న ఉదయం ఫిలిం ఛాంబర్లో సినీ పెద్దలు ఓ ‌ విన‌తి ప‌త్రాన్ని అంద‌చేసింది. అదే రోజు ముఖ్య మంత్రి కేసీఆర్ సుదీర్ఘమైన ప్రెస్ మీట్ లో ప్రసంగించారు. అయితే చిత్ర‌సీమ‌కు కూడా ఏవైనా కొన్ని మిన‌హాయింపులు ప్ర‌క‌టిస్తార‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూశారు. అన్ని రంగాల గురించీ మాట్లాడిన కేసీఆర్ సినిమాల గురించి ప్ర‌స్తావించ‌లేదు. ఆ సంగ‌తి మ‌ర్చిపోయారో, లేదంటే… అస‌లు సినిమాల గురించి ఆలోచించ‌లేదో తెలీదు గానీ, కేసీఆర్ నుంచి ఏమైనా మిన‌హాయింపులు ఆశించిన చిత్ర‌సీమకి నిరాశే ఎదురైంది.
ఆల్రెడీ కేరళ ప్రభుత్వం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇక్కడ కూడా 
షూటింగుల విష‌యంలో ప్ర‌భుత్వం అనుమ‌తిస్తుంద‌న్న ఆశ లేకపోయినా... క‌నీసం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు అనుమతులు ఇస్తుంద‌ని ఎదురు చూసింది. కానీ అలాంటి సంకేతాలేం క‌నిపించ‌లేదు. టోటల్ షూటింగ్ ముగించుకుని, ఎడిటింగ్‌, రీరికార్డింగ్, డ‌బ్బింగ్ ప‌నులు బాకీ ప‌డిన సినిమాలెన్నో చాలా ఉన్నాయి. లాక్ డౌన్ ఎత్తేసేలోపుగా ఈ పనుల‌న్నీ పూర్తి చేసుకోవచ్చు అని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించారు. స్మాల్ బడ్జెట్ సినిమాలు థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌క‌పోయినా, క‌నీసం ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌కి అమ్ముకోవాల‌న్నా స‌రే, సినిమా పూర్తి స్థాయిలో రెడీగా ఉండాలి క‌దా? ఆ అవ‌కాశం కూడా ఇప్పుడు లేకుండా పోయింది.
అయితే త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ మాత్రం ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్తాన‌ని ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నిన్నటి ఫిలిం ఛాంబర్ మీటింగ్ లో హామీ ఇచ్చారని తెలిసింది. అతి త్వ‌ర‌లో డ‌బ్బింగ్ స్టూడియోలు, రికార్డింగ్ థియేట‌ర్లు, లాబ్ ల‌కు ప‌ర్మిష‌న్లు ఇవ్వొచ్చ‌న్న సంకేతాలు అందుతున్నాయి. డ‌బ్బింగ్‌, ఎడిటింగ్‌, రీ రికార్డింగ్ ప‌నులు ప‌రిమిత వ్య‌క్తుల‌తో లాక్ డౌన్ నియమ నిభంధనలతో ముగించుకునే సౌల‌భ్యం ఉంది. క‌నుక ముఖ్యమంత్రి ఈ విష‌యంలో సానుకూలంగా స్పందిస్తారని పరిశ్రమ భావిస్తోంది.

PIB Daily Bulletin on Covid-19

 • PIB Daily Bulletin on Covid-19
  • 14,183 Covid-9 patients out of 49,391 confirmed cases have been cured so far in the country, taking the recovery rate to 28.72%.
  • 2958 new Covid-19 cases reported since yesterday.
  • PM reviews India’s efforts in vaccine development, drug discovery, diagnosis and testing.
  • Around 39 Crore poor people have so far received financial assistance of Rs 34,800 crore under the Pradhan Mantri Garib Kalyan Yojana.
  • FCI stocks comfortable even after fulfilling extra commitments during the lockdown
  • MHA issues SOPs for movement of Indian Nationals stranded in other countries and those desirous of travelling abroad; Indian Navy launches operation “Samudra Setu” to repatriate Indian citizens from overseas.
  • Aarogya Setu IVRS services launched for people having Feature phone or landline

  Saturday, May 2, 2020

  బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో మరో పాన్ ఇండియా మూవీలో యన్.టి.ఆర్?

  యంగ్ టైగర్ యన్ టి ఆర్ టెంపర్ తో  మొదలు పెట్టిన జైత్రయాత్ర నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ వరకు కొనసాగించింది. ఇకముందు RRR, త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాలపై దృష్టిపెట్టారు. అతను నటించే మూవీ  అరవింద సమేత కి RRR, కి షుమారు రెండున్నర ఏళ్ళు గ్యాప్ వచ్చేలా వుంది. అంతే కాకుండా లాక్‌డౌన్ కూడా మరింత గ్యాప్‌ను పెంచడంతో అభిమానులు నిరాశలో వున్నారు  అయితే వారికి బంపర్ బొనాంజాను అందించేందుకు యంగ్ టైగర్ సిద్దమవుతున్నాడు.
  ఇదిలా ఉంటే రోజురోజుకీ పాన్ ఇండియా హీరో గా మారిపోతున్నాడు ఎన్టీఆర్. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే అది పాన్  ఇండియా లెవెల్లో ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  ఇక రాజమౌళి సినిమా విడుదల అయ్యింది అంటే ఇప్పటికే ఒక రేంజ్ లో ఉన్న ఎన్టీఆర్ క్రేజ్ మరెక్కడికో వెళ్ళిపోతుంది. ఇక రాజమౌళి సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన క్రేజీ కాంబినేషన్ అయినా త్రివిక్రమ్ తో సినిమా సైన్ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తన 30వ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో మరో పాన్ ఇండియా మూవీలో యన్.టి.ఆర్?
  సినిమాగా చేయబోయే ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ప్లాన్  చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోయే  సినిమాకి ఇంకా క్లాప్ కూడా కొట్టలేదు.
  ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన 31 వ సినిమాను కూడా సైన్  చేసినట్లు ప్రస్తుతం సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నాడట ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ 31వ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.. బాలీవుడ్ స్టార్ దర్శకుడైన సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో.. ఓ చారిత్రాత్మక చిత్రం తెరకెక్కనుందట.  ఇందులో హీరోగా ఎన్టీఆర్ నటించనున్నారు అనే టాక్ వినిపిస్తోంది. సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ  సినిమాలో ఎన్టీఆర్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ విలన్ గా నటించబోతున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం అఫీషియల్ ప్రకటన వేచిచూడాలసిందే.

  ప్రపంచంలోనే అతిపెద్ద మాల్ తిరిగి ప్రారంభం  ప్రపంచంలోనే అతిపెద్ద మాల్ తిరిగి ప్రారంభం
  ప్రపంచంలోనే అతిపెద్ద మాల్‍గా పేరుగాంచిన దుబాయ్‍ మాల్‍ తిరిగి ప్రారంభమైంది. అయితే కొన్ని షరతులతో తిరిగి రీఓపెన్‍ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాల్‍కు వచ్చే వారికి కొన్ని షరతులు విధించారు. మాల్‍కు వచ్చే కస్టమర్స్ మాస్క్ థరించడంతో పాటు మాల్‍ పార్కింగ్‍, ఎంట్రన్‍సలో ఫీవర్‍ పరీక్షలు చేయించుకోవాలి. ఇంకా వచ్చేవారు మూడు గంటలకు మించి ఎవరు కూడా మాల్‍లో ఉండకూడదు. మూడేళ్ల నుంచి 12 ఏండ్లు, అరవై ఏళ్ల పైబడిన వారికి మాల్‍లోకి అనుమతి లేదు. కరోనా వ్యాప్తి కారణంగా దుబాయ్‍లో మార్చి 23 నుంచి లాక్‍డౌన్‍ విధించారు. దీంతో అన్ని మాల్స్, సినిమా హాళ్లు మూతపడ్డాయి. దాదాపు నెల రోజుల తర్వాత మాల్‍ తెరుచుకోవడంతో వెల్‍కమ్‍ బ్యాక్‍ అని రాసి ఉన్న నల్ల టీషర్ట్లు వేసుకున్న మాల్‍ సిబ్బంది ప్రతి ఒక్కరికి టెంపరేచర్‍ చెక్‍ చేస్తూ, వెల్‍కమ్‍ చెప్పారు.

  Friday, May 1, 2020

  Thursday, April 30, 2020

  ఎవరైనా అలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు  ఎవరైనా అలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు

  కరోనా నివారణ, సహాయక చర్యలపై ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. కర్నూలు జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడంపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్‍ ఎవరికైనా సోకవచ్చని, అడ్డుకున్నవారికైనా ఇలాంటి పరిస్థితే రావొచ్చనే విషయం మరువరాదన్నారు. కరోనా సోకినవారిని అంటరానివారిగా చూడటం సరికాదన్నారు. బాధితులపై ఆప్యాయత, సానుభూతి చూపించాలే తప్ప వివక్ష చూపరాదన్నారు. 
  కరోనా వైరస్‍ ముందులు వేసుకుంటే పోతుందని సీఎం పునరుద్ఘాటించారు. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారిపైనే వైరస్‍ ప్రభావం చూపుతుందన్నారు. అంతిమ సంస్కారాలు నిర్వహించకుండా అడ్డుకోవడం సరికాదని, ఇక మీదట ఎవరైనా అలా ప్రవరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఇలాంటి వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. కరోనా రావడం భయానకంగా, సోకిన వారిని అంటరానివారిగా చూడటం ఎట్టిపరిస్థితుల్లోనూ తగదన్నారు.

  పెళ్లికి సిద్ధమే కానీ ఇప్పుడు కాదు  పెళ్లికి సిద్ధమే కానీ ఇప్పుడు కాదు

  మిల్కీ బ్యూటీగా అభిమానుల చేత కీర్తింపబడే ఆమెకు ఇటీవల దక్షిణాదిలో తీవ్ర పోటీ వచ్చింది. కొత్త హీరోయిన్లు అనేక మంది వచ్చేస్తున్నారు. దాంతో సీనియర్లకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఈ పరిణాం సహజమే. పూర్తిగా పరిశ్రమ పక్కన పెట్టకముందుగానే ఓ ఇంటిది అంటే పెళ్లి చేసుకోవాలని భావించిందట. కొద్ది రోజుల క్రితం సోషల్‍ మీడియాలో తమన్నా పెళ్లికి సంబంధించిన వార్తలు షికారు చేశాయి. వీటిని ఆమె ధృవీకరించలేదు ఖండించలేదు. తను పెళ్లిసి సిద్ధంగానే ఉన్నానని మాత్రం తెలియజేసింది. ఆ తర్వాత కూడా ముంబైలోనే స్థిరపడాలనే ఆలోచనతో ఖరీదైన ఫ్లాట్‍ కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అకస్మాతుగా ఆమె ఆలోచన మారిందని అంటున్నారు. పెళ్లిని మరికొద్ది రోజులు వాయిదా వేసి, ఈలోపు ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తోందట. ఎందుకంటే తమన్నా రేంజ్‍కి కనీసం యాభై లక్షలు పైగా పారితోషికం చెల్లిస్తారు. అందుకే వీలయినంత వరకు ఆర్థికంగా మరింత స్థిరపడ్డాకే మూడు ముళ్ళ గురించి ఆలోచిస్తుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. తమన్నా ప్రస్తుతం సీటీమార్‍ అనే తెలుగు చిత్రం చేస్తోంది. ఇందులో మహిళా కబడ్డీ కోచ్‍గా నటిస్తోంది.

  గూగుల్ మీట్ సేవలు ఉచితం  గూగుల్ మీట్ సేవలు ఉచితం
  సెర్చింజిన్‍ దిగ్గజం గూగుల్‍ తన వీడియో కాన్ఫరెన్సింగ్‍ యాప్‍ మీట్‍ సేవలను భారత్‍ సహా ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందించాలని నిర్ణయించింది. రానున్న వారాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మీట్‍లో ప్రతిరోజు 300 కోట్ల నిమిషాలపాటు వీడియో సమావేశాలు జరుగుతున్నాయి. రోజు 30 లక్షల మంది కొత్త వినియోగదారులు చేరుతున్నారు. కరోనా వైరస్‍ ఉద్థ•తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆన్‍లైన్‍ సమావేశాలు పెరిగిపోయిన నేపథ్యంలో మీట్‍ సేవలను ఉచితం చేయాలని గూగుల్‍ నిర్ణయించినట్లు సమాచారం. మీట్‍ సేవలు వినియోగించుకోవాలనుకునే వారికి కచ్చితంగా గూగుల్‍ ఖాతా ఉండాలి.