Saturday, August 29, 2020

మాతృభాషను కాపాడుకోవడమే ఆ మహానీయుడికి ఘనమైన నివాళి

 

Vice-President-Venkaiah-naidu-starts-webinor-on-Telugu-Basha-Dinostavam-in-Delhi

ఉన్నతమైన సమాజానికి, భాషాసంస్కృతులే చక్కని పునాదులు వేస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య నిర్వహించిన మన భాష- మన సమాజం- మన తెలుగు సంస్కృతి అంతర్జాల సదస్సును ఆయన ప్రారంభించారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి అయిన తెలుగు భాషా దినోత్సవం నాడు భాషా సంస్క•తి, సమాజం పరంగా మనం ఎక్కడున్నామనే అంశాన్ని సింహవలోకనం చేసుకోవడం ముదావహం అని వెంకయ్య వ్యాఖ్యానించారు.

ప్రజలకు అర్థంకాని భాషల్లో ఉన్న విజ్ఞానం సమాజానికి మేలు చేయదని గిడుగు భావించారని గుర్తు చేశారు. అందుకే పుస్తకాల్లో సులభమైన తెలుగును వాడాలని ఉద్యమించారని పేర్కొన్నారు. మాతృభాషను కాపాడుకోవడమే ఆ మహానీయుడికి అందించే ఘనమైన నివాళి అని అన్నారు. మన సంస్కృతి చిరునామాలను భవిష్యత్‍కు అందించడం భాష ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ప్రపంచీకరణ వల్ల భాషలు అంతరించే ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక భాషలమీద ఆయా ప్రాంతాల్లోని వర్సిటీలు అధ్యయనాలు జరపాలని సూచించారు. పురోభివృద్ధిని కోరుకునేవారు మాతృభాషను మరవకూడదని పిలుపునిచ్చారు.

ఏకాంతంగా తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు

 All set for Tirumala Tirupati Brahmotsavam

కొవిడ్‍ కేసులు పెరుగుతున్నందున సెప్టెంబరు 19 నుంచి జరిగే తిరుమల శ్రీనివాసుడి వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి చైర్మన్‍ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అధిక మాసం వల్ల ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయని, అక్టోబరులో జరిగే వేడుకలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవన్‍లో సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈవో అనిల్‍ కుమార్‍ సింఘాల్‍, అదనపు ఈవో ధర్మారెడ్డి, సభ్యులు భాస్కర్‍రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి, శివకుమార్‍, దామోదర్‍రావు నేరుగా హాజరుకాగా, సుధా నారాయణ మూర్తి, రామేశ్వరరావు, కరుణాకర్‍ ఆన్‍లైన్‍లో పాల్గొన్నారు.

ఆమెతో పోల్చితే ఇవాంక బెటర్ : ట్రంప్

 Kamala Harris Not Competent To Be US President Ivanka Better says Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ డెమోక్రాటిక్‍ సభ్యురాలు కమల హారీస్‍పై నోరుపారేసుకున్నారు. అధ్యక్ష పదవికి ఆమె అసలు పోటీదారే కాదన్నారు. ఆమెతో పోల్చితే ఇవాంకా బెటర్‍ చాయిస్‍ అన్నారు. న్యూ హాంప్‍షైర్‍లో జరిగిన రిపబ్లికన్‍ ప్రచార  ర్యాలీలో తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్‍ మాట్లాడుతూ ఒక మహిళ అమెరికా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. అందుకు మద్దతు కూడా తెలుపుతున్నాను. అయితే ఆ పదవికి హారిస్‍ అర్హులు కాదు.. పోటీదారు అంతకన్నా కాదు. వైట్‍ హౌస్‍ సీనియర్‍ సలహాదారు ఇవాంక ట్రంప్‍ అయితే బాగుంటుంది అన్నారు. ట్రంప్‍ మద్దతుదారులు కూడా ఇవాంక అని అరవడంతో ఇది ప్రజల కోరిక నా తప్పు లేదు అన్నారు ట్రంప్‍. రిపబ్లికన్‍ పార్టీ తరపున రెండో సారి అధ్యక్ష పదవికి నామినేట్‍ అయిన తర్వాత నిర్వహించిన తొలి ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్‍.

బయలాజికల్ ఈ తో ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా సంస్థ

 

Hyderabad based Biological E ties up with US college for vaccine production

కరోనా టీకా ఉత్పత్తి కోసం అమెరికాలోని టెక్సాస్‍కు చెందిన బేలోర్‍ కాలేజ్‍ ఆఫ్‍ మెడిసన్‍ (బీసీఎమ్‍) తెలంగాణ ఫార్మా కంపెనీ బయలాజికల్‍ ఈ తో ఒప్పందం కుదుర్చుకున్నది. బీసీఎమ్‍ టీకా ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్నది. వచ్చే ఏడాదిలో టీకా ఉత్పత్తి ప్రారంభమవుతుంది. టీకా తయారయ్యాక వేగంగా పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో బయోలాజికల్‍ ఈ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని, బయలాజికల్‍ ఈ 100 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తుందని బీసీఎమ్‍ అధికారులు తెలిపారు. బయలాజికల్‍ ఈ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‍లో ఉన్నది.