Saturday, September 5, 2020

3వేల అడుగుల ఎత్తులో మనిషి!

 

officials-investigate-guy-in-jetpack-seen-flying-near-lax-airport-nk-

ఒకటి కాదు రెండు కాదు, 3 వేల అడుగుల ఎత్తులో ఒక మనిషి జెట్‍ప్యాక్‍ సాయంతో ఎగురుతున్నాడని విమాన పైలట్లు చెప్పడం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. లాస్‍ఏంజిలిస్‍ విమానాశ్రయం పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‍పోర్టుకు వస్తున్న ఓ విమానంలోని పైలట్లు ఇద్దరు కిటికిలోంచి ఒక వ్యక్తి ఎగురుతూ వెళ్లడాన్ని గమనించినట్లు కంట్రోల్‍ రూమ్‍కు సమాచారమిచ్చారు. వారి నివేదిక మేరకు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‍బిఐ దర్యాప్తు ప్రారంభించింది. జెక్‍ప్యాక్‍ సాయంతో లాస్‍ ఏంజిలిస్‍ వంటి రద్దీ ప్రాంతంలో అంత ఎత్తున ఎగరడం అసాధ్యమని జెట్‍ప్యాక్‍ ఏవియేషన్‍ సంస్థ సీఈఓ డేవిడ్‍ మేమాన్‍ తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న సాంకేతికత బట్టి చూస్తే జెట్‍ ప్యాక్‍ సాయంతో 3 వేల అడుగుల ఎత్తున ఎగిరి తిరిగి కిందకు మామూలుగా రావడం జరగని పని. ఆ స్థాయిలో ఇంధనాన్ని జెట్‍ ప్యాక్‍లో తీసుకెళ్లడం అసాధ్యం. లాస్‍ ఏంజిలిస్‍ సమీపంలోనే జేట్‍ ప్యాక్‍ ఎగిరి ఉన్నట్లైతే కచ్చితంగా ప్రజల్లో చాలామందికి కనిపిస్తుంది. ఒకవేళ సిబ్బంది చూసింది డ్రోన్‍ అయి ఉండచ్చు. అత్యున్నత సాంకేతికత కలిగిన డ్రోన్లు మాత్రమే 3 వేల అడుగుల ఎత్తులో ఎగరగలవు. ఒకవేళ అది నిజంగా జెట్‍ ప్యాక్‍ అయ్యుంటే మాత్రం ఎవరో సోంతంగా తయారుచేసినది అయి ఉండాలి. అమెరికా సైనికావసరాల కోసం మేము జెట్‍ప్యాక్‍లను తయారు చేస్తున్నాం. కానీ అవి అమ్మకానికి లేవు అని ఆయన వెల్లడించారు.

ఒకవేళ నిజంగా జెట్‍ ప్యాక్‍తో ఎగిరిన వ్యక్తే అయి ఉంటే అతడికి రూ.20 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‍లో ఒక జెట్‍ ప్యాక్‍ సాయంతో 6వేల అడుగుల ఎత్తుకు విన్స్ రెఫెట్‍ అనే  వ్యక్తి ఎగరగలిగాడు. కానీ కిందకు దిగేందుకు పారాచూట్‍ను వాడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో డ్రోన్‍ చూసి జెట్‍ప్యాక్‍గా పైలట్లు భ్రమించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

కరోనా నేపథ్యంలో... పోస్టల్ ఓట్లకు భారీ డిమాండ్

 

Voters are already getting presidential ballots

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలో పోస్టల్‍ ఓట్లకు డిమాండ్‍ భారీగా పెరిగింది. పోలింగ్‍ బూత్‍కు వెళ్లి ఓటు వేసే రిస్క్ను తీసుకోవడానికి చాలామంది సిద్ధంగా లేరు. నార్త్ కరోలినాలో పోస్టల్‍ బ్యాలెట్‍లను పంపడం మొదలైంది. తొలిదశలో 6.18 లక్షల పోస్టల్‍ బ్యాలెట్‍లకు అభ్యర్థనలు అందాయి. నాలుగేళ్ల కిందటితో పోలిస్తే ఇది 16 రెట్లు ఎక్కువ. విస్కాన్సిన్‍లో కిందటిసారితో పోలిస్తే లక్ష అభ్యర్థనలు ఎక్కువ వచ్చాయి. ఫ్లోరిడాలో 2016లో 33.47 లక్షల మంది పోస్టల్‍ బ్యాలెట్‍ను ఉపయోగించుకోగా.. ఈసారి ఇప్పటికే 42.70 లక్షల అభ్యర్థనలు అందాయి. అత్యధికంగా డెమొక్రాటిక్‍ పార్టీ మద్దతుదారుల నుంచే పోస్టల్‍ బ్యాలెట్‍ అభ్యర్థనలు అందుతున్నాయి. తర్వాత తటస్థులు దీన్ని వినియోగించుకుంటున్నారు. పోస్టల్‍ బ్యాలెట్‍ ద్వారా అవకతవకలు జరిగే అవకావం ఉందని రిపబ్లికన్‍ పార్టీ అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ అంటున్నారు.

సకాలంలో ఓట్లు లెక్కింపు, ఫలితాల వెల్లడిపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టల్‍ శాఖకు అదనపు నిధుల మంజూరును ట్రంప్‍ అడ్డుకోవడంతో భారీగా వచ్చే పోస్టల్‍ బ్యాలెట్లను కౌంటింగ్‍ కేంద్రాలకు చేర్చేందుకు వనరులు ఉండవనే ఆందోళన నెలకొంది.

వచ్చే ఏడాదికీ కష్టమే!

 

Widespread Covid 19 vaccination not expected until mid 2021 says WHO

కరోనా వ్యాక్సిన్‍ ఇదిగో అదిగో అంటూ అగ్ర దేశాలు అమెరికా, రష్యా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍వో) కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేలా విస్తృతమైన వ్యాక్సిన్‍ను వచ్చే ఏడాది మధ్యకాలం నాటికి కూడా చూస్తామని తాము భావించడం లేదని ఆ సంస్థ అధికార ప్రతినిధి మార్గరెట్‍ హ్యారిస్‍ చెప్పారు. ఆమె జెనీవాలోని ఐక్యరాజ్యసమితిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వ్యాక్సిన్‍ తయారీలో అత్యంత కీలకమైనది మూడో దశ పరీక్షలు. ఈ పరీక్షలకు ఎక్కువ సమయం పడుతుంది. అంతే గాక పలు దేశాలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు ఏ మేరకు ప్రభావం చూపుతాయో? ఎంత వరకు భద్రమైనవో? అన్న విషయాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి వచ్చే ఏడాది మధ్య కాలం నాటికి విస్తృతమైన వ్యాక్సిన్‍ అందుబాటులోకి వస్తుందని మేము భావించడం లేదు అని పేర్కొన్నారు.

18న కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం

 kanaka-durga-flyover-opening-cermony-confirmed-september-18

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో పూర్తి చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రమంత్రి నితిన్‍ గడ్కరీ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డితో కలిసి ఈ నెల 18న జాతికి అంకితం చేయనున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఇందులో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్‍ ఒకటని ఆయన పేర్కొన్నారు. రూ.7,584 కోట్ల వ్యయంతో 877 కిలోమీటర్ల మేర నిర్మించనున్న 16 ప్రాజెక్టుల భూమిపూజ కార్యక్రమలో ఢిల్లీ నుంచి నితీన్‍ గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారని తెలిపారు. రూ.8038 కోట్ల వ్యయంతో 533 కిలోమీటర్ల మేర ఆరు, నాలుగు, రెండు వరుసలుగా విస్తరించిన రహదార్లను జాతికి అంకితం చేస్తారన్నారు. రూ.146 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రూ.501 కోట్లతో అత్యాధునికంగా నిర్మించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒకటని ఆయన తెలిపారు. దేశంలోనే ఆరు వరుసల నిర్మాణం చేసిన అత్యాధునిక బ్రిడ్జీల్లో ఇదొకటని ఆయన పేర్కొన్నారు.

24 గంటల్లో 10,776 మందికి కరోనా

 

Coronavirus Positive Cases in AP

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో ఒక్క రోజే 59,919 పరీక్షలు నిర్వహించగా, 10,776 మందికి పాజిటివ్‍గా తేలింది. ఇప్పటి వరకూ మొత్తం 39,65,694 మందికి పరీక్షలు చేయగా, మొత్తం పాజిటీవ్‍ కేసుల సంఖ్య 4,76,506కి చేరింది. గడిచిన 24 గంటల్లో 12,334 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ 3,70,163 మంది కోలుకున్నారు. తాజాగా 76 మంది మృతితో మొత్తం మరణాలు 4,276కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‍లో పేర్కొంది. యాక్టివ్‍ కేసులు 1,02,067 ఉన్నాయి.

ప్ర‌భాస్ సినిమా విష‌యంలో అలా చేసిందంటే.. దీపికలాంటి హీరోయిన్ ఎవ‌రైనా ఉంటారా?

 

Here s why Deepika Padukone refuse to take advance from Prabhas21 makers

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ పెరిగిపోయి అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన సాహో కూడా ప‌లు భాష‌ల్లో విడుద‌లైంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న రాధేశ్యామ్ కూడా భారీ చిత్రంగానే రూపొందుతోంది. ఈ సినిమా త‌ర్వాత నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్‌లో ప్ర‌భాస్ సినిమా చేస్తున్న‌ట్టు అశ్వ‌నీద‌త్ ప్ర‌క‌టించారు. సోషియో ఫాంట‌సీగా రూపొందే ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో రూపొందించ‌నున్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనేను ఎంపిక చేశారు. రాధేశ్యామ్ త‌ర్వాత ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ఈలోగా ప్ర‌భాస్‌, ఓం రౌత్ కాంబినేష‌న్‌లో ఆదిపురుష్ ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ కూడా న‌టించ‌డం విశేషం. అయితే నాగ్ అశ్విన్ సినిమా పూర్త‌యిన త‌ర్వాతే ఆదిపురుష్ సెట్స్ పైకి వెళ్తుంది. ఇదిలా ఉంటే ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ సినిమా కోసం ఇచ్చిన అడ్వాన్స్‌ను దీపికా ప‌దుకొనే వెన‌క్కి ఇచ్చేసింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంటే దీపిక ఈ సినిమా చేయ‌డం లేదా అనే అనుమానాలు అంద‌ర్నీ వెంటాడుతున్నాయి. ఆమె అడ్వాన్స్ వెన‌క్కి ఇచ్చెయ్య‌డానికి మ‌రో కార‌ణం ఉంద‌ట‌.

రాధేశ్యామ్ త‌ర్వాత నాగ్ అశ్విన్ సినిమా మొద‌ల‌వుతుంద‌ని అంద‌రూ భావిస్తున్న‌ప్ప‌టికీ.. ఆదిపురుష్ మొద‌ట లైన్‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దీన్నిబ‌ట్టి చూస్తే నాగ్ అశ్విన్ సినిమా మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సినిమా మొద‌లైన‌ప్పుడే అడ్వాన్స్ తీసుకోవాల‌ని భావిస్తోంద‌ట‌. దానివ‌ల్ల నిర్మాత‌పై భారం ప‌డ‌కుండా ఉంటుంద‌ని ఆమె ఆలోచ‌న‌ట‌. మంచి స్టార్‌డమ్ ఉన్న హీరోయిన్ అలాంటి ఓ మంచి ఆలోచ‌న చేయ‌డం నిజంగా గ్రేట్ అని యూనిట్ స‌భ్యులు అంటున్నారు. ఒక్క‌సారి అడ్వాన్స్ తీసుకుంటే సినిమా చేసినా చెయ్య‌క‌పోయినా వెన‌క్కి ఇవ్వ‌ని హీరోయిన్లు ఉన్న ఈరోజుల్లో దీపికా ప‌దుకొనే వంటి హీరోయిన్లు కూడా ఉండ‌డం సంతోషించాల్సిన విష‌య‌మే.

TFAS Meditation and Wellbeing Seminar on Sep 13th

 TFAS Meditation and Wellbeing Seminar on Sep 13th

Meditation and Wellbeing Seminar

Sunday, Sep 13th sharp @ 11 am EST

Click here to register

Zoom session will be open from 10.30 am EST and Zoom Link will be provided prior to the event

NATS Supports Petition on Bharat Ratna for Telugu Pride Shri P V Narasimha Rao

 NATS Supports Petition on Bharat Ratna for Telugu Pride Shri P V Narasimha Rao


NATS SUPPORTS Petition on Bharat Ratna for Telugu Pride Shri P V Narasimha Rao (Father of Indian Economic Reforms)

Please sign the Petition.

Link to Petition: BharatRatna4PV

పేద విద్యార్థులకు అండగా ఉయ్యాలా జంపాల హీరోయిన్ అవికా గోర్

 Avika gor Fundraising for Poor Students

ఈనాటి జనరేషన్ లో చదువుకు వున్నా ఇంపార్టెన్స్ మరో విషయానికి లేదని చెప్పాలి విద్య విషయంలో రాజీ పడకుండా అప్పు చేసైనా సరే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివిస్తున్నారు. అలాగే అందరికీ విద్య అనేది నేటికీ చాలా మంది పేద వారికి  అందని ద్రాక్షే అవుతోంది. చదువు పైన ఆసక్తి వున్నా  పేదరికం చాలా కుటుంబాల్లో చిన్నారులను విద్యకు దూరం చేస్తోంది. అంతేకాకుండా కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న ప్రస్తుత సంక్షోభంలో విద్యా బోధన మరింత సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో డిజిటల్ విద్య ద్వారా ఆ లోటును భర్తీ చేయడానికి ‘క్యాంప్ డైరీస్’ లాంటి కొన్ని సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి. యంగ్ హీరోయిన్ అవికా గోర్.. అలాంటి సంస్థలకు మద్దతు ఇస్తూ తన మంచి మనసు చాటుకుంటోంది. వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులకు సాయం అందించింది. మిలింద్ చాంద్వాని 2017 నుంచి ‘టీచ్ ఫర్ ఇండియా’తో పని చేస్తున్నారు. పేద, వెనుకబడ్డ వర్గాలకు చెందిన పిల్లలకు విద్యను సరదాగా, సులభంగా నేర్పడానికి మరో అడుగు ముందుకేసి ‘క్యాంప్ డైరీస్’ అనే సంస్థను స్థాపించారు. ఇందులో భాగంగా శని, ఆది వారాల్లో క్యాంపులు పెట్టి పేద విద్యార్థుల విద్యకు అదనంగా అవసరమైన కార్యకలాపాలను, ఆటపాటలను నిర్వహిస్తున్నారు. క్యాంపులో మంచి ప్రతిభ చూపిన పిల్లలకు గురువులు గా  నిలుస్తూ వారికి అన్ని విధాలా మద్దతను అందిస్తున్నారు.

‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ ద్వారా దేశ ప్రజలందరికీ సుపరిచితమైన నటి అవికా గోర్.. సినిమాల్లోనూ చక్కని నటనతో ఆకట్టుకుంది. నటనతో పాటు తన గొప్ప మనసును కూడా చాటుకుంటోంది. క్యాంప్ డైరీస్ సంస్థకు అన్ని విధాలా తన మద్దతు అందిస్తోంది. అవికా గోర్ తన పుట్టిన రోజు (జూన్ 30)ను కూడా క్యాంప్ డైరీస్ కోసమే కేటాయించింది. తన అభిమానులు, శ్రేయోభిలాషుల తన బర్త్ డే సందర్భంగా కానుకలు పంపించడానికి బదులు క్యాప్ డైరీస్ సంస్థ కోసం నిధులు సేకరించాలని కోరింది. ఇందుకోసం క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ‘మిలాప్’లో ఫండ్ రైసింగ్ ప్రారంభించింది. దీనికి విశేష స్పందన లభిస్తోంది. అవికా గోర్ ఈ ఫండ్ రైసర్ ద్వారా వచ్చిన విరాళాలకు సమానంగా తన సంపాదన లోంచి నిధులను కేటాయిస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా క్యాంప్ డైరీస్ ప్రతినిధులు మరిన్ని కార్యక్రమాలను తీర్చిదిద్దుతున్నారు. అవిక పుట్టిన రోజు మిలాప్ ఫండ్ రైసర్ ద్వారా సేకరించిన నిధులతో సిబ్బందికి, వివిధ కార్యక్రమాలకు అవసరమైన సామన్లు సమకూర్చుకున్నారు. వీటిలో ప్రొజెక్టర్లు, గిటార్లతో పాటు కళలు, ఆటలకు సంబంధించిన సామన్లు ఉన్నాయి. క్యాంప్ డైరీస్ సంస్థ ఇప్పటివరకు 9 నగరాల్లో 5000 మందికి పైగా విద్యార్థులను చేరుకుంది. వచ్చే విద్యా సంవత్సరంలో మరో 3000 మంది పిల్లలను చేర్చుకోవాలని  భావిస్తోంది. ఒక దేశంలో విద్యకు, అభివృద్ధికి ఉన్న అవకాశాలే ఆ దేశం పురోగతికి పునాదులుగా చెప్పవచ్చు. సామాజిక అసమానతలు దేశంలో ఆర్థిక, సాంఘిక విభజనను మరింత పెంచుతాయి. మన దేశం నలుమూలలా వందల సంఖ్యలో పాఠశాలల్లో ఇప్పటికీ డిజిటల్ విద్య సాధ్యం కావడంలేదు. దీని వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోతున్నారు. అలాంటి విద్యార్థులకు మద్దతు అందించడానికి ఎన్నో రెట్ల సాయం కావాల్సి ఉంది.

మెరుగు పడిన ఎస్ పి బాలు ఆరోగ్యం త్వరలో ఆస్పత్రి నుండి డిశ్చార్జ్

 

SP Charan Shares Update about SP Balasubrahmanyam Health Condition

ఎస్ పి బాలు హెల్త్ కండిషన్‌పై అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు ఎస్పీ తనయుడు చరణ్. గత నాలుగు రోజులుగా ఎస్పీ ఆరోగ్యం మెరుగైందని తెలిపిన ఆయన..డాక్టర్ల కృషి.. కోట్లాది మంచి అభిమానుల పూజలు ఫలించడంతో ఎస్పీ బాలు కోలుకుంటున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రాణాపాయం నుంచి ఆయన కోలుకుంటున్నారని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత మెరుగుపడిందని చికిత్సకు స్పందిస్తున్నారని చెన్నై ఎంజీఎం వైద్యులు తెలిపారు.

కాగా తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించి అప్ డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తున్న ఎస్పీ తనయుడు చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ‘గత నాలుగు రోజులుగా నాన్నగారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. చాలా బెటర్ మెంట్ ఉంది.. దేవుని దయతో ఈ వీకెండ్ వరకు అభిమానులు సంతోషకరమైన వార్త వింటారు. అభిమానులు, ప్రేక్షకుల ఆశీస్సులతో ఆయన కోలుకుంటున్నారు. వీరి ప్రార్థనల ఫలితంగా ఈ సోమవారం ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని ఎస్పీ తనయుడు చరణ్ ఇన్ స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో తెలిపారు.

https://www.instagram.com/p/CEq-kiKhqh6/?utm_source=ig_embed

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి

 23 YO Amazon employee from Hyderabad drowns in US

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ హైదరాబాద్‍ యువకుడు అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాడు. మిస్సోరిలోని సెయింట్‍ లూయిస్‍లో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‍కు చెందిన ఖాజా ఇమ్రాన్‍ ఖాన్‍ (23) సెయింట్‍ లూయిస్‍లోని సరస్సులో ఈతకు వెళ్లి అందులో మునిగిపోయాడు. వెంటనే స్నేహితులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఖాజా కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా, అమెరికా వెళ్లేందుకు తమకు ఎమర్జెన్సీ వీసా ఇప్పించాలని ఖాజా తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు.

ఖాజా ఇమ్రాన్‍ తన ఇద్దరు స్నేహితులతో కలిసి సెయింట్‍ లూయిస్‍లోని సరస్సులో ఈతకు వెళ్లాడు. కొంత సేపటి తర్వాత ఖాజా కనిపించకుండా పోయాడు. అనుమానం వచ్చిన స్నేహితులు చుట్టూ వెతకగా అతడు మునిగిపోతూ కనిపించాడు. వెంటనే వారు రెస్క్యూ టీమ్‍కు సమాచారం ఇవ్వగా వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. అమెరికాలో చదువుకుంటున్న కొడుకు చనిపోయాడన్న విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. కరోనా కారణంగా విమానాలు లేకపోవడం, మృతదేహాన్ని భారత్‍కు తెచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడే అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నది.