Thursday, April 30, 2020

ఎవరైనా అలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు



ఎవరైనా అలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు

కరోనా నివారణ, సహాయక చర్యలపై ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. కర్నూలు జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడంపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్‍ ఎవరికైనా సోకవచ్చని, అడ్డుకున్నవారికైనా ఇలాంటి పరిస్థితే రావొచ్చనే విషయం మరువరాదన్నారు. కరోనా సోకినవారిని అంటరానివారిగా చూడటం సరికాదన్నారు. బాధితులపై ఆప్యాయత, సానుభూతి చూపించాలే తప్ప వివక్ష చూపరాదన్నారు. 
కరోనా వైరస్‍ ముందులు వేసుకుంటే పోతుందని సీఎం పునరుద్ఘాటించారు. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారిపైనే వైరస్‍ ప్రభావం చూపుతుందన్నారు. అంతిమ సంస్కారాలు నిర్వహించకుండా అడ్డుకోవడం సరికాదని, ఇక మీదట ఎవరైనా అలా ప్రవరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఇలాంటి వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. కరోనా రావడం భయానకంగా, సోకిన వారిని అంటరానివారిగా చూడటం ఎట్టిపరిస్థితుల్లోనూ తగదన్నారు.

పెళ్లికి సిద్ధమే కానీ ఇప్పుడు కాదు



పెళ్లికి సిద్ధమే కానీ ఇప్పుడు కాదు

మిల్కీ బ్యూటీగా అభిమానుల చేత కీర్తింపబడే ఆమెకు ఇటీవల దక్షిణాదిలో తీవ్ర పోటీ వచ్చింది. కొత్త హీరోయిన్లు అనేక మంది వచ్చేస్తున్నారు. దాంతో సీనియర్లకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఈ పరిణాం సహజమే. పూర్తిగా పరిశ్రమ పక్కన పెట్టకముందుగానే ఓ ఇంటిది అంటే పెళ్లి చేసుకోవాలని భావించిందట. కొద్ది రోజుల క్రితం సోషల్‍ మీడియాలో తమన్నా పెళ్లికి సంబంధించిన వార్తలు షికారు చేశాయి. వీటిని ఆమె ధృవీకరించలేదు ఖండించలేదు. తను పెళ్లిసి సిద్ధంగానే ఉన్నానని మాత్రం తెలియజేసింది. ఆ తర్వాత కూడా ముంబైలోనే స్థిరపడాలనే ఆలోచనతో ఖరీదైన ఫ్లాట్‍ కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అకస్మాతుగా ఆమె ఆలోచన మారిందని అంటున్నారు. పెళ్లిని మరికొద్ది రోజులు వాయిదా వేసి, ఈలోపు ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తోందట. ఎందుకంటే తమన్నా రేంజ్‍కి కనీసం యాభై లక్షలు పైగా పారితోషికం చెల్లిస్తారు. అందుకే వీలయినంత వరకు ఆర్థికంగా మరింత స్థిరపడ్డాకే మూడు ముళ్ళ గురించి ఆలోచిస్తుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. తమన్నా ప్రస్తుతం సీటీమార్‍ అనే తెలుగు చిత్రం చేస్తోంది. ఇందులో మహిళా కబడ్డీ కోచ్‍గా నటిస్తోంది.

గూగుల్ మీట్ సేవలు ఉచితం



గూగుల్ మీట్ సేవలు ఉచితం
సెర్చింజిన్‍ దిగ్గజం గూగుల్‍ తన వీడియో కాన్ఫరెన్సింగ్‍ యాప్‍ మీట్‍ సేవలను భారత్‍ సహా ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందించాలని నిర్ణయించింది. రానున్న వారాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మీట్‍లో ప్రతిరోజు 300 కోట్ల నిమిషాలపాటు వీడియో సమావేశాలు జరుగుతున్నాయి. రోజు 30 లక్షల మంది కొత్త వినియోగదారులు చేరుతున్నారు. కరోనా వైరస్‍ ఉద్థ•తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆన్‍లైన్‍ సమావేశాలు పెరిగిపోయిన నేపథ్యంలో మీట్‍ సేవలను ఉచితం చేయాలని గూగుల్‍ నిర్ణయించినట్లు సమాచారం. మీట్‍ సేవలు వినియోగించుకోవాలనుకునే వారికి కచ్చితంగా గూగుల్‍ ఖాతా ఉండాలి.

Saturday, April 25, 2020

ఇలాంటి లక్షణాలు కరోనాకు సంకేతాలు!



ఇలాంటి లక్షణాలు కరోనాకు సంకేతాలు!
మీ కాలి వేళ్లలో ఏమైనా మార్పులు కనిపించాయా? కాలి వేళ్ల గోరు చుట్టూ లేదా కాళ్ల కింద చర్మం పగిలినట్లు లేదా కమిలినట్లు ఉన్నదా? దురద లేక నొప్పి కలుగుతున్నదా? ఇలాంటి లక్షణాలు కరోనాకు సంకేతాలు కావచ్చని అమెరికా వైద్యులు చెబుతున్నారు. కొవిడ్‍ టోస్‍ గా పేర్కొనే ఈ లక్షణాలు ఎక్కువగా పిల్లలు, యువతతోపాటు కొద్దిపాటి వైరస్‍ లక్షణాలున్న వారిలో కనిపిస్తున్నట్లు చర్మ వ్యాధి నిపుణుడు డాక్టర్‍ అమీ పల్లెర్‍ తెలిపారు. అయితే ఇవి కరోనా లక్షణా లేనా అన్నది కచ్చితంగా చెప్పలేమన్నారు.

ఎన్టీఆర్ సరసన శ్రుతిహాసన్ ?



ఎన్టీఆర్ సరసన శ్రుతిహాసన్ ?
అరవిందసమేత  వీరరాఘవ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్‍, దర్శకుడు త్రివిక్రమ్‍ కాంబినేషన్‍లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్‍.రాధాకృష్ణ(చినబాబు), నందమూరి కల్యాణ్‍రామ్‍ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో కథానాయికగా ఇప్పటివరకు పూజా హెగ్డే, కియారా అద్వానీల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలోని హీరోయిన్‍ పాత్ర కోసం శ్రుతీహాసన్‍ పేరు కూడా చిత్రబృందం పరిశీలిస్తోందనే టాక్‍ ఫిల్మ్ నగర్‍లో వినిపిస్తోంది. దాదాపు ఏడేళ్ల క్రితం వచ్చిన రామయ్యా వస్తావయ్యా చిత్రంలో ఎన్టీఆర్‍ సరసన ఓ కథానాయికగా శ్రుతీహాసన్‍ నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. మళ్లీ ఈ జోడీ కుదురుతుందా? వెయిట్‍ అండ్‍ సీ.

5 సెకన్లలో కరోనా పరీక్ష

5 సెకన్లలో కరోనా పరీక్ష
వ్యక్తులను తాకకుండా వారి నుంచి ఎలాంటి నమూనాలు సేకరించకుండా, కేవలం ఐదు క్షణాల్లో కరోనా గుట్టును తేల్చే ఎక్స్ర్‍ సాఫ్ట్ వేర్‍ పరీక్షా విధానం కొలిక్కి వచ్చింది. ఈ సాఫ్ట్వేర్‍ను ఉపయోగించడానికి ఆమోదం తెలపాలంటూ రూర్కీ ఐఐటీ ఇండియన్‍ కౌన్సిల్‍ ఆఫ్‍ మెడికల్‍ రీసెర్చ్ (ఐసీఎంఆర్‍)ను కోరింది. రూర్కీ ఐఐటీలోని సివిల్‍ ఇంజినీరింగ్‍ విభాగం ప్రొఫెసర్‍ కమల్‍ జైన్‍ మాట్లాడుతూ సాఫ్ట్వేర్‍లో ఒక వ్యక్తి ఛాతి ఎక్స్రేను అప్‍లోడ్‍ చేయగానే కేవలం ఐదు సెకన్లలోనే కొవిడ్‍ 19 వైరస్‍ సోకిందా? లేదా? అనే ఫలితం వస్తుందన్నారు.

Friday, April 24, 2020

ఈ ఏడాదిలో మరోసారి కోవిడ్ 19

ఈ  ఏడాదిలో  మరోసారి కోవిడ్ 19




మెరికాలో ఈ ఏడాదిలోనే మరోసారి కరోనా వైరస్‍ శాఖోపశాఖలుగా విజృంభించే అవకాశం ఉందని, అది ఇప్పటి కోవిడ్‍ 19 కన్నా ఎక్కువగానే ఉండవచ్చని అమెరికా ఉన్నతస్థాయి ఆరోగ్యాధికారి ఒకరు హెచ్చరించారు. ది వాషింగ్టన్‍ పోస్ట్ పత్రికతో సెంటర్‍ ఫర్‍ డిసీజ్‍ కంట్రోల్‍ అండ్‍ ప్రివెన్షన్‍ డైరెక్టర్‍ రాబర్ట్ రెడ్‍ఫీల్డ్ మాట్లాడుతూ అమెరికాను ఒకసారి ప్లూ మహమ్మారి, కరోనా వైరస్‍ అంటువ్యాధి చుట్టుముడతాయన్నారు. రెండూ ఒకేసారి ఉధృతంగా విజృంభిస్తే ఆరోగ్య సామర్థ్యం పరంగా పరిస్థితి చాలాచాలా ఘోరంగా ఉంటుంది. ఆరోగ్య రక్షణ వ్యవస్థ ఏ స్థితికి దిగజారుతుందో చెప్పలేం. అదృష్టమేమంటే ప్లూ వ్యాధి బాగా తగ్గుముఖం పట్టిన సమయంలో కరోనా వైరస్‍ వచ్చింది. అయితే, రాబోయే చలికాలంలో మా దేశంపై వైరస్‍ దాడిచేసే అవకాశం  ఉంది.  అమెరికాలో మిగతా సీజన్లకన్నా చలికాలం గడపడం చాలా కష్టం అని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‍ను నిరోధించే చర్యలు కొనసాగుతాయని, మరింతగా పరీక్షలు జరుగుతాయని వైట్‍హౌస్‍ సృష్టం చేసింది.

రవితేజ, కళ్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్ లకు ఛాలెంజ్ విసిరినా అనిల్ రావి పూడి

రవితేజ, కళ్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్ లకు  ఛాలెంజ్ విసిరినా అనిల్ రావి పూడి

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ‘బీ ది రియల్ మెన్’ అనే ఛాలెంజ్ నడుస్తోంది. ఈ ఛాలెంజ్‌కు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, రాజా మౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌‌, కీరవాణి, కొరటాల శివ, సుకుమార్‌, నిర్మాత శోభు యార్లగడ్డ, క్రిష్ వీళ్లంతా ఛాలెంజ్ ను స్వీకరించి ఇల్లు ఊడ్వడం, పాటు ఇంట్లో బాసాన్లు కడగటం బట్టలు ఉతకటం తోట పనులు చేయడం తో బాటు వంట చేయడం వంటి పనులు చేస్తున్నారు.
ఈ రోజు దర్శకుడు అనిల్ రావి పూడి ఇల్లు శుభ్రం చేసి, బట్టలు మడత పెట్టి, అంట్లు తోమి, తల్లికి వంట సాయం చేసి మొక్కలకు నీళ్లు పోసాడు. మొత్తానికి లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉన్న సెలబ్రిటీలు ఇపుడు ఇంట్లో పనులు చేస్తూ.. అభిమానులతో ప్రజలకు కూడా ఇంట్లో ఆడవాళ్లకు సాయం చేయమని మంచి సందేశం ఇస్తున్నారు.