Saturday, September 19, 2020

టిటిడి చైర్మన్ ప్రకటన వెనక్కి తీసుకోవాల్సిందే...సోము వీర్రాజు

 





తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్థులు ఇకపై డిక్లరేషన్‍ ఇవ్వక్కర్లేదు అంటూ టీటీడీ చైర్మన్‍ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటనపై ఏపీ బీజేపీ చీఫ్‍ సోము వీర్రాజు మండిపడ్డారు. టీటీడీ బోర్డు చైర్మన్‍ వెలువరించిన అంశాన్ని బీజేపీ ఖండిస్తోందని తెలిపారు. స్వర్గీయ అబ్దుల్‍ కలాం అంతటి వ్యక్తి తిరుమల వచ్చినప్పుడు అక్కడున్న రిజిస్టర్‍ లో సంతకం పెట్టి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం జరిగిందని వివరించారు. ఇది యావత్‍ భారతదేశంలో అన్యమతస్థులకు వర్తించే అంశమని, దీన్ని గమనించి ప్రకటన చేయాల్సిన సమయంలో సుబ్బారెడ్డి వివాదాస్పద రీతిలో ప్రస్తావించడం ఆయన అనాలోచిత వైఖరికి నిదర్శనం అని సోము పేర్కొన్నారు. అన్యమతస్థులు ప్రత్యేకంగా డిక్లరేషన్‍ ఇవ్వాల్సిన అవసరంలేదని, వారు స్వామివారి పట్ల భక్తి విశ్వాసాలతో దర్శనం చేసుకోవచ్చని వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

చురుగ్గా అంతర్వేది రథం నిర్మాణం పనులు..




 అంతర్వేది నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.. దీనిలో భాగంగా రావులపాలెం టింబర్‍ డిపోలో రథం నిర్మాణానికి అవసరమైన బస్తర్‍ టేకు కలప దుంగలను అధికారులు గుర్తించారు. 21 అడుగుల పొడవైన దూలాలుగా వాటిని కోయించే పక్రియ నేడు ప్రారంభమైంది. రథం నిర్మాణానికి 1330 ఘనపుటడుగుల కలప వినియోగిస్తున్నామని దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‍ రామచంద్ర మోహన్‍ తెలిపారు. పాత రథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణ డిజైన్లను దేవదాయ శాఖ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 41 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో ఏడంతస్తుల్లో ఆలయ రథం ఉంటుందని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇటీవల వివరించారు. ఆరు చక్రాలతో కూడిన కొత్త రథం నిర్మాణంతో పాటు, రథశాల మరమ్మతులకు రూ.95 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు

నితిన్ తో జత కట్టిన తమన్నా, నాభ నటేష్

 



హిందీ సూప‌ర్ హిట్ ఫిల్మ్ 'అంధాధున్‌'కు అఫిషియ‌ల్ తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా న‌టిస్తుండ‌గా, మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నవంబ‌ర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న‌ది. ఒరిజిన‌ల్‌లో ట‌బు, రాధికా ఆప్టే పోషించిన పాత్ర‌ల‌కు త‌మ‌న్నా, న‌భా న‌టేష్ ఎంపిక‌య్యారు.'అంధాధున్‌'లో త‌న న‌ట‌న‌తో ట‌బు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అమితంగా పొంద‌డంతో పాటు ఫిల్మ్‌ఫేర్ స‌హా ప‌లు అవార్డుల‌ను గెలుచుకున్నారు. ఇప్పుడు ప‌లు షేడ్స్ ఉండే ఆ రోల్‌ను చేసే స‌వాలును స్వీక‌రించారు త‌మ‌న్నా. ప్ర‌తి పాత్ర‌కూ ప్రాధాన్యం ఉండే ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం ల‌భించినందుకు న‌భా న‌టేష్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 6గా త‌యార‌య్యే ఈ చిత్రాన్ని ఎన్‌. సుధాక‌ర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తుండ‌గా, ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్పిస్తున్నారు.

మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి హ‌రి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి ప‌నిచేసే ఇత‌ర తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.
సాంకేతిక బృందం: సంగీతం: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌ సినిమాటోగ్ర‌ఫీ: హ‌రి కె. వేదాంత్‌ స‌మ‌ర్ప‌ణ‌:  ఠాగూర్ మ‌ధు నిర్మాత‌లు:  ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి సంభాష‌ణ‌లు, ద‌ర్శ‌క‌త్వం:  మేర్ల‌పాక గాంధీ.

గంగ‌వ్వ‌ను బిగ్ బాస్ జైలు నుండి బ‌య‌ట‌కు పంపించాలంటూ భారీగా నెటిజ‌న్ల పోస్టులు




'గంగ‌వ్వ‌ను గెలిపించ‌డ‌మే ఏకైక ల‌క్ష్యం' సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా ఇదే మాట వినిపించేది, ఇటువంటి పోస్టులే క‌నిపించేవి. ఇది మొన్న‌టి మాట‌. ఎప్పుడైతే హౌస్‌లో అనారోగ్యంతో అవ‌స్థ‌లు ప‌డుతున్న అవ్వ‌ను చూశారో అప్ప‌టి నుంచి చాలామంది మన‌సు మార్చుకున్నారు. మీ ఆట కోసం, టీఆర్పీల కోసం ఆమెను బ‌లి చేయ‌కండ‌ని వేడుకుంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ పీఆర్వో ర‌మేశ్ హ‌జారి ఫేస్‌బుక్‌లోనూ ఇదే త‌ర‌హా పోస్టు పెట్టారు. గంగ‌వ్వ‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని క్యాంపెయిన్ చేప‌ట్టారు. ఈ మేర‌కు శ‌నివారం సుదీర్ఘ పోస్టును నెటిజ‌న్ల‌తో పంచుకున్నారు. అస‌లు జైలు లాంటి బిగ్‌బాస్ ఇంట్లోకి పొమ్మ‌ని ఎవ‌రు చెప్పార‌ని అవ్వ‌ను ప్ర‌శ్నించారు. అక్క‌డ అన్ని సౌక‌ర్యాలుంటాయి గానీ మ‌న‌సున్న మ‌నుషులు దొర‌క‌ర‌ని వాపోయారు.

న‌వ్వుకు, ఏడుపుకు కూడా రేటింగులుంటాయ‌ని, మాన‌వ సంబంధాల‌కు ప‌రీక్ష పెట్టే ప్ర‌యోగ‌శాల అని రాసుకొచ్చారు. అక్క‌డ అవ్వ‌ ఆరోగ్యాన్ని ఎవ‌రు చూసుకుంటార‌ని దిగులు చెందారు. క‌నిపించ‌కుండా కేవ‌లం విన‌బ‌డే బిగ్‌బాస్ ఎవ‌రి బాగోగులు కోరే వ్య‌క్తి కాద‌ని, నిన్ను బొమ్మ‌ను చేసి అడిస్తాడ‌ని, నీ శ‌క్తినంతా గుంజుకుంటాడ‌ని ఆవేద‌న చెందారు. నీ ఏడుపు అత‌నికి పైస‌లు కురిపిస్తాయ‌ని విమ‌ర్శించారు. బిగ్‌బాస్ జైలు నుంచి గంగ‌వ్వ‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని ఓ పెద్ద ఉద్య‌మం లేస్తే త‌ప్ప త‌న‌ను వ‌దిలేలా లేర‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. "మాన‌వ సంబంధాల‌ను బందీల‌ను చేసి ప‌రీక్ష పెడుతున్న బిగ్‌బాస్ జైలు నుంచి గంగ‌వ్వ‌ను విడుద‌ల చేయాల‌ని పోరాడుదాం. గంగ‌వ్వ‌ను జ‌న జీవ‌న స్ర‌వంతిలోకి తీసుకువ‌ద్దాం" అని పిలుపునిచ్చారు. ఈ పోస్టుకు ప‌లువురు నెటిజ‌న్లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. 

డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు



కరోనా వైరస్‍ వ్యాక్సిన్‍పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పౌరులందరికీ సరిపడా వ్యాక్సిన్‍ డోసులు ఏప్రిల్‍ 2021 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. వ్యాక్సిన్‍కు అనుమతులు లభించిన వెంటనే ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ప్రతినెలా లక్షలాది డోసులు ఉత్పత్తి చేస్తాం. ఏప్రిల్‍ 2021 నాటికి అందరికీ సరిపడా వ్యాక్సిన్‍ డోసులు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నాం అని శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా వైద్యులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వ్యాక్సిన్‍ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని ట్రంప్‍ తెలిపారు. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్‍ ట్రయల్స్కు చేరుకున్నాయన్నారు. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే వ్యాక్సిన్‍ ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. ప్రజల ప్రాణాలను కాపాడడంతో పాటు అనేక ఆంక్షలకు సైతం టీక్‍ చెక్‍ పెట్టనుందన్నారు. సత్ఫలితాలిచ్చే అవకాశం ఉన్న వ్యాక్సిన్ల ఉత్పత్తిని ఇప్పటికే భారీ ఎత్తున ప్రారంభించామన్నారు.

ఏపీలో 8 వేలకు పైనే కేసులు





 ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో కరోనా వైరస్‍ ఉద్ధ•తి కొనసాగుతోంది. తాజాగా మరో 8 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 74,595 శాంపిల్స్ పరీక్షించగా, 8218 పాజిటివ్‍ కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి. 10,820 మంది కొత్తగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తంగా 50,33,676 శాంపిల్స్ను పరీక్షించగా.. 6,17,776 పాజిటివ్‍ కేసులు నమోదయ్యాయి. వీరిలో 5302 మంది ప్రాణాలు కోల్పోగా.. 5,30,711 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 81,763 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ వైరస్‍ తీవ్రత కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1395 కేసులు నమోదవ్వగా, పశ్చిమగోదావరి జిల్లాలో 1071 పాజిటివ్‍ కేసులు వచ్చాయి.

గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరు జిల్లాలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, కృష్ణా జిల్లాలో ఏడుగురు, అనంతపురం, గుంటూరు, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో నలుగురేసి చొప్పున మృతిచెందారు. అలాగే, తూర్పు గోదావరి, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురేసి మృతి చెందగా, విజయనగరం జిల్లాలో ఒకరు ప్రాణాలు విడిచారు.

Tuesday, September 8, 2020

మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌లో డైరెక్ట‌ర్ స్వ‌రూప్ ఆర్ఎస్‌జె చిత్రం

 

director swaroop movie in matnee entertainment banner

మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అన‌గానే మ‌న‌కు 'క్ష‌ణం', 'ఘాజీ', 'గ‌గ‌నం' లాంటి అటు ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను, ఇటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌నూ అందుకున్న చ‌క్క‌ని క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు గుర్తుకొస్తాయి. త‌క్కువ కాలంలోనే అభిరుచి క‌లిగిన నిర్మాణ సంస్థ‌గా పేరు తెచ్చుకున్న మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ త‌న ఎనిమిదో చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్ట‌ర్ స్వ‌రూప్ ఆర్ఎస్‌జె ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించేందుకు స‌న్నాహాలు ప్రారంభించింది. 'ఏజెంట్ సాయిశ్రీ‌నివాస' ఆత్రేయ లాంటి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను రూపొందించిన ద‌ర్శ‌కుడిగా తొలి చిత్రంతోనే స్వ‌రూప్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించారు. ద‌ర్శ‌కునిగా త‌న రెండో చిత్రం కోసం ఒక యూనిక్ స‌బ్జెక్ట్‌ను స్వ‌రూప్ ఎంచుకున్నారు. ఇంకా టైటిల్ ఖ‌రారు కాని ఈ సినిమా క‌థ తిరుప‌తి స‌మీపంలోని ఓ గ్రామంలో ఒక నిధి అన్వేష‌ణ నేప‌థ్యంలో జ‌రుగుతుంది. తొలి చిత్రం త‌ర్వాత స్వ‌రూప్ తన రెండో చిత్రాన్ని ఎలా తీయ‌నున్నార‌నే అమితాస‌క్తి ప్రేక్ష‌కుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌టంతో పాటు ఆయ‌నే ర‌చ‌న కూడా చేస్తున్నారు. ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ సంద‌ర్భంగా చిత్ర బృందం విడుద‌ల చేసిన పోస్ట‌ర్ సినిమాపై ఆ ఆస‌క్తిని రెట్టింపు చేసేలా ఉంది.

గ్రామీణ నేప‌థ్యం ఉట్టిప‌డుతున్న విధంగా బ్యాగ్రౌండ్ క‌నిపిస్తున్న ఈ పోస్ట‌ర్‌లో శిథిలావ‌స్థ‌లో ఉన్న ఓ గోడ‌పై ఒక కోడి నిల్చొని ఉంటే, ఆ గోడ మీద "వాంటెడ్ డెడ్ ఆర్ అలైవ్" అనే హెడ్డింగ్‌తో ఓ పోస్ట‌ర్‌ను అంటించారు. ముఖం స‌రిగా క‌నిపించిన ఓ వ్య‌క్తి ఫొటో కింద రూ. 50 ల‌క్ష‌ల బ‌హుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న క‌నిపిస్తోంది. అంటే ఆ పోస్ట‌ర్‌లోని వ్య‌క్తిని చంపినా, స‌జీవంగా ప‌ట్టిచ్చినా వారికి రూ. 50 ల‌క్ష‌ల బ‌హుమ‌తిని ఇస్తామ‌నే ఆ ప్ర‌క‌ట‌న బ‌ట్టి, ఆ ఫొటోలోని వ్య‌క్తి ఈ సినిమాకి కీల‌క పాత్ర‌ధారి అని అర్థ‌మ‌వుతోంది. ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నేది ఆస‌క్తిక‌రం. ఇప్ప‌టికే రెండు భారీ చిత్రాలు - మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య‌', అక్కినేని నాగార్జున‌తో 'వైల్డ్ డాగ్' - నిర్మిస్తోన్న మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఇప్పుడు ఆస‌క్తిక‌ర కథాంశంతో వ‌రుస‌గా మూడో చిత్రాన్ని ప్ర‌క‌టించడం గ‌మ‌నార్హం.

నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్న‌ ఈ సినిమా షూటింగ్ వ‌చ్చే డిసెంబ‌ర్ నెల‌లో ప్రారంభం కానున్న‌ది. ఈ చిత్రానికి ప‌నిచేసే తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

డెమొక్రాట్స్ క్షమాపణ చెప్పాలి అని అంటున్న ట్రంప్ వర్గం

 

Trump demands apology from Biden for challenging him on vaccines

అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరియు మాజీ ఉపాధ్యక్షులు జో బిడెన్ ఓటర్లను ఆకర్షించటానికి చిన్న విషయాలను కూడా వదలకుండా వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న సంగతి తెలిసిందే! గత వారం అట్లాంటిక్‌లో అద్ధ్యక్షులు ట్రంప్ మిలిటరీ సభ్యులను మరియు అమెరికా యుద్ధంలో చనిపోయిన వారిని "ఓడిపోయినవారు" మరియు "సక్కర్లు" అని వ్యాఖ్యానించడంతో ప్రతిపక్షాలు అమెరికా అద్ధ్యక్షులు అయిఉండి వీర జవాన్లను ఓడిపోయినవారు గా ఎలా పిలవగలుగుతారు అని ప్రశ్నించడంతో అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ నార్త్ పోర్టికో వైట్ హౌస్ మీడియా సమావేశం లో గత వారం అట్లాంటిక్‌లో మిలిటరీ సభ్యుల ప్రసంగాన్ని ఉద్దేశించి ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు “నేను ఎవరినీ ఓడిపోయినట్లు లేదా సక్కర్లు గా పిలవలేదు నేను యుద్ధ వాతావరణాన్ని ఉద్దేశించి మాత్రమే చెప్పిన మాటలు.” అని స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నించారు.

నవంబర్ మొదటి వారం నాటికి కవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటు పై డెమొక్రటిక్ నామినీ జో బిడెన్ మరియు డెమోక్రాటిక్ పార్టీ వైస్-ప్రెసిడెంట్ సేన్. కమల హర్రీస్ “అద్ధ్యక్షులు ట్రంప్ వ్యాఖ్యలు విశ్వసించదగినవి కాదు” అని చేసిన వ్యాఖ్యలకి అద్ధ్యక్షులు ట్రంప్ కు వెంటనే క్షమాపణ చెప్పాలి అని అద్ధ్యక్షులు ట్రంప్ డిమాండ్ చేశారు.

Monday, September 7, 2020

నాట్స్ ఆధ్వర్యంలో టెన్నీస్ డబుల్స్ టోర్నమెంట్‌

 

NATS Sports event held by NJ Chapter

న్యూజెర్సీలో ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు ప్లేయర్స్ అమెరికా లో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీలో టెన్నీస్ డబుల్స్ టోర్నమెంట్ నిర్వహించింది. తెలుగు ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఈ టోర్నమెంటులో పాల్గొన్నారు. కొన్ని వారాల పాటు లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తూ వచ్చిన నాట్స్ తాజాగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించింది. ప్లయిన్స్‌బొరో టీం (కృష్ణ కిషోర్ బండి, వాసుదేవ మైల) ఈ టోర్నమెంట్ విజేతగా నిలిచింది.. సౌత్ జెర్సీ టీం ( సందీప్ అనంతుల, రమేశ్ జంగా) రన్నరప్‌గా నిలిచింది.

ఈ టోర్నెమెంటుకు కావాల్సిన సహయ సహకారాలు అందించిన నాట్స్ బోర్డు డైరెక్టర్ మోహనకృష్ణ మన్నవకు నాట్స్ క్రీడా విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ నేషనల్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ కొణిదెల ఈ టోర్నమెంట్‌ను సమర్థవంతంగా నిర్వహించారు.

నాట్స్ నాయకులు కుమార్ వెనిగళ్ల, వంశీ వెనిగళ్ల ఈ టోర్నమెంటు నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఈ టోర్నమెంట్ విజేతలకు నాట్స్ ముఖ్య నాయకుల చేత బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. మోహనకృష్ణ మన్నవ, అరుణ గంటి, గంగాధర్ దేసు, సూర్యం గంటి, శ్రీహరి మందాడి, రాజ్ అల్లాడ, రంజిత్ చాగంటి, శ్యాం నాళం, రమేశ్ నూతలపాటి, మురళీ మేడిచర్ల, చక్రధర్ ఓలేటి, విష్ణు ఆలూరు, సురేశ్ బొల్లు, సూర్య గుత్తికొండ, రాజేశ్ బేతపూడి, శ్రీనివాస్ మెంట, శేషగిరి కంభంమెట్టు, శ్రీనివాస్ భీమినేని, శ్రీథర్ దోనేపూడి, ప్రశాంత్ గోరంట్ల, రామకృష్ణ నరేడ్ల, విష్ణు కనపర్తి, సుధాకర్ తురగా, రాకేశ్ దొమ్మాలపాటి, కిరణ్ చాగర్లమూడి తదితర నాట్స్ నాయకులు ఈ టోర్నమెంట్ బహుమతులు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన ఆటగాళ్లను వీరు ప్రత్యేకంగా ప్రశంసించారు.

బావర్చీ బిర్యానీ, NJ Life ఈ కార్యక్రమానికి స్పానర్స్ గా వ్యవహరించారు.

కంగ‌నాకి వై కేట‌గిరీ భ‌ధ్ర‌త‌..

 Kangana Ranaut granted Y plus category security ahead of her return to Mumbai on 9 September


బ‌హుశా భార‌త దేశ చ‌రిత్ర‌లోనే సినిమాల‌కు ప‌రిమిత‌మైన ఏ న‌టికీ ఈ ర‌క‌మైన భ‌ధ్ర‌త కేంద్ర‌ ప్ర‌భుత్వం క‌ల్పించిన దాఖ‌లాల్లేవు. ఆ ఘ‌న‌త‌ను సాధించింది బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్‌. గ‌త కొన్ని రోజులుగా ర‌కర‌కాలుగా వార్త‌ల్లో ఉంటోంది ఈ బాలీవుడ్ క్వీన్‌. తొలుత నెపొటిజం, బాలీవుడ్ తో డ్ర‌గ్స్ లింకులు వగైరా అంశాల్లో మీడియాకు సంచ‌ల‌నంగా మారేలా వాగ్భాణాలు సంధించిన కంగ‌న‌... తాజాగా ముంబ‌యి మీద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ముంబ‌యి న‌గ‌రం పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ (పిఒకె) లా త‌యారైంద‌ని ఆమె వ్యాఖ్యానించ‌డం తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తించింది. అప్ప‌టిదాకా కంగ‌న మీద క‌త్తులు నూరుతున్న బాలీవుడ్ పెద్ద‌ల‌కు శివ‌సేన వంటి మ‌త‌త‌త్వ పార్టీలు తోడ‌య్యాయి. ఆమెని ముంబ‌యి నుంచి త‌రిమి కొట్టాలంటూ ప‌లువురు రాజ‌కీయ నేత‌లు, ప్ర‌జా సంఘాల నాయ‌కులు విమ‌ర్శ‌ల ప‌ర్వం మొద‌లుపెట్టారు. అదే క్ర‌మంలో కంగ‌న త‌న మాట‌లు వెన‌క్కి తీసుకోవాల‌ని లేని ప‌క్షంలో ఆమెని ముంబ‌యిలో అడుగుపెట్ట‌బోనివ్వ‌మ‌ని శివ‌సేన ఎంపి సంజ‌య్ రౌత్ తీవ్రంగా హెచ్చ‌రించారు.

అయితే ఈ హెచ్చ‌రిక‌కు కంగ‌న అంత‌కంటే ఘాటుగా స్పందించింది. తాను ముంబ‌యిలో అడుగుపెడుతున్నాన‌ని ఎయిర్‌పోర్ట్‌లో ఫ‌లానా స‌మ‌యానికి దిగుతాన‌ని ద‌మ్ముంటే అడ్డుకోవాలంటూ స‌వాల్ విసిరింది. దీంతో మొత్తం వ్య‌వ‌హారం కేంద్ర ప్ర‌భుత్వం దాకా వెళ్లింది. కంగ‌న‌కు అవ‌స‌ర‌మైన భ‌ధ్ర‌త క‌ల్పించాల‌ని హిమాచల్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేసింది. ఈ విజ్ఞ‌ప్తిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న కేంద్రం ఆమెకు వై కేటగిరీ భ‌ధ్ర‌త ఏర్పాటు చేస్తూ సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Sunday, September 6, 2020

కొలంబస్ నగరంలో పీ.వీ. నరసింహారావు శతజయంతి ఉత్సవాలు

 

pv centenary celebrations in columbus

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన స్వర్గీయ మాజీ ప్రధాని పీ.వీ. నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖండాంతరాల్లో మొట్టమొదటి కార్యక్రమం అమెరికాలోని ఒహయో రాష్ట్రంలో గల కొలంబస్ నగరంలో ఎన్నారై టి.ఆర్.స్ ఛైర్మెన్ తన్నీరు మహేష్ రావు గారి ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు గారు, పీవీ కూతుర్లు సురభి వాణి దేవి గారు, కలకోట సర్వసతి గారు, ఉత్సవ కమిటి సభ్యులు మహేష్ బిగాల గారు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు వారితో పాటు ఇతర రాష్ట్రాల ప్రవాస భారతీయులు, పీవీ అభిమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోవిద్ పరిమితుల దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమెరికాలో లోని వివిధ రాష్ట్రాల నుండి పీవీ అభిమానులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని టీవీ ఆసియ తెలుగు వారు ప్రత్యక్ష ప్రసారం చేసారు.

కేశవ రావు గారు మాట్లాడుతూ జ్ఞ్యాన సమున్నత, విధాన నిర్ణయాలు, రాజనీతి, సాహితి సాంస్కృతిక, పరిపాలన, ఆధ్యాత్మికత విషయాల్లో  పీవీ గారు ఆయనకు ఆయనే సాటి అని, ఆర్ధిక సంస్కరణలతో ఆధునిక భారతాన్ని ఆవిష్కరించిన దూరాదృష్టి గల నాయకుడని అన్నారు. ప్రధాన మంత్రిగా మరియు వివిధ మంత్రిత్వ  హోదాల్లో  పీవీ గారు భారత దేశానికి  చేసిన సేవలను గుర్తుచేస్తూ వారికి భారత రత్న ప్రదానం చేయడమే సరైన గౌరవ మని, భారత రత్న పురస్కారం గురించి పార్లమెంట్ లో నివేదిస్తామన్నారు. భారత దేశంలో మొట్టమొదటి సారి భూసంస్కరణలు తీసుకువచ్చి దున్నేవాడికే కాకుండా భూమి లేని వాడికి కూడా భూమి ఉండాలని 1971 లో ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకువచ్చి స్వతంత్ర భారతదేశంలో ఆదర్శవంతునిగా నిలిచారని చెప్పారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఏడాది పాటు ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలు, స్మృతి మందిర నిర్మాణం, పీవీ స్వగ్రామమైన వంగరలో స్మారక చిహ్నం, అంతర్జాతీయ స్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.

పీవీ నరసింహ రావు గారి వ్యక్తిత్వము మరియు వారి యొక్క భావవ్యక్తీకరణ విధానం గూర్చి వారి కూతురు డాక్టర్ సరస్వతి గారి మాటలలోనే   "చేతలు మరియు నడవడి ద్వార ఎదుటి వారిపై చెదరని ముద్ర వేసే వారు ఇంకా మనము ఏదైనా కార్యసాధన చేసేటప్పుడు ఆ పనిలో మనస్ఫూర్తిగా నిమగ్నమైనప్పుడే ఆ పని విజయవంతం చేయగలము అని చెప్పే వారు. అది నా వ్యక్తిత్వము మరియు నడవడిలో చెరగని ముద్ర వేసినాయి". పీవీ గారు అతి సామాన్యంగా ఉండడానికి ఇష్టపడేవారు, ప్రకృతితో పాటు దేశాన్ని కూడా ఆరాధించేవారు మరియు నిత్యం యోగ సాధన చేసేవారని వారి కూతురు సురభి వాని దేవి గారు అన్నారు.

తన్నీరు మహేష్ గారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారి సూచనల మేరకు పీవీ శతజయంతి ఉత్సవాలను అమెరికాలోని ముఖ్య నగరాల్లో  నిర్వహించడానికి అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని వివిధ సంఘాల సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సీ మరియు ఇతర నగరాల్లో పీవీ విగ్రహావిష్కరణ, పీవీ బహుముఖప్రజ్ఞకు అద్దంపట్టేలా, ఔన్నత్యం దశ దిశలా  చాటే విదంగా జాతీయ స్థాయి సదస్సులు, కార్యక్రమాలు ఏడాది పాటు ప్రతినెలా నిర్వహిస్తామన్నారు. 1994 పీవీ గారి అమెరికా పర్యటన గుర్తుచేస్తూ.. ఆ సందర్బంగా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌తో సమావేశం లో తలెత్తే ప్రశ్నలను పీవీ గారు ముందుగా అంచనా వేసి వివరించడంతో..  క్లింటన్ భారత దేశంలో పెట్టుబడులు, ఆర్ధిక విధానాలపై మరింత ఆసక్తి చూపి భేటీ నిర్ణీత సమయం కన్నా మరో ఇరవై నిమిషాలు కొనసాగించి మన దేశానికి పెట్టుబడులను అందించారని అన్నారు.

పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ సూచన మేరకు ఏడాది పాటు ప్రపంచవ్యాప్తంగా యాబై దేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ అమెరికా, బ్రిటన్, దక్షిణ ఆఫ్రికా, సింగపూర్, మలేషియా మరియు మారిషెస్ దేశాల్లో పీవీ గారి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సీ ఇంకా ముఖ్య నగరాల్లో విగ్రహ ఏర్పాట్లకు ప్రణాళిక రూపాందించామన్నారు. వచ్చే ఏడాది హైదెరాబాద్లో నిర్వహించే పీవీ శతజయంతి వేడుకలకు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ను ముఖ్య అతిధిగా ఆహ్వానించేందుకు ఆలోచిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమ ఏర్పాటుకు ముందుండి అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నారై టి.ఆర్.స్ రీజినల్ కోఆర్డినేటర్ కానుగంటి నవీన్ గారిని పలువురు అభినందించారు.  ఈ సమావేశంలో ప్రముఖ ప్రవాస భారతీయులు నీల్ పటేల్, కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రవణ్ చిద్రూప, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఛైర్మెన్ రామకృష్ణ కాసర్ల, అధ్యక్షుడు రజినీకాంత్ కట్టే, ఎన్నారై టి.ఆర్.స్ కార్యదర్శి నరసింహ నాగులవంచా సెంట్రల్ ఒహియో తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ చలసాని, ఎస్.వి టెంపుల్ ట్రస్టీ కేశవ రెడ్డి, అశోక్ ఇల్లందుల, అమర్ రెడ్డి, రమేష్, సాలందరి, కిరణ్, డేవిడ్, గోవర్ధన్, వంశీ, కే.కిరణ్, వినయ్, మధు తదితరులు పాల్గొన్నారు.

ఫిట్‌నెస్ ట్రైనర్ కి 20 లక్షల రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్.... అదీ ప్రభాస్ రేంజ్

 Prabhas Gifts Gym Trainer Laxman Range Rover


రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఎలా ఉంటుందో చెబుతూ తన ఫిట్‌నెస్ ట్రైనర్ కోసం 20 లక్షల రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్ ఇచ్చారు ప్రభాస్. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రభాస్.. ఎంతైనా వరల్డ్ క్రేజీ స్టార్ కదా! అందుకే ఆయన ఏ పని చేసినా ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. సినిమాల్లో అయినా నిజ జీవితంలో అయినా ఈ బాహుబలి సత్తానే వేరులే. ఇక తాను ఇష్టపడుతున్న వాళ్ల కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ క్రమంలోనే తాజాగా తనకిష్టమైన తన ఫిట్‌నెస్ ట్రైనర్‌కి ఖరీదైన సర్‌ప్రైజింగ్ ఇచ్చి అతన్ని, అతని కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తాడు ప్రభాస్.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫిట్‌నెస్ ట్రైనర్‌‌గా లక్ష్మణ్ అనే వ్యక్తి చాలా కాలంగా పనిచేస్తున్నాడు. ప్రభాస్‌ను సరికొత్తగా మేకోవర్ చేయడంలో ఈయనదే ముఖ్యపాత్ర. ప్రభాస్ ఫిట్‌నెస్ పరంగా పర్సనల్ కేరింగ్ తీసుకొని ఎప్పటికప్పుడు తగు సూచనలిస్తుంటాడు లక్ష్మణ్.

ఈ నేపథ్యంలోనే ఆయన సేవలకు గుర్తుగా ఖరీదైన రేంజ్‌రోవర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు ప్రభాస్. ఈ సడెన్ సర్‌ప్రైజ్ చూసి లక్ష్మణ్, ఆయన ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ మేరకు తన కుటుంబంతో ప్రభాస్ వద్దకు వచ్చి ఆయనతో ఫోటోలు దిగాడు లక్ష్మణ్. ఓ ఫిట్‌నెస్ ట్రైనర్ కోసం ప్రభాస్ అందించిన ఈ గిఫ్ట్ చూసి ప్రభాస్ రేంజ్ అంటే ఇదీ అంటూ మురిసిపోతున్నారు ఆయన ఫ్యాన్స్.ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' సినిమా చేస్తున్న ఆయన.. ఆ తర్వాత వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో మరో భారీ సినిమా 'ఆదిపురుష్' చేయబోతున్నారు ప్రభాస్.

10,000 మంది అమెరికన్స్ కు ఉద్యోగాలు: అమెజాన్

 Amazon Continues Hiring Spree With 10,000 New Jobs Two New Towers

2019 లో ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వాషింగ్టన్లోని బెల్లేవ్‌లో 43 అంతస్తుల కొత్త టవర్‌ నిర్మాణం పని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ 15,000 మంది అమెరికన్స్ కు ఉపాధి కల్పిస్తుంది అని అమెజాన్ ఆ సమయంలో తెలిపింది. అయితే శుక్రవారం 4th సెప్టెంబర్ న అమెజాన్ అదనంగా రెండు మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని దక్కించుకున్నందున ఆ సంఖ్యకు మరింత ఎక్కువ ఉద్యోగాలను జోడించినట్లు అమెజాన్ తెలిపింది.

మొత్తంగా, బెల్లేవ్‌లో అమెజాన్ రాబోయే కొన్నేళ్లలో 25 వేల ఉద్యోగాలను కల్పించడానికి యోచిస్తోంది అని అమెజాన్ తన బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది. అయితే వాటిలో కనీసం 10,000 మంది కొత్త వారిని, మరికొంతమంది ని సీటెల్‌లోని అమెజాన్ ప్రధాన కార్యాలయం నుండి బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. జూన్ 30 నాటికి 877,000 మంది శ్రామికశక్తి తో ఉన్న అమెజాన్ covid-19 కారణం గా డోర్ డెలివరీ కి పెరుగుతున్న డిమాండ్ తీర్చడానికి 75,000 మంది తాత్కాలిక కార్మికులను నియమించుకునే ప్రణాళికను ఏప్రిల్‌లో కంపెనీ ప్రకటించింది.

ప్రపంచమంతటా మొదలైన పీవీ ఉత్సవాలు , అమెరికాలోని కొలంబస్ నగరంలో విజయవంతమైన మొట్టమొదటి సభ

 

pv centenary celebrations starts

సంవత్సరం పాటు బ్రహ్మాండంగా నిర్వహిస్తాం : కేకే

పీవీ కి భారత రత్న కోసం ఆన్లైన్ పిటిషన్ లాంచ్ చేసిన మహేష్ బిగాల

పీవీ గారు అతి సామాన్యంగా ఉండడానికి ఇష్టపడేవారు, ప్రకృతితో పాటు దేశాన్ని కూడా ఆరాధించేవారు : కూతుళ్లు వాణి దేవి , సరస్వతి

అమెరికా అంతటా శత జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తాం : మహేష్ తన్నీరు

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన స్వర్గీయ మాజీ ప్రధాని పీ.వీ. నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖండాంతరాల్లో మొట్టమొదటి కార్యక్రమం అమెరికాలోని ఒహయో రాష్ట్రంలో గల కొలంబస్ నగరంలో తెరాస ఎన్నారై అడ్విసోరీ చైర్మన్ తన్నీరు మహేష్ రావు గారి ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు గారు, ఉత్సవ కమిటి సభ్యులు మహేష్ బిగాల గారు, పీవీ కూతుర్లు సురభి వాణి దేవి గారు పాల్గొన్నారు , కలకోట సర్వసతి గారు 50 సంవత్సరాల నుంచి అమెరికా లో నివాసం వున్నారు , ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పాల్గొని పీవీ గారి స్మృతులను గుర్తుచేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు వారితో పాటు ఇతర రాష్ట్రాల ప్రవాస భారతీయులు, పీవీ అభిమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కోవిద్ పరిమితుల దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమెరికాలో లోని వివిధ రాష్ట్రాల నుండి పీవీ అభిమానులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని టీవీ ఆసియ తెలుగు వారు ప్రత్యక్ష ప్రసారం చేసారు.

కేశవ రావు గారు మాట్లాడుతూ జ్ఞ్యాన సమున్నత, విధాన నిర్ణయాలు, రాజనీతి, సాహితి సాంస్కృతిక, పరిపాలన, ఆధ్యాత్మికత విషయాల్లో పీవీ గారు ఆయనకు ఆయనే సాటి అని, ఆర్ధిక సంస్కరణలతో ఆధునిక భారతాన్ని ఆవిష్కరించిన దూరాదృష్టి గల నాయకుడని అన్నారు. ప్రధాన మంత్రిగా మరియు వివిధ మంత్రిత్వ హోదాల్లో పీవీ గారు భారత దేశానికి చేసిన సేవలను గుర్తుచేస్తూ వారికి భారత రత్న ప్రదానం చేయడమే సరైన గౌరవ మని, భారత రత్న పురస్కారం గురించి పార్లమెంట్ లో నివేదిస్తామన్నారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఏడాది పాటు ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలు, స్మృతి మందిర నిర్మాణం, పీవీ స్వగ్రామమైన వంగరలో స్మారక చిహ్నం, అంతర్జాతీయ స్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.

పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ సూచన మేరకు ఏడాది పాటు ప్రపంచవ్యాప్తంగా యాబై దేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ అమెరికా, బ్రిటన్, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా , న్యూజీలాండ్ , సింగపూర్, మలేషియా మరియు మారిషెస్ దేశాల్లో పీవీ గారి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సీ ఇంకా ముఖ్య నగరాల్లో విగ్రహ ఏర్పాట్లకు ప్రణాళిక రూపాందించామన్నారు అలాగే పీవీ గారికి భారత రత్న ఇవ్వాలని ఆన్లైన్ లో పిటిషన్ ( https://www.change.org/BharatRatnaforPV )లాంచ్ చేసారు , దీని ద్వారా ప్రపంచమంతటా పీవీ అభిమానులు ఆన్లైన్ లో తమ మద్దతు తెలియజేయాలని అన్నారు , అలాగే ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వచ్చే ఏడాది హైదరాబాద్ లో నిర్వహించే పీవీ శతజయంతి వేడుకలకు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ను ముఖ్య అతిధిగా ఆహ్వానించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు.

పీవీ నరసింహ రావు గారి వ్యక్తిత్వము మరియు వారి యొక్క భావవ్యక్తీకరణ విధానం గూర్చి వారి కూతురు డాక్టర్ సరస్వతి గారి మాటలలోనే "చేతలు మరియు నడవడి ద్వార ఎదుటి వారిపై చెదరని ముద్ర వేసే వారు ఇంకా మనము ఏదైనా కార్యసాధన చేసేటప్పుడు ఆ పనిలో మనస్ఫూర్తిగా నిమగ్నమైనప్పుడే ఆ పని విజయవంతం చేయగలము అని చెప్పే వారు. అది నా వ్యక్తిత్వము మరియు నడవడిలో చెరగని ముద్ర వేసినాయి".

పీవీ గారు అతి సామాన్యంగా ఉండడానికి ఇష్టపడేవారు, ప్రకృతితో పాటు దేశాన్ని కూడా ఆరాధించేవారు మరియు నిత్యం యోగ సాధన చేసేవారని వారి కూతురు సురభి వాని దేవి గారు అన్నారు.

తన్నీరు మహేష్ గారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారి సూచనల మేరకు పీవీ శతజయంతి ఉత్సవాలను అమెరికాలోని ముఖ్య నగరాల్లో నిర్వహించడానికి అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని వివిధ సంఘాల సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సీ మరియు ఇతర నగరాల్లో పీవీ విగ్రహావిష్కరణ, పీవీ బహుముఖప్రజ్ఞకు అద్దంపట్టేలా, ఔన్నత్యం దశ దిశలా చాటే విదంగా జాతీయ స్థాయి సదస్సులు, కార్యక్రమాలు ఏడాది పాటు ప్రతినెలా నిర్వహిస్తామన్నారు. 1994 పీవీ గారి అమెరికా పర్యటన గుర్తుచేస్తూ.. ఆ సందర్బంగా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌తో సమావేశం లో తలెత్తే ప్రశ్నలను పీవీ గారు ముందుగా అంచనా వేసి వివరించడంతో.. క్లింటన్ భారత దేశంలో పెట్టుబడులు, ఆర్ధిక విధానాలపై మరింత ఆసక్తి చూపి భేటీ నిర్ణీత సమయం కన్నా మరో ఇరవై నిమిషాలు కొనసాగించి మన దేశానికి పెట్టుబడులను అందించారని అన్నారు.

ఈ కార్యక్రమ ఏర్పాటుకు ముందుండి అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నారై టి.ఆర్.స్ రీజినల్ కోఆర్డినేటర్ కానుగంటి నవీన్ గారిని పలువురు అభినందించారు. ఈ సమావేశంలో ప్రముఖ ప్రవాస భారతీయులు నీల్ పటేల్, కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రవణ్ చిద్రూప, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఛైర్మెన్ రామకృష్ణ కాసర్ల, అధ్యక్షుడు రజినీకాంత్ కట్టే, ఎన్నారై టి.ఆర్.స్ కార్యదర్శి నరసింహ నాగులవంచా సెంట్రల్ ఒహియో తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ చలసాని, ఎస్.వి టెంపుల్ ట్రస్టీ కేశవ రెడ్డి, అశోక్ ఇల్లందుల, అమర్ రెడ్డి, రమేష్, సాలందరి, కిరణ్, డేవిడ్, గోవర్ధన్, వంశీ, కే.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మంచుగా దక్కిన రికార్డు !

 

austrian-man-spends-25-hours-in-box-filled-with-ice-cubes

ఆస్ట్రియాకు చెందిన క్రీడాకారుడు జోసెఫ్‍ కోబెర్ల్ ఈయన. ఎక్కువ సేపు మంచు గడ్డల మధ్యలో ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రియాలోని మెల్క్ నగరంలో శనివారం ఇలా బహిరంగంగా ఓ గాజు పెట్టెలో చెడ్డీ మాత్రమే ధరించి నిలుచుకున్నారు. అనంతరం పెట్టెనిండా మంచు ముక్కలతో నింపించుకున్నారు. శరీరం కొయ్యబారిపోతున్నా ఏ మాత్రం లెక్కచేయ లేదు. రెండు గంటలకు పైగా పెట్టేలోనే ఉన్నారు. ఫలితంగా చైనా క్రీడాకారుడు జిన్‍  షాంఘో 2014లో నెలకొల్పిన గంటా 53 నిమిషాల పది సెకన్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. జిన్‍ కంటే జోసెఫ్‍ అధికంగా 8 నిమిషాల 57 సెకన్లపాటు మంచు ముక్కల మధ్యలో ఉన్నారు.

సీఎం కేసీఆర్ కు బాలకృష్ణ కృతజ్ఞతలు

 

Balakrishna thanks CM KCR for including NTR s life history in 10th standard syllabus

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍కు అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి జీవితాన్ని భవిష్యత్‍ తరాలకు తెలిపేలా పాఠ్యపుస్తకాల్లో ప్రచురించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు బాలయ్య ఫేస్‍బుక్‍ వేదికగా ఓ పోస్టు చేశారు. పుస్తకంలో కథనానికి సంబంధించిన ఫొటోల్ని కూడా షేర్‍ చేశారు. కళకి, కళాకారులకి విలువ పెంచి కథానాయకుడు, తెలుగోడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా వినిపించిన మహానాయకుడు ఎన్నో సహసోపేతమన ప్రజారం జక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజా నాయకుడు, మద్రాసీయులమనే పేరుని చెరిపి భారతదేశ పటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతను తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ మా నాన్నగారు నందమూరి తారకరామారావు. భవిష్యత్‍ తరాలకు స్ఫూర్తినిచ్చేలా ఆయన గురించి 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రికి కేసీఆర్‍కు నా హృదయ పూర్వక ధన్యవాదాలు అని బాలయ్య పేర్కొన్నారు.

Saturday, September 5, 2020

3వేల అడుగుల ఎత్తులో మనిషి!

 

officials-investigate-guy-in-jetpack-seen-flying-near-lax-airport-nk-

ఒకటి కాదు రెండు కాదు, 3 వేల అడుగుల ఎత్తులో ఒక మనిషి జెట్‍ప్యాక్‍ సాయంతో ఎగురుతున్నాడని విమాన పైలట్లు చెప్పడం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. లాస్‍ఏంజిలిస్‍ విమానాశ్రయం పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‍పోర్టుకు వస్తున్న ఓ విమానంలోని పైలట్లు ఇద్దరు కిటికిలోంచి ఒక వ్యక్తి ఎగురుతూ వెళ్లడాన్ని గమనించినట్లు కంట్రోల్‍ రూమ్‍కు సమాచారమిచ్చారు. వారి నివేదిక మేరకు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‍బిఐ దర్యాప్తు ప్రారంభించింది. జెక్‍ప్యాక్‍ సాయంతో లాస్‍ ఏంజిలిస్‍ వంటి రద్దీ ప్రాంతంలో అంత ఎత్తున ఎగరడం అసాధ్యమని జెట్‍ప్యాక్‍ ఏవియేషన్‍ సంస్థ సీఈఓ డేవిడ్‍ మేమాన్‍ తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న సాంకేతికత బట్టి చూస్తే జెట్‍ ప్యాక్‍ సాయంతో 3 వేల అడుగుల ఎత్తున ఎగిరి తిరిగి కిందకు మామూలుగా రావడం జరగని పని. ఆ స్థాయిలో ఇంధనాన్ని జెట్‍ ప్యాక్‍లో తీసుకెళ్లడం అసాధ్యం. లాస్‍ ఏంజిలిస్‍ సమీపంలోనే జేట్‍ ప్యాక్‍ ఎగిరి ఉన్నట్లైతే కచ్చితంగా ప్రజల్లో చాలామందికి కనిపిస్తుంది. ఒకవేళ సిబ్బంది చూసింది డ్రోన్‍ అయి ఉండచ్చు. అత్యున్నత సాంకేతికత కలిగిన డ్రోన్లు మాత్రమే 3 వేల అడుగుల ఎత్తులో ఎగరగలవు. ఒకవేళ అది నిజంగా జెట్‍ ప్యాక్‍ అయ్యుంటే మాత్రం ఎవరో సోంతంగా తయారుచేసినది అయి ఉండాలి. అమెరికా సైనికావసరాల కోసం మేము జెట్‍ప్యాక్‍లను తయారు చేస్తున్నాం. కానీ అవి అమ్మకానికి లేవు అని ఆయన వెల్లడించారు.

ఒకవేళ నిజంగా జెట్‍ ప్యాక్‍తో ఎగిరిన వ్యక్తే అయి ఉంటే అతడికి రూ.20 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‍లో ఒక జెట్‍ ప్యాక్‍ సాయంతో 6వేల అడుగుల ఎత్తుకు విన్స్ రెఫెట్‍ అనే  వ్యక్తి ఎగరగలిగాడు. కానీ కిందకు దిగేందుకు పారాచూట్‍ను వాడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో డ్రోన్‍ చూసి జెట్‍ప్యాక్‍గా పైలట్లు భ్రమించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

కరోనా నేపథ్యంలో... పోస్టల్ ఓట్లకు భారీ డిమాండ్

 

Voters are already getting presidential ballots

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలో పోస్టల్‍ ఓట్లకు డిమాండ్‍ భారీగా పెరిగింది. పోలింగ్‍ బూత్‍కు వెళ్లి ఓటు వేసే రిస్క్ను తీసుకోవడానికి చాలామంది సిద్ధంగా లేరు. నార్త్ కరోలినాలో పోస్టల్‍ బ్యాలెట్‍లను పంపడం మొదలైంది. తొలిదశలో 6.18 లక్షల పోస్టల్‍ బ్యాలెట్‍లకు అభ్యర్థనలు అందాయి. నాలుగేళ్ల కిందటితో పోలిస్తే ఇది 16 రెట్లు ఎక్కువ. విస్కాన్సిన్‍లో కిందటిసారితో పోలిస్తే లక్ష అభ్యర్థనలు ఎక్కువ వచ్చాయి. ఫ్లోరిడాలో 2016లో 33.47 లక్షల మంది పోస్టల్‍ బ్యాలెట్‍ను ఉపయోగించుకోగా.. ఈసారి ఇప్పటికే 42.70 లక్షల అభ్యర్థనలు అందాయి. అత్యధికంగా డెమొక్రాటిక్‍ పార్టీ మద్దతుదారుల నుంచే పోస్టల్‍ బ్యాలెట్‍ అభ్యర్థనలు అందుతున్నాయి. తర్వాత తటస్థులు దీన్ని వినియోగించుకుంటున్నారు. పోస్టల్‍ బ్యాలెట్‍ ద్వారా అవకతవకలు జరిగే అవకావం ఉందని రిపబ్లికన్‍ పార్టీ అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ అంటున్నారు.

సకాలంలో ఓట్లు లెక్కింపు, ఫలితాల వెల్లడిపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టల్‍ శాఖకు అదనపు నిధుల మంజూరును ట్రంప్‍ అడ్డుకోవడంతో భారీగా వచ్చే పోస్టల్‍ బ్యాలెట్లను కౌంటింగ్‍ కేంద్రాలకు చేర్చేందుకు వనరులు ఉండవనే ఆందోళన నెలకొంది.

వచ్చే ఏడాదికీ కష్టమే!

 

Widespread Covid 19 vaccination not expected until mid 2021 says WHO

కరోనా వ్యాక్సిన్‍ ఇదిగో అదిగో అంటూ అగ్ర దేశాలు అమెరికా, రష్యా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍వో) కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేలా విస్తృతమైన వ్యాక్సిన్‍ను వచ్చే ఏడాది మధ్యకాలం నాటికి కూడా చూస్తామని తాము భావించడం లేదని ఆ సంస్థ అధికార ప్రతినిధి మార్గరెట్‍ హ్యారిస్‍ చెప్పారు. ఆమె జెనీవాలోని ఐక్యరాజ్యసమితిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వ్యాక్సిన్‍ తయారీలో అత్యంత కీలకమైనది మూడో దశ పరీక్షలు. ఈ పరీక్షలకు ఎక్కువ సమయం పడుతుంది. అంతే గాక పలు దేశాలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు ఏ మేరకు ప్రభావం చూపుతాయో? ఎంత వరకు భద్రమైనవో? అన్న విషయాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి వచ్చే ఏడాది మధ్య కాలం నాటికి విస్తృతమైన వ్యాక్సిన్‍ అందుబాటులోకి వస్తుందని మేము భావించడం లేదు అని పేర్కొన్నారు.

18న కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం

 kanaka-durga-flyover-opening-cermony-confirmed-september-18

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో పూర్తి చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రమంత్రి నితిన్‍ గడ్కరీ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డితో కలిసి ఈ నెల 18న జాతికి అంకితం చేయనున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఇందులో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్‍ ఒకటని ఆయన పేర్కొన్నారు. రూ.7,584 కోట్ల వ్యయంతో 877 కిలోమీటర్ల మేర నిర్మించనున్న 16 ప్రాజెక్టుల భూమిపూజ కార్యక్రమలో ఢిల్లీ నుంచి నితీన్‍ గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారని తెలిపారు. రూ.8038 కోట్ల వ్యయంతో 533 కిలోమీటర్ల మేర ఆరు, నాలుగు, రెండు వరుసలుగా విస్తరించిన రహదార్లను జాతికి అంకితం చేస్తారన్నారు. రూ.146 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రూ.501 కోట్లతో అత్యాధునికంగా నిర్మించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒకటని ఆయన తెలిపారు. దేశంలోనే ఆరు వరుసల నిర్మాణం చేసిన అత్యాధునిక బ్రిడ్జీల్లో ఇదొకటని ఆయన పేర్కొన్నారు.

24 గంటల్లో 10,776 మందికి కరోనా

 

Coronavirus Positive Cases in AP

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో ఒక్క రోజే 59,919 పరీక్షలు నిర్వహించగా, 10,776 మందికి పాజిటివ్‍గా తేలింది. ఇప్పటి వరకూ మొత్తం 39,65,694 మందికి పరీక్షలు చేయగా, మొత్తం పాజిటీవ్‍ కేసుల సంఖ్య 4,76,506కి చేరింది. గడిచిన 24 గంటల్లో 12,334 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ 3,70,163 మంది కోలుకున్నారు. తాజాగా 76 మంది మృతితో మొత్తం మరణాలు 4,276కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‍లో పేర్కొంది. యాక్టివ్‍ కేసులు 1,02,067 ఉన్నాయి.

ప్ర‌భాస్ సినిమా విష‌యంలో అలా చేసిందంటే.. దీపికలాంటి హీరోయిన్ ఎవ‌రైనా ఉంటారా?

 

Here s why Deepika Padukone refuse to take advance from Prabhas21 makers

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ పెరిగిపోయి అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన సాహో కూడా ప‌లు భాష‌ల్లో విడుద‌లైంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న రాధేశ్యామ్ కూడా భారీ చిత్రంగానే రూపొందుతోంది. ఈ సినిమా త‌ర్వాత నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్‌లో ప్ర‌భాస్ సినిమా చేస్తున్న‌ట్టు అశ్వ‌నీద‌త్ ప్ర‌క‌టించారు. సోషియో ఫాంట‌సీగా రూపొందే ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో రూపొందించ‌నున్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనేను ఎంపిక చేశారు. రాధేశ్యామ్ త‌ర్వాత ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ఈలోగా ప్ర‌భాస్‌, ఓం రౌత్ కాంబినేష‌న్‌లో ఆదిపురుష్ ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ కూడా న‌టించ‌డం విశేషం. అయితే నాగ్ అశ్విన్ సినిమా పూర్త‌యిన త‌ర్వాతే ఆదిపురుష్ సెట్స్ పైకి వెళ్తుంది. ఇదిలా ఉంటే ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ సినిమా కోసం ఇచ్చిన అడ్వాన్స్‌ను దీపికా ప‌దుకొనే వెన‌క్కి ఇచ్చేసింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంటే దీపిక ఈ సినిమా చేయ‌డం లేదా అనే అనుమానాలు అంద‌ర్నీ వెంటాడుతున్నాయి. ఆమె అడ్వాన్స్ వెన‌క్కి ఇచ్చెయ్య‌డానికి మ‌రో కార‌ణం ఉంద‌ట‌.

రాధేశ్యామ్ త‌ర్వాత నాగ్ అశ్విన్ సినిమా మొద‌ల‌వుతుంద‌ని అంద‌రూ భావిస్తున్న‌ప్ప‌టికీ.. ఆదిపురుష్ మొద‌ట లైన్‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దీన్నిబ‌ట్టి చూస్తే నాగ్ అశ్విన్ సినిమా మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సినిమా మొద‌లైన‌ప్పుడే అడ్వాన్స్ తీసుకోవాల‌ని భావిస్తోంద‌ట‌. దానివ‌ల్ల నిర్మాత‌పై భారం ప‌డ‌కుండా ఉంటుంద‌ని ఆమె ఆలోచ‌న‌ట‌. మంచి స్టార్‌డమ్ ఉన్న హీరోయిన్ అలాంటి ఓ మంచి ఆలోచ‌న చేయ‌డం నిజంగా గ్రేట్ అని యూనిట్ స‌భ్యులు అంటున్నారు. ఒక్క‌సారి అడ్వాన్స్ తీసుకుంటే సినిమా చేసినా చెయ్య‌క‌పోయినా వెన‌క్కి ఇవ్వ‌ని హీరోయిన్లు ఉన్న ఈరోజుల్లో దీపికా ప‌దుకొనే వంటి హీరోయిన్లు కూడా ఉండ‌డం సంతోషించాల్సిన విష‌య‌మే.

TFAS Meditation and Wellbeing Seminar on Sep 13th

 TFAS Meditation and Wellbeing Seminar on Sep 13th

Meditation and Wellbeing Seminar

Sunday, Sep 13th sharp @ 11 am EST

Click here to register

Zoom session will be open from 10.30 am EST and Zoom Link will be provided prior to the event

NATS Supports Petition on Bharat Ratna for Telugu Pride Shri P V Narasimha Rao

 NATS Supports Petition on Bharat Ratna for Telugu Pride Shri P V Narasimha Rao


NATS SUPPORTS Petition on Bharat Ratna for Telugu Pride Shri P V Narasimha Rao (Father of Indian Economic Reforms)

Please sign the Petition.

Link to Petition: BharatRatna4PV

పేద విద్యార్థులకు అండగా ఉయ్యాలా జంపాల హీరోయిన్ అవికా గోర్

 Avika gor Fundraising for Poor Students

ఈనాటి జనరేషన్ లో చదువుకు వున్నా ఇంపార్టెన్స్ మరో విషయానికి లేదని చెప్పాలి విద్య విషయంలో రాజీ పడకుండా అప్పు చేసైనా సరే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివిస్తున్నారు. అలాగే అందరికీ విద్య అనేది నేటికీ చాలా మంది పేద వారికి  అందని ద్రాక్షే అవుతోంది. చదువు పైన ఆసక్తి వున్నా  పేదరికం చాలా కుటుంబాల్లో చిన్నారులను విద్యకు దూరం చేస్తోంది. అంతేకాకుండా కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న ప్రస్తుత సంక్షోభంలో విద్యా బోధన మరింత సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో డిజిటల్ విద్య ద్వారా ఆ లోటును భర్తీ చేయడానికి ‘క్యాంప్ డైరీస్’ లాంటి కొన్ని సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి. యంగ్ హీరోయిన్ అవికా గోర్.. అలాంటి సంస్థలకు మద్దతు ఇస్తూ తన మంచి మనసు చాటుకుంటోంది. వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులకు సాయం అందించింది. మిలింద్ చాంద్వాని 2017 నుంచి ‘టీచ్ ఫర్ ఇండియా’తో పని చేస్తున్నారు. పేద, వెనుకబడ్డ వర్గాలకు చెందిన పిల్లలకు విద్యను సరదాగా, సులభంగా నేర్పడానికి మరో అడుగు ముందుకేసి ‘క్యాంప్ డైరీస్’ అనే సంస్థను స్థాపించారు. ఇందులో భాగంగా శని, ఆది వారాల్లో క్యాంపులు పెట్టి పేద విద్యార్థుల విద్యకు అదనంగా అవసరమైన కార్యకలాపాలను, ఆటపాటలను నిర్వహిస్తున్నారు. క్యాంపులో మంచి ప్రతిభ చూపిన పిల్లలకు గురువులు గా  నిలుస్తూ వారికి అన్ని విధాలా మద్దతను అందిస్తున్నారు.

‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ ద్వారా దేశ ప్రజలందరికీ సుపరిచితమైన నటి అవికా గోర్.. సినిమాల్లోనూ చక్కని నటనతో ఆకట్టుకుంది. నటనతో పాటు తన గొప్ప మనసును కూడా చాటుకుంటోంది. క్యాంప్ డైరీస్ సంస్థకు అన్ని విధాలా తన మద్దతు అందిస్తోంది. అవికా గోర్ తన పుట్టిన రోజు (జూన్ 30)ను కూడా క్యాంప్ డైరీస్ కోసమే కేటాయించింది. తన అభిమానులు, శ్రేయోభిలాషుల తన బర్త్ డే సందర్భంగా కానుకలు పంపించడానికి బదులు క్యాప్ డైరీస్ సంస్థ కోసం నిధులు సేకరించాలని కోరింది. ఇందుకోసం క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ‘మిలాప్’లో ఫండ్ రైసింగ్ ప్రారంభించింది. దీనికి విశేష స్పందన లభిస్తోంది. అవికా గోర్ ఈ ఫండ్ రైసర్ ద్వారా వచ్చిన విరాళాలకు సమానంగా తన సంపాదన లోంచి నిధులను కేటాయిస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా క్యాంప్ డైరీస్ ప్రతినిధులు మరిన్ని కార్యక్రమాలను తీర్చిదిద్దుతున్నారు. అవిక పుట్టిన రోజు మిలాప్ ఫండ్ రైసర్ ద్వారా సేకరించిన నిధులతో సిబ్బందికి, వివిధ కార్యక్రమాలకు అవసరమైన సామన్లు సమకూర్చుకున్నారు. వీటిలో ప్రొజెక్టర్లు, గిటార్లతో పాటు కళలు, ఆటలకు సంబంధించిన సామన్లు ఉన్నాయి. క్యాంప్ డైరీస్ సంస్థ ఇప్పటివరకు 9 నగరాల్లో 5000 మందికి పైగా విద్యార్థులను చేరుకుంది. వచ్చే విద్యా సంవత్సరంలో మరో 3000 మంది పిల్లలను చేర్చుకోవాలని  భావిస్తోంది. ఒక దేశంలో విద్యకు, అభివృద్ధికి ఉన్న అవకాశాలే ఆ దేశం పురోగతికి పునాదులుగా చెప్పవచ్చు. సామాజిక అసమానతలు దేశంలో ఆర్థిక, సాంఘిక విభజనను మరింత పెంచుతాయి. మన దేశం నలుమూలలా వందల సంఖ్యలో పాఠశాలల్లో ఇప్పటికీ డిజిటల్ విద్య సాధ్యం కావడంలేదు. దీని వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోతున్నారు. అలాంటి విద్యార్థులకు మద్దతు అందించడానికి ఎన్నో రెట్ల సాయం కావాల్సి ఉంది.

మెరుగు పడిన ఎస్ పి బాలు ఆరోగ్యం త్వరలో ఆస్పత్రి నుండి డిశ్చార్జ్

 

SP Charan Shares Update about SP Balasubrahmanyam Health Condition

ఎస్ పి బాలు హెల్త్ కండిషన్‌పై అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు ఎస్పీ తనయుడు చరణ్. గత నాలుగు రోజులుగా ఎస్పీ ఆరోగ్యం మెరుగైందని తెలిపిన ఆయన..డాక్టర్ల కృషి.. కోట్లాది మంచి అభిమానుల పూజలు ఫలించడంతో ఎస్పీ బాలు కోలుకుంటున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రాణాపాయం నుంచి ఆయన కోలుకుంటున్నారని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత మెరుగుపడిందని చికిత్సకు స్పందిస్తున్నారని చెన్నై ఎంజీఎం వైద్యులు తెలిపారు.

కాగా తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించి అప్ డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తున్న ఎస్పీ తనయుడు చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ‘గత నాలుగు రోజులుగా నాన్నగారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. చాలా బెటర్ మెంట్ ఉంది.. దేవుని దయతో ఈ వీకెండ్ వరకు అభిమానులు సంతోషకరమైన వార్త వింటారు. అభిమానులు, ప్రేక్షకుల ఆశీస్సులతో ఆయన కోలుకుంటున్నారు. వీరి ప్రార్థనల ఫలితంగా ఈ సోమవారం ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని ఎస్పీ తనయుడు చరణ్ ఇన్ స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో తెలిపారు.

https://www.instagram.com/p/CEq-kiKhqh6/?utm_source=ig_embed

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి

 23 YO Amazon employee from Hyderabad drowns in US

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ హైదరాబాద్‍ యువకుడు అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాడు. మిస్సోరిలోని సెయింట్‍ లూయిస్‍లో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‍కు చెందిన ఖాజా ఇమ్రాన్‍ ఖాన్‍ (23) సెయింట్‍ లూయిస్‍లోని సరస్సులో ఈతకు వెళ్లి అందులో మునిగిపోయాడు. వెంటనే స్నేహితులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఖాజా కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా, అమెరికా వెళ్లేందుకు తమకు ఎమర్జెన్సీ వీసా ఇప్పించాలని ఖాజా తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు.

ఖాజా ఇమ్రాన్‍ తన ఇద్దరు స్నేహితులతో కలిసి సెయింట్‍ లూయిస్‍లోని సరస్సులో ఈతకు వెళ్లాడు. కొంత సేపటి తర్వాత ఖాజా కనిపించకుండా పోయాడు. అనుమానం వచ్చిన స్నేహితులు చుట్టూ వెతకగా అతడు మునిగిపోతూ కనిపించాడు. వెంటనే వారు రెస్క్యూ టీమ్‍కు సమాచారం ఇవ్వగా వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. అమెరికాలో చదువుకుంటున్న కొడుకు చనిపోయాడన్న విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. కరోనా కారణంగా విమానాలు లేకపోవడం, మృతదేహాన్ని భారత్‍కు తెచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడే అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నది.

Friday, September 4, 2020

తెలుగు హీరో హీరోయిన్లు అనుమానాస్పద స్థితి లో మరణిస్తే వారి గురించి ఏనాడైనా ఇంత దర్యాప్తు చేశారా? : విజయ శాంతి

 Vijayashanti respond on Sushant death case

బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్యపై మాజీ ఎంపీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్శన్ విజయశాంతి ఆసక్తికరమైర రీతిలో స్పందించారు. సినీ పరిశ్రమలకు చెందిన ఎంతోమంది నటీమణులు అనుమానాస్పద రీతిలో మరణించారని వారి మరణంపై ఏనాడైనా సరైన దర్యాప్తు చేశారా అని ప్రశ్నించారు. మరణించినప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు కావడం, తూతూ మంత్రంగా విచారణ చేసి చివరకి మమ అనిపించడమే చూశామని పేర్కొన్నారు. దర్యాప్తులు, విచారణలనేవి వివక్ష లేకుండా ఎవరి విషయంలోనైనా ఒకేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్‌ వ్యక్తిగత ఖాతా నుంచి విజయశాంతి ఓ పోస్ట్‌ చేశారు.

‘సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక వాస్తవాల్ని వెలికితీసేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. దోషుల్ని పట్టుకోవడానికి సీబీఐ విచారణకు సైతం ఆదేశించడం హర్షణీయమే గానీ... మన సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఎందరో నటీమణులు బలవన్మరణాలకు పాల్పడిన సంగతి మనందరికీ తెలుసు. వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగించేలా ఈ స్థాయిలో విచారణలు... దర్యాప్తులు జరిగాయా? చాలామంది నటీమణులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు కావడం, తూతూ మంత్రంగా విచారణ చేసి చివరకి మమ అనిపించడమే చూశాం. సుశాంత్ కేసులో బయటకొస్తున్న విషయాలు చూస్తుంటే విస్మయం కలుగుతోంది. వెండితెరపై వెలగాలని ఎన్నో ఆశలతో వచ్చే కళాకారులు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధాకరం. అయితే దర్యాప్తులు, విచారణలనేవి వివక్ష లేకుండా ఎవరి విషయంలోనైనా ఒకేలా ఉండాలి. ఈ విషయంపైన ఒక జాతీయ టీవీ చానెల్‌లో జరిగిన చర్చ సందర్భంగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే స్పందిస్తూ.. సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా న్యాయప్రక్రియ ఒకే తీరులో కొనసాగాలని, అప్పుడే న్యాయాన్ని ఆశించగలమని అన్నారు. సంచలనాత్మకమైన ఇలాంటి ఎన్నో కేసుల విచారణ క్రమాన్ని గమనిస్తే, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఏసీబీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఎంతో శ్రమించి కోర్టులకు తగిన ఆధారాల్ని సమర్పించిన తర్వాత కూడా... వారు ఆశించిన ఫలితం రాకుంటే ప్రభుత్వాలు అప్పీలుకు వెళ్ళకపోవడం వల్ల శిక్షలు పడే అవకాశం బలంగా ఉన్న కేసులు సైతం నీరుగారుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి.’ అని విజయశాంతి పేర్కొన్నారు.

https://www.facebook.com/VijayashanthiOfficial

Thursday, September 3, 2020

ఎవరితో మాకు సంబంధం లేదు : అమెరికా

 

US says it will not join global effort to find COVID-19 vaccine

కరోనా మహమ్మారి పీచమణిచే వ్యాక్సిన్‍ అభివృద్ధి, దాని పంపిణీ విషయంలో పరస్పరం సహకరించుకునేందుకు ఏర్పడిన ప్రపంచ దేశాల కూటమితో తాము కలవబోమని అమెరికా తేల్చి చెప్పింది. అలా కలవడం ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍వో) వంటి సంస్థల నిబంధనలతో తమని తాము నిర్బంధించుకోదలచుకోలేదని వ్యాఖ్యానించింది. కరోనా వైరస్‍ వ్యాప్తికి చైనా తోపాటు డబ్ల్యూహెచ్‍వో కూడా కారణమైందని ఆరోపిస్తూ సంస్థ సభ్య దేశాల నుంచి అమెరికా ఇప్పటికే వైదొలిగిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్‍ అందుబాటులోకొచ్చిన తర్వాత సరిపడా డోసులు లభించేలా కొన్ని దేశాలు జాగ్రత్త పడుతున్నాయి.

ఈ క్రమంలో తయారీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అందులో భాగంగా డబ్ల్యూహెచ్‍వో అధ్యర్యంలో 150 దేశాలు కొవాక్స్ పేరిట ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అయితే వాటితో కలిసేది లేదని, వ్యాక్సిన్‍ అభివృద్ధి, పంపిణీలో తమ దారి తమదేనని ట్రంప్‍ సృష్టం చేశారు. కాగా ట్రంప్‍ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహమ్మారిని ఓడించే ప్రయత్నాన్ని ఇది నీరుగార్చే ప్రమాదముందని కొందరు హెచ్చరిస్తున్నారు.

ఏపీ ప్ర‌భుత్వానికి సుప్రీంలో మ‌ళ్లీ చుక్కెదురు..

 

Supreme Court Dismisses Govt s Petition on HC Orders

ప‌లు ర‌కాల ప్ర‌భుత్వ పిటిష‌న్ల‌పై ఎదురుదెబ్బ‌లు రుచి చూపించిన సుప్రీం కోర్టు మ‌రోసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి మొట్టికాయ‌లు వేసింది. ఈ తీర్పు పూర్వాప‌రాలు ఇలా ఉన్నాయి...

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీషు మీడియాన్ని త‌ప్ప‌నిస‌రి చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు తెచ్చిన విష‌యం తెలిసిందే...దీనికి వ్య‌తిరేకంగా రాష్ట్ర హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లవ‌డం, వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న హైకోర్టు ప్ర‌భుత్వ జీవోల‌ను కొట్టివేయ‌డం వ‌రుస‌గా జ‌రిగిపోయిన విష‌యం కూడా తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంగ్లీషు మీడియం విద్య‌పై రాష్ట్ర వ్యాప్తంగా త‌ల్లిదండ్రుల‌, విద్యార్ధుల స‌ర్వే నిర్వ‌హించింది. స‌ద‌రు స‌ర్వేలో అత్య‌ధిక శాతం ప్ర‌జ‌లు త‌మ‌కు ఇంగ్లీషు మీడియం అవ‌స‌ర‌మ‌ని తేల్చి చెప్పారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ప్ర‌భుత్వం ఇంగ్లీషు భాష ఉత్త‌ర్వుల‌ను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకుని అందుకు అనుగుణంగా హైకోర్టు స్టేల‌ను ఎత్తేయాలంటూ సుప్రీంను ఆశ్ర‌యించింది.

అయితే ఈ విష‌యంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. స్టేల‌ను ఎత్తేసేందుకు నిరాక‌రిస్తూ పిటిష‌న్ల‌ను కొట్టేస్తూ గురువారం తీర్పు చెప్పింది. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో అత్య‌ధికులు ఇంగ్లీషు భాష కోరుకుంటున్నార‌ని ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు. దీనికి మ‌ద్ధ‌తుగా ఆయ‌న ప్ర‌భుత్వం నిర్వ‌హించిన స‌ర్వేను కూడా ఉటంకించారు. అయిన‌ప్ప‌టికీ సుప్రీం క‌నిక‌రించ‌లేదు. తాజా తీర్పుతో వైసీపీ ప్ర‌భుత్వం ఈ విష‌యంలో ఏ విధంగా ముందుకు వెళ్ల‌నుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Wednesday, September 2, 2020

Chennai Super Kings bring on board Levista Coffee as Official Licensed Coffee Partners

 

Chennai Super Kings bring on board Levista Coffee as Official Licensed Coffee Partners

In a first of its kind partnership, one of South India’s most preferred and favorite coffee brand, Levista Instant Coffee is on-board as ‘Official Licensed Coffee Partner’ for Chennai Super Kings this season of Dream11 IPL 2020. In a distinctive brand partnership with Chennai Super Kings (CSK), one of the revered teams in IPL, it also marks a distinctive milestone for a coffee brand to associate with the annual sporting extravaganza. Through this association, the brand will launch a special season/ limited edition package in its instant coffee range as well as other collector’s worth combo packs with special Thala MS Dhoni and CSK team keepsakes, a coveted range for both coffee and cricket fans.

The special CSK packaging and Levista “Special CSK combo packs” will be available from 10th September 2020 at over 34,000 general trade stores, in India as well as in modern retail formats through Reliance Retail, More Supermarkets, SPAR, Metro Cash & Carry among others. The range will also retail online at Amazon, Big Basket, Flipkart, and Udaan to ensure the special collector worthy packs are available to all in India and Internationally. Fans will also have the opportunity to place direct orders through Levista Coffee’s Facebook, Instagram, LinkedIn, and Twitter pages. To ensure a memorable consumer experience the brand will formulate daily game highlights, fun trivia, and contests that will take the love for Coffee, CSK and Cricket to the next level across their digital platforms.

As the gameplay shifts to UAE this season, the championship is expected to garner a lot of enthusiasm and interest among fans and followers of the game. There is anticipation and excitement from viewers and participants of IPL to see the players back in action after the ongoing series being plagued with a delay due to the unprecedented Covid-19 crisis worldwide.

Speaking on the association, Mr. S. Shriram, Vice President, Levista Coffee said, “We at Levista are ecstatic to announce our partnership with team CSK as their ‘Official Licensed Coffee Partner’ this season of Dream11 IPL 2020. Cricket and Coffee are desires that satisfy both the mind and body. It awakens and brings to fore creativity with renewed energy. The quality and flavor of Levista Instant coffee resonates with the vivacity and passion of all CSK and cricket fans. We look forward to delighting our consumers and CSK loyalists, one cup at a time. Brand Levista is honored to be part of this association which will also aid in relief fund contributions to the PM CARES Fund program through the sale of CSK combo packs. We look forward to driving support for team CSK with each cup of coffee and look forward to a successful ‘CUP’ winning for the team at Dream11 IPL 2020.”

Commenting on the partnership, Mr. KS Viswanathan, Chief Executive Officer, Chennai Super Kings, said: “CSK are happy to welcome Levista on board as official Licensed Coffee Partner. Coffee and cricket conversations go hand in hand, and this IPL season Levista promises to enhance this experience for cricket fans with a special edition across their range of products.”

Levista Coffee from the house of SLN Coffee was launched in 2017 with the vision to provide its consumers with the best taste and freshest offerings in an instant format. The brand that believes in fresh, rich experiences has joined team CSK to propel its support. With offerings across instant, filter, and artisanal range of coffees, the brand pours the best quality brews made from handpicked beans. Levista offers Instant and Filter Coffee Powder in three variants and a dozen pack sizes.

7 నుంచి హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభం

 Hyderabad Metro rail to resume ops in phases from September 7


తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 7వ తేదీ నుంచి మెట్రో రైళ్లు మళ్లీ పరుగు పెట్టనున్నాయి. 21వ తేదీ నుంచి పెండ్లిళ్లు, అంత్యక్రియలను 100 మందితో నిర్వహించుకోవచ్చు. 30వ తేదీ వరకు కంటైన్మెంట్‍ జోన్లు కొనసాగుతాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్‍లాక్‍-4 ఉత్తర్వులను అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‍కుమార్‍ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, కోచింగ్‍  సెంటర్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‍పూల్స్, ఎంటర్‍టైన్మెంట్‍ పార్కులు, థియేటర్లు ఇలాంటి ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 7వ తేదీ నుంచి మెట్రో రైల్‍ నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కంటైన్మెంట్‍ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్‍ ప్రొసీజర్స్ (ఎస్వోపీ) పాటిస్తూ లాక్‍డౌన్‍కు ముందు ఉన్న అన్ని కార్యక్రమాలకు అనుమతిస్తున్నట్టు పేర్కొన్నది.

మార్గదర్శకాలు ఇవీ...

ఆన్‍లైన్‍ క్లాసులు, దూరవిద్యకు అనుమతి. ప్రోత్సాహం. 21 నుంచి ఆన్‍లైన్‍ టీచింగ్‍, టెలీకౌన్సెలింగ్‍, దీనికి సంబంధించిన పనులకు విద్యాసంస్థలకు ఒకే సమయంలో 50 శాతం టీచింగ్‍ నాన్‍ టీచింగ్‍ స్టాఫ్‍కు అనుమతి. 21 నుంచి ఐటీఐలు, స్కిల్‍ డెవలప్‍మెంట్‍ శిక్షణకు, ఉన్నత విద్యాసంస్థల్లో పీహెచ్‍డీ, పీజీ టెక్నికల్‍ పోగ్రాంలకు అనుమతి. ఈ నెల 21 నుంచి సోషల్‍, అకడమిక్‍, స్పోర్టస్, ఎంటర్‍టైన్మెంట్‍ కల్చరల్‍, రిలీజియస్‍, రాజకీయ సమావేశాలతో పాటు ఇతర జనసమూహ కార్యక్రమాలను వందమందికి మించకూండా నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతానికి బార్లు, క్లబ్‍లు బంద్‍. వీటిని ప్రారంభించడానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తారు.

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి

 

Khairatabad Ganesh visarjan 2020

ధన్వంతరి నారాయణ మహాగణపతిగా పూజలందుకున్న ఖైరతాబాద్‍ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఎన్టీఆర్‍ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన నాలుగో నవంబర్‍ క్రేన్‍ వద్ద మహాగణపతి నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది. కరోనా కారణంగా ఈసారి కేవలం 9 అడుగుల మట్టి విగ్రహాన్ని ఖైరతాబాద్‍ ఉత్సవ నిర్వాహకులు రూపొందించారు. మహాగణపతి నిమ్జనాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిమజ్జనం కంటే ముందు గణేష్‍ ఉత్సవ సమితి నిర్వాహకులు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకను చూసిన భక్తులు తన్మయత్వం చెందారు. జై జై గణేశా నినాదాలతో ట్యాంక్‍ బండ్‍, ఎన్టీఆర్‍ మార్గ్ పరిసరాలు మార్మోగిపోయాయి.

మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్‍ మహాగణపతి శోభయాత్ర.. భక్తుల సందడి మధ్య ఐదారు గంటల పాటు శోభాయమానంగా సాగింది. కరోనా వైరస్‍ సంక్రమణ క్రమంలో గణేశ్‍ నవరాత్రి ఉత్సవాలు నిరాడంబరంగా సాగాయి. వైరస్‍ ప్రభావంతో ఉత్సవాల శోభ కాస్త తగ్గినా.. విగ్రహాల సంఖ్య మాత్రం తగ్గలేదు. ప్రతి ఇంటిలో ప్రతిష్టించిన చిన్న చిన్న గణనాథుల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీటీవీ కెమెరాలతో కంట్రోల్‍ రూం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

తొలిసారి బాలాపూర్ లడ్డూ వేలంపాట రద్దు

 

Balapur laddu 2020 auction cancelled

బాలాపూర్‍ లడ్డూ వేలం పక్రియ ఈ దఫా రద్దైంది. గణేష్‍ ఉత్సవ కమిటీ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది లడ్డూ వేలంపాటను రద్దు చేసినట్టు ప్రకటించింది. బాలాపూర్‍లో ఈ దఫా వేలం పాట లేకుండానే గణేష్‍ శోభయాత్ర ప్రారంభమైంది. ప్రత్యేక పూజల తరువాత మండపం నుంచి బాలాపూర్‍ గణపయ్య బయలుదేరారు. ఈ కార్యక్రమం గురించి ఎప్పుడు, ఎక్కడ చర్చకు వచ్చినా, అందరి దృష్టి లడ్డూ ధర పైనే ఉంటుంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాలాపూర్‍ గణేష్‍ ఉత్సవ కమిటీ లడ్డూ వేలం పక్రియను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ వేలంపాటను ఈ ఏడాది రద్దు చేసినట్టు తెలిపింది.

బాలాపూర్‍ గణేష్‍ వేలంపాట 1994లో మొదలుకాగా, లడ్డూ వేలం పక్రియను నిలిపివేయడం ఇదే తొలిసారి. కాగా, 1994లో తొలి ఏడాది రూ.450కు బాలాపూర్‍ గణపయ్య లడ్డూను కొలను మోహన్‍ రెడ్డి సొంతం చేసుకోగా, గతేడాది (2019లో) కొలను రాంరెడ్డి అనే భక్తుడు రూ.17.60 లక్షల రకార్డు ధరకు బాలాపూర్‍ లడ్డూను వేలంలో సొంతం చేసుకోవడం తెలిసిందే.

ముగిసిన ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు

 Former President Pranab Mukherjee Funeral


మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‍ ముఖర్జీ అంతిమ యాత్ర ముగిసింది. లోధి స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. సైనిక లాంఛనాలతో ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. ప్రణబ్‍ అంత్యక్రియలను ఆయన కుమారుడు అభిజిత్‍ ముఖర్జీ నిర్వహించారు. కరోనా ప్రోటోకాల్‍ ప్రకారం పరిమిత సంఖ్యలో జనాభాను అనుమతించారు. అంతకు ముందే రాష్ట్రపతి రామ్‍నాథ్‍ కోవింద్‍, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆశ్రునయనల మధ్య ఆయనకు వీడ్కోలు పలికారు. కరోనాతో పోరాడి ప్రణబ్‍ ముఖర్జీ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

అన్‍లాక్‍ 4 మార్గదర్శకాలు నేటి నుంచి అమలు

 

Unlock 4 Full guidelines issued by different states

అన్‍లాక్‍ 4 నిబంధనలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. సెప్టెంబర్‍ 30వ తేదీ వరకు అన్‍లాన్‍ 4 నియామావళిని పాటించాల్సి ఉంటుంది. కేంద్ర హోంశాఖ ఆన్‍లాక్‍ 4 మార్గదర్శకాలను రిలీజ్‍ చేసిన విషయం తెలిసిందే. కొత్త మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్‍ 7వ తేదీ నుంచి మెట్రో సర్వీసులను దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. స్కూళ్లు, కాలేజీలు మాత్రం బంద్‍ చేసి ఉంటాయి. మతపరమైన, రాజకీయ, సామాజిక, క్రీడా సమావేశాలకు వందకు మించి జనం హాజరుకావద్దు అంటూ అనుమతి ఇచ్చింది. అయితే సెప్టెంబర్‍ 21వ తేదీ నుంచి ఈ నిబంధన వర్తిస్తుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ నెల చివర వరకు నిలిపివేశారు. కేవలం అనుమతి ఉన్న విమనాలకే ప్రయాణం ఉంటుంది. అంతర్‍ జిల్లా, అంతర్‍ రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి అవసరం లేదు. కంటోన్మెంట్‍ కాని ప్రాంతాల్లో లాక్‍డౌన్‍ అమలు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం జారీ చేసింది.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘వ‌కీల్ సాబ్’ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల

 

vakheel saab motion poster released

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు. ప‌వ‌న్‌కళ్యాణ్ పుట్టిన‌రోజు(సెప్టెంబ‌ర్ 2) సంద‌ర్భంగా ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఒక వైపు మ‌హాత్మాగాంధీ ఫొటో, మ‌రో వైపు అంబేద్క‌ర్ ఫొటో మ‌ధ్య ప‌వ‌న్ లాయ‌ర్ కోటు వేసుకుని నిల‌బడ్డారు. ఓ చేతిలో బేస్‌బాల్ స్టిక్‌, మ‌రో చేతిలో క్రిమిన‌ల్ లా అనే పుస్త‌కం ప‌ట్టుకుని ప‌వ‌న్ ఠీవిగా నిల‌బ‌డి ఉన్నలుక్‌తో ఉండేలా మోష‌న్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కాభిమానుల అంచ‌నాల‌ను మించేలా ఉంది. ఈ మోష‌న్ పోస్ట‌ర్ బ్యాగ్రౌండ్‌లో స‌త్య‌మేవ జ‌య‌తే ... అనే బీట్ వినిపిస్తుంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ ‘‘పవర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్‌గారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌డం హ్యాపీగా ఉంది. ఆయ‌న అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు కోరుకునేలా ఓ ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్ పాత్ర‌లో ప‌వ‌న్‌కళ్యాణ్ గారు క‌నిపించ‌బోతున్నారు. క‌రోనా వైర‌స్ ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డ్డ త‌ర్వాత మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసి సినిమాను వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: పి.ఎస్‌.వినోద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: రాజీవ‌న్‌, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి, డైలాగ్స్‌: తిరు, యాక్ష‌న్ ర‌వివ‌ర్మ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌: యుగంధ‌ర్‌, కో ప్రొడ్యూస‌ర్‌: హ‌ర్షిత్ రెడ్డి, స‌మ‌ర్ప‌ణ‌: బోనీ క‌పూర్‌, నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్ , ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ వేణు.

https://youtu.be/1rcJgndYjN8

భారతీయులు బుద్ధిష్ట్ ల పాలిట విల్లన్ లా? పూరీ జగన్నాథ్ కి ఏమైంది?

 

BUDDHISM Puri Musings by Puri Jagannadh

"ఏ తప్పు చేయని బుద్ధిష్ట్‌లను దారుణంగా చంపేశాం మనం.. వాళ్లు ఒకరికి హాని చేయరు.. కనీసం పల్లెత్తు మాట కూడా మాట్లాడరు అలాంటి వాళ్లను కర్రలతో కొట్టి చంపేశాం." ఇవి పూరి ఆరోపణలు
లాక్ డౌన్‌లో షూటింగ్ పనిని పక్కనపెట్టి.. తనకు మెదడుకు పదును పెట్టిన డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వివిధ అంశాలపై తన మార్క్ డైలాగ్‌లతో వరుస ఆడియో టేప్‌లను విడుదల చేస్తున్నారు. కులం, మతం, లవ్, ఎమోషన్స్ లాంటి బర్నింగ్ ఇష్యూస్‌పై తన స్పందనలను తెలియజేస్తున్న పూరీ జగన్నాథ్ తన యూట్యూబ్ ఛానల్‌లో బుద్ధిజంపై సంచలన కామెంట్స్ చేశారు. సిద్దార్థ్ గౌతమ్ లుంబినీలో 623 కాలంలో పుట్టాడు. ఆ తరువాత ఆయనే బుద్దుడు అయ్యాడు. ఆయనతోనే బుద్దిజం మొదలైంది. బుద్ధిజం అనేది హిందు, క్రిస్టియన్ మాతాలకంటే పురాతనమైనది. బుద్దుడు ఏం చెప్పాడంటే.. ఏ దేవుడు లేడు.. మన కోసం ఎవడూ రాడు.. ప్రతిఒక్కడు బుద్దుడే. అది మనకు నచ్చలేదు. అందరికీ కోపం వచ్చింది. అందుకే బుద్ధిష్ట్‌లను నిర్ధాక్షిష్యంగా చంపేశారు. పాపం వాళ్లు ఎవ్వరితోనూ గొడవపడరు. పల్లెత్తు మాట అనను.. జీవ హింస చేయరు. ఎప్పుడూ మెడిటేషన్‌లో ఉంటారు. కర్మని, పునర్జన్మని నమ్ముతారు. అలాంటి వాళ్లని కర్రలతో కొట్టి చంపేశాం. దేశం వదిలిపారిపోయేలా చేశాం. ఈ గొడవల్లో ఆత్మ రక్షణ కోసం బుద్ధిష్ట్‌లు కనుగొన్నదే కరాటే. చేతులే ఆయుధాలుగా చేసుకుని తమని తాము కాపాడుకోవడానికి దీన్ని కనిపెట్టారు. కరాటే అంటే ఖాళీ చేతులు అని అర్థం. సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్ అది. చనిపోగా మిగిలిన బుద్ధిష్ట్‌లు టిబెట్, థాయ్ లాండ్, చైనా పారిపోయారు. అలా బుద్దుడు వేరే దేశాలకు దేవుడైపోయాడు.

ప్రపంచం అంతా బూడా బూడా అని మొక్కుతుంటారు. బుద్దిజమ్ వరల్డ్‌లోనే నాలుగో అతిపెద్ద మతం. ఒక చైనాలోనే 250 మిలియన్ల మంది ఉన్నారు. థాయ్ లాండ్, కంబోడియాలో 90 శాతం బుద్ధిష్ట్ పాపులేషన్ ఉంది. 1963 వియత్నాలో అక్కడున్న ప్రభుత్వం బుద్ధిష్ట్‌లను ఇబ్బంది పెడుతుంటే.. ఒక బుద్ధిష్ట్ మాంక్ దానికి నిరసనగా.. అందరూ చూస్తుండగా.. పెట్రోల్ పోసుకుని తనను తాను తగలబెట్టుకున్నాడు. మంటల్లో తగబడిపోతున్నా అతను అరవలేదు.. కదల్లేదు.. కనీసం అతని నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. కూర్చున్న చోటా మౌనంగా కాలిపోయాడు. నా కోసం ఒక్కసారి ఆ వీడియో చూడండి. అలా కాలిపోయి చనిపోవడానికి ఎంత విల్ పవర్ ఉండాలో చూడండి. యుద్ధం చేస్తూ చనిపోతే వీరమరణం అంటారు.. యద్దం చేయకుండానే వీరమరణం పొందాడు అతను. యుద్దం చేయలేక కాదు.. యుద్దం వద్దనుకున్నాడు. దటీజ్ పవర్ ఆఫ్ బుద్ధిజం. లామా అంటే టీచర్ ఆఫ్ ధర్మ అని అర్థం.. ఒక లామా చనిపోతూ తను మళ్లీ ఎక్కడ పుట్టబోతున్నాడో చెప్పి మరీ చనిపోతాడు. 

ఆ తరువాత మాంగ్స్ అందరూ కలిసి ఆ పుట్టబోయే బిడ్డకోసం వెతకుతారు. ఆ పిల్లాడిని లామా చేస్తారు. ఇప్పుడున్న దలైలామాని గుర్తించడానికి వాళ్లకి నాలుగేళ్లు పట్టింది. మనం బుద్ధుడ్ని వాడం.. ఓన్లీ బుద్ధుడి బొమ్మల్ని వాడతాం. మసాజ్ సెంటర్లు, పార్లర్‌లు హాల్‌లో టీవీ పక్కన బుడ్డ బుడ్డ లాఫింగ్ బుద్ద బొమ్మల్ని పెట్టుకుంటాం.. ఎందుకు అంటే పీస్ కోసం అంటామ్.. ఎందుకంటే మనకి సిగ్గు లజ్జా ఉండదు మనకి. ఏ పాపం తెలియని బుద్ధిష్టుల తలలు నరికిన దేశం మనది. పీస్ గురించి మాట్లాడొచ్చా? తప్పుకదా.. ఇప్పటి వరకూ ఏ బుద్ధిష్ట్ ఎవర్నీ చంపలేదు. వాళ్లు తలచుకుంటే.. ఒక్కో మాంక్ ఒట్టిచేతులతో వంద మందిని చంపగలడు. కాని ఎప్పుడూ అలా చేయలేదు. కాని మనం ఎంతో మంది బుద్దుల్ని చంపేశాం. ఒకరికి హాని చేయని మౌనంగా ఉన్న మునిలను కూడా వదలం మనం.. తలలు నరకుతాం. మతం మత్తులో ఉన్న శాడిష్టులం మనం. బుద్ధిష్టులు ఎలాగూ తిట్టరు.. తప్పుడు మాట వాళ్ల నోటిలోనుంచి రాదు.. 2000 సంవత్సరాల తరువాత కనీసం నన్నైనా మనస్పూర్తిగా తిట్టనీయండి’ అంటూ పచ్చి బూతుతో ముగించారు పూరీ జగన్నాథ్.

https://youtu.be/a1FyVe3taw4

కొనోషాలో మితవాత హింసను సమర్థించిన ట్రంప్

 

Trump to visit Kenosha despite objections of local officials

గతవారం కొనోషాలో పోలీసుల హింసకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మితవాత గన్‍మెన్‍ కాల్చిచంపడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ సమర్థించుకున్నారు. స్వీయ రక్షణ కోసమే అతను కాల్పులు జరిపాడని ట్రంప్‍ ఉద్ఘాటించారు. నిరసనకారుల నుంచి తప్పించుకోవడానికి అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతను పడిపోయాడు. వారందరూ అతనిపై హింసాత్మకంగా దాడి చేయబోయారు అని ట్రంప్‍ చెప్పారు. అతను పెద్ద ఆపదలో ఉన్నాడని నేను ఊహిస్తున్నాను. అతను ఖచ్చితంగా హత్యకు గురికాబడి ఉండేవాడు అని ట్రంప్‍ అసత్యాలు పలికారు.

గత మంగళవారం ప్రశాంతంగా నిర్వహిస్తున్న నిరసనలపై 17 ఏండ్ల కైలీ రిటెన్‍హౌస్‍ చేసిన కాల్పుల్లో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులు చేసిన తరువాత తుపాకితీతో సహా పోలీస్‍ లైన్ల ద్వారా వెళ్లడానికి రిటెన్‍హౌస్‍ను అనుమతించారు. అరెస్టు కనీసం ప్రశ్నించడానికి కూడా అతన్ని ఆపలేదు. తరువాత ఇల్లినాయిస్లోని తన నివాసంలో రిటెన్‍హౌస్‍ను అరెస్టు చేశారు.

అమెరికాలో హింసాత్మకంగా మారిన నిరసనలు

 

Protests continue over Jacob Blake shooting

నల్లజాతీయుడు జాక్‍బో బ్లేక్‍పై పోలీసుల కాల్పులకు నిరసనగా అమెరికాలో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. బ్లేక్‍పై కాల్పులకు నిరసనగా పోర్ట్ లాండ్‍లో ప్రజలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో ట్రంప్‍ మద్దతుదారులు ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తూ అటు వైపు రావడంతో ఒక్కసారిగా ఉద్రికత్త ఏర్పడింది. పర్యవసానంగా ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ట్రంప్‍ మద్దతు దారుడు ఒకరు మరణించారు. మరో వైపు ఆందోళనల్లో మరణించిన వ్యక్తి తన మద్దతుదారుడని తెలిపిన అధ్యక్షుడు ట్రంప్‍ డెమొక్రటిక్‍ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన పోర్ట్లాండ్‍ మేయర్‍ డెటా వీలర్‍పై విరుచుకుపడ్డారు.

జో బైడెన్‍, టెడ్‍ వీలర్‍ ఇద్దరూ దొందూ దొందేనని విమర్శించారు. శాంతి భద్రతల్ని కాపాడడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. అవసరం అనుకుంటే బలగాల్ని రంగంలోకి దించుతామని హెచ్చరించారు. ట్రంప్‍ వ్యాఖ్యలపై డెమొక్రటిక్‍ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‍ కూడా దీటుగా స్పందించారు. ట్రపే హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న వారిపై వాహన శ్రేణితో దూసుకువెళ్లడమే కాక, వారిని దేశభక్తులుగా అభివర్ణిస్తారా అని మండిపడ్డారు.

మాస్క్ తో 2 లక్షల మరణాలకు చెక్

 

Mask Use and Social Distancing May Prevent 2 Lakh Covid 19 Deaths

ప్రజలు ఆరోగ్యస్పృహతో మాస్క్లు వాడి, భౌతికదూరాన్ని తు.చ తప్పకుండా పాటిస్తే డిసెంబరుకల్లా భారత్‍కు 2 లక్షల కరోనా మరణాల గండం తప్పుతుందని అమెరికాలోని వాషింగ్టన్‍ వర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. దేశ జనాభాలో సింహబాగం ప్రజలు ఇంకా ఇన్ఫెక్షన్‍ గండానికి చేరువలోనే ఉన్నారని హెచ్చరించింది. డిసెంబరు మొదటివారం నుంచి మూడోవారం కల్లా భారత్‍లో కరోనా కేసులు పతాక స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది. ఇన్ఫెక్షన్లు ఇదే రీతిలో పెరుగుతూపోతే. ఆ సమయానికి ప్రతిరోజు 60 లక్షల కేసులు నమోదయ్యే అవకాశాలు ఉండగా, అప్పటికి మొత్తం మరణాల సంఖ్య 5 లక్షలకు చేరొచ్చని పేర్కొంది. ఒక వేళ పరిస్థితులు అదుపులోకి వచ్చి, ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడితే.. డిసెంబరు 1 కల్లా మరణాలు 2.91 లక్షలకే పరిమితం కావచ్చని ప్రస్తావించింది. కేసులు, మరణాలపై గతంలో వచ్చిన నివేదికల గణాంకాలతో పోలిస్తే, ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయని హరియాణాలోని అశోకా వర్సిటీ ప్రొఫెసర్‍ గౌతమ్‍ మీనన్‍ అభిప్రాయపడ్డారు.