Monday, September 7, 2020

నాట్స్ ఆధ్వర్యంలో టెన్నీస్ డబుల్స్ టోర్నమెంట్‌

 

NATS Sports event held by NJ Chapter

న్యూజెర్సీలో ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు ప్లేయర్స్ అమెరికా లో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీలో టెన్నీస్ డబుల్స్ టోర్నమెంట్ నిర్వహించింది. తెలుగు ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఈ టోర్నమెంటులో పాల్గొన్నారు. కొన్ని వారాల పాటు లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తూ వచ్చిన నాట్స్ తాజాగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించింది. ప్లయిన్స్‌బొరో టీం (కృష్ణ కిషోర్ బండి, వాసుదేవ మైల) ఈ టోర్నమెంట్ విజేతగా నిలిచింది.. సౌత్ జెర్సీ టీం ( సందీప్ అనంతుల, రమేశ్ జంగా) రన్నరప్‌గా నిలిచింది.

ఈ టోర్నెమెంటుకు కావాల్సిన సహయ సహకారాలు అందించిన నాట్స్ బోర్డు డైరెక్టర్ మోహనకృష్ణ మన్నవకు నాట్స్ క్రీడా విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ నేషనల్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ కొణిదెల ఈ టోర్నమెంట్‌ను సమర్థవంతంగా నిర్వహించారు.

నాట్స్ నాయకులు కుమార్ వెనిగళ్ల, వంశీ వెనిగళ్ల ఈ టోర్నమెంటు నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఈ టోర్నమెంట్ విజేతలకు నాట్స్ ముఖ్య నాయకుల చేత బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. మోహనకృష్ణ మన్నవ, అరుణ గంటి, గంగాధర్ దేసు, సూర్యం గంటి, శ్రీహరి మందాడి, రాజ్ అల్లాడ, రంజిత్ చాగంటి, శ్యాం నాళం, రమేశ్ నూతలపాటి, మురళీ మేడిచర్ల, చక్రధర్ ఓలేటి, విష్ణు ఆలూరు, సురేశ్ బొల్లు, సూర్య గుత్తికొండ, రాజేశ్ బేతపూడి, శ్రీనివాస్ మెంట, శేషగిరి కంభంమెట్టు, శ్రీనివాస్ భీమినేని, శ్రీథర్ దోనేపూడి, ప్రశాంత్ గోరంట్ల, రామకృష్ణ నరేడ్ల, విష్ణు కనపర్తి, సుధాకర్ తురగా, రాకేశ్ దొమ్మాలపాటి, కిరణ్ చాగర్లమూడి తదితర నాట్స్ నాయకులు ఈ టోర్నమెంట్ బహుమతులు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన ఆటగాళ్లను వీరు ప్రత్యేకంగా ప్రశంసించారు.

బావర్చీ బిర్యానీ, NJ Life ఈ కార్యక్రమానికి స్పానర్స్ గా వ్యవహరించారు.

కంగ‌నాకి వై కేట‌గిరీ భ‌ధ్ర‌త‌..

 Kangana Ranaut granted Y plus category security ahead of her return to Mumbai on 9 September


బ‌హుశా భార‌త దేశ చ‌రిత్ర‌లోనే సినిమాల‌కు ప‌రిమిత‌మైన ఏ న‌టికీ ఈ ర‌క‌మైన భ‌ధ్ర‌త కేంద్ర‌ ప్ర‌భుత్వం క‌ల్పించిన దాఖ‌లాల్లేవు. ఆ ఘ‌న‌త‌ను సాధించింది బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్‌. గ‌త కొన్ని రోజులుగా ర‌కర‌కాలుగా వార్త‌ల్లో ఉంటోంది ఈ బాలీవుడ్ క్వీన్‌. తొలుత నెపొటిజం, బాలీవుడ్ తో డ్ర‌గ్స్ లింకులు వగైరా అంశాల్లో మీడియాకు సంచ‌ల‌నంగా మారేలా వాగ్భాణాలు సంధించిన కంగ‌న‌... తాజాగా ముంబ‌యి మీద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ముంబ‌యి న‌గ‌రం పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ (పిఒకె) లా త‌యారైంద‌ని ఆమె వ్యాఖ్యానించ‌డం తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తించింది. అప్ప‌టిదాకా కంగ‌న మీద క‌త్తులు నూరుతున్న బాలీవుడ్ పెద్ద‌ల‌కు శివ‌సేన వంటి మ‌త‌త‌త్వ పార్టీలు తోడ‌య్యాయి. ఆమెని ముంబ‌యి నుంచి త‌రిమి కొట్టాలంటూ ప‌లువురు రాజ‌కీయ నేత‌లు, ప్ర‌జా సంఘాల నాయ‌కులు విమ‌ర్శ‌ల ప‌ర్వం మొద‌లుపెట్టారు. అదే క్ర‌మంలో కంగ‌న త‌న మాట‌లు వెన‌క్కి తీసుకోవాల‌ని లేని ప‌క్షంలో ఆమెని ముంబ‌యిలో అడుగుపెట్ట‌బోనివ్వ‌మ‌ని శివ‌సేన ఎంపి సంజ‌య్ రౌత్ తీవ్రంగా హెచ్చ‌రించారు.

అయితే ఈ హెచ్చ‌రిక‌కు కంగ‌న అంత‌కంటే ఘాటుగా స్పందించింది. తాను ముంబ‌యిలో అడుగుపెడుతున్నాన‌ని ఎయిర్‌పోర్ట్‌లో ఫ‌లానా స‌మ‌యానికి దిగుతాన‌ని ద‌మ్ముంటే అడ్డుకోవాలంటూ స‌వాల్ విసిరింది. దీంతో మొత్తం వ్య‌వ‌హారం కేంద్ర ప్ర‌భుత్వం దాకా వెళ్లింది. కంగ‌న‌కు అవ‌స‌ర‌మైన భ‌ధ్ర‌త క‌ల్పించాల‌ని హిమాచల్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేసింది. ఈ విజ్ఞ‌ప్తిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న కేంద్రం ఆమెకు వై కేటగిరీ భ‌ధ్ర‌త ఏర్పాటు చేస్తూ సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.