Saturday, May 16, 2020

ఉద్యోగులకు జొమాటో ఉద్వాసన

ఉద్యోగులకు జొమాటో ఉద్వాసన
తమ సిబ్బందిలో 13 శాతం మందిని తొలగించబోతున్నట్టు ఆన్‍లైన్‍ పుడ్‍ ఆర్డిరింగ్‍ ప్లాట్‍ఫామ్‍ జొమాటో ప్రకటించింది. కోవిడ్‍ 19 సంక్షోభం ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. గత రెండు నెలల్లో కంపెనీ వ్యాపారం ఊహించనివిధంగా మారిపోయింది. ఈ మార్పులు శాశ్వతంగా ఉంటాయని భావిస్తున్నామని జొమాటో స్థాపకుడు, సీఈవో దీపిందర్‍ గోయెల్‍ కంపెనీ వైబ్‍సైట్‍లో పేర్కొన్నారు. జొమాటోలో ఎక్కువ కాలం పని లభించని ఉద్యోగులు ఆరు నెలలపాటు 50 శాతం జీతంతో కొనసాగవచ్చని ప్రకటించారు.

'అల‌.. వైకుంఠపురములో’ మరో కొత్త రికార్డు

'అల‌.. వైకుంఠపురములో’ మరో కొత్త రికార్డు
అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘అల‌.. వైకుంఠపురములో’. జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి రికార్డ్‌ కలెక్షన్లు సాధించడమే కాకుండా మ్యూజికల్‌గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. సినిమా విడుదల‌కు ముందే ఈ చిత్రంలోని ‘సామజవరగమనా..’ ‘రాములో రాములా..’, ‘బుట్టబొమ్మా బుట్టబొమ్మా..’ పాటలు కొత్త రికార్డులు సృష్టించాయి. ఈ సినిమా విడుదలై 5 నెల‌లు దాటిపోయినా ఏదో ఒక విధంగా ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలికాలంలో లాక్‌డౌన్‌ కారణంగా అందరూ ఇంటికే పరిమితం కావడంతో తమకు నచ్చిన పాటల‌కు టిక్‌టాక్‌లు చేయడం, డాన్సులు చేస్తూ వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం వంటివి చేస్తున్నారు.
బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పాశెట్టి, ఒకప్పటి టాప్‌ హీరోయిన్‌ సిమ్రాన్‌, అస్ట్రేలియా క్రికెట్‌ ప్లేయర్‌ డేవిడ్‌ వార్నర్‌ ‘బుట్టబొమ్మా..’ పాటకు స్టెప్పులేస్తూ తీసిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం విశేషం. కలెక్షన్లపరంగా, మ్యూజికల్‌గా ఇన్ని రికార్డులు క్రియేట్‌ చేసిన ‘అల‌.. వైకుంఠపురములో’ చిత్రం మరో రికార్డును సాధించింది. ఈ చిత్రంలోని పాటలు 1 బిలియన్‌ వ్యూస్‌ సాధించాయి. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్‌ సంస్థ తమ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. ‘
అల‌.. వైకుంఠపురములో’ ఆల్బ‌మ్‌ను సూపర్‌హిట్‌ చేసి 1 బిలియన్‌ వ్యూస్‌ సాధించేలా చేసిన సంగీత ప్రియుల‌కు ధన్యవాదాలు. ఈ చిత్రంలో నటించిన నటీనటుల‌కు, సంగీత దర్శకునికి, గీత రచయితల‌కు, సింగర్స్‌కు, ఇతర చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేసింది గీతా ఆర్ట్స్‌..