Friday, August 28, 2020

TAMA Mahila Sambaralu Online Event

 

TAMA Mahila Sambaralu Online Event

Registrations : www.tama.org/mahilasambaralu

వేదాద్రి ఎత్తిపోతలకు సీఎం జగన్ శంకుస్థాపన

 

CM Jagan Launches Vedadri Llift Irrigation Scheme

పశ్చిమ కృష్ణా తీరంలోని జగ్గయ్యపేట మండలం వేదాద్రి క్షేత్రం సమీపంలో రూ.368 కోట్లతో భారీ ఎత్తిపోతల పథకానికి ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‍ విధానం ద్వారా ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. వైఎస్‍ఆర్‍ వేదాద్రి ఎత్తిపోతల పేరుతో రూపొందించిన ఈ ఎత్తిపోతల ద్వారా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన 28 గ్రామాల ఎన్‍ఎస్పీ భూములకు సాగునీరు అందనుంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‍కుమార్‍ యాదవ్‍, రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్

 

Minister KTR Review on Basthi Dawakhana

బస్తీ దవఖానాలపై తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‍శాఖ మంత్రి కేటీఆర్‍ సమీక్ష నిర్వహించారు. పేదలకు ప్రాథమిక ఆరోగ్యం అందడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేసిన మంత్రి.. హైదరాబాద్‍లో మరో 100 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బస్తీ దవాఖానాల ద్వారా ప్రతి రోజు 25 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నామని, కొత్తగా నిర్మించబోయే దవాఖానాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతం అయ్యాయని సిబ్బందిని ప్రశంసించారు.

హైదరాబాద్‍ పరిధిలోని 197 బస్తి దావఖానాలు, ఇతర నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి రోజు 5000 పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు 53 రకాల పాథాలజీ, మైక్రోబయోలకీ, బయో కెమిస్ట్రీ వంటి వైద్య పరీక్షలు చేస్తున్నామని కేటీఆర్‍ సృష్టం చేశారు. బస్తి దవాఖానాలకు పేదల నుంచి మంచి స్పందన వస్తుందని, ముందుముందు వీటిని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్‍ వాకాటి కరుణ, జిల్లాల కలెక్టర్లు, పురపాలక శాఖ, జీహెచ్‍ఎంసీ అధికారులు పాల్గొన్నారు

రామ్‌చ‌ర‌ణ్ ఈ విష‌యంలో మొద‌టి అడుగు వేస్తున్నాడు!

 

Ram Charan to join Acharya shoot first

క‌రోనా చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఎంత న‌ష్టాల్లోకి నెట్టేసిందో అంద‌రికీ తెలిసిందే. ఒక‌దానికి ఒక‌టి లింక్ ఉన్న ప‌నులు కావ‌డం వ‌ల్ల చాలా మంది దానివ‌ల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. సినిమాలు రిలీజ్ అవ్వాలంటే థియేట‌ర్లు ఉండాలి. సినిమాలు పూర్తి కావాలంటే షూటింగ్ చెయ్యాలి. షూటింగ్ చెయ్యాలంటే ఎవ్వ‌రూ ధైర్యం చెయ్య‌లేని ప‌రిస్థితి. చిన్న హీరోలు కూడా షూటింగ్ అంటే భ‌య‌ప‌డుతున్నారు. ఇక పెద్ద హీరోల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కొంద‌రు హీరోలు జ‌న‌వ‌రి త‌ర్వాతే షూటింగ్ అని గ‌ట్టిగా చెబుతున్నారు. ధైర్యం చేసి షూటింగ్ పెట్టాల‌న్నా ఎంతో ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. పైగా చిత్ర యూనిట్‌లోని ప్ర‌తి ఒక్క‌రి బాధ్యతా నిర్మాతే తీసుకోవాల్సి వ‌స్తోంది. దీంతో నిర్మాత‌కు మ‌రింత భారం ప‌డుతోంది. ఇప్పుడిప్పుడే ఇత‌ర భాషా హీరోలు షూటింగ్ చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఇప్ప‌డు టాలీవుడ్ హీరోలు కూడా షూటింగుల‌కు బ‌య‌ల్దేరే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీని గురించి ఒక నిర్ణ‌యం తీసుకునేందుకు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ క‌స‌ర‌త్తులు చేస్తోంది.

టాలీవుడ్ నుంచి మొద‌ట‌గా రామ్‌చ‌ర‌ణ్ షూటింగ్‌కి రెడీ అవుతున్నాడు. అయితే అది రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్‌కి కాదు. నాన్న చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `ఆచార్య‌` చిత్రం కోసం. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రారంభం కావ‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టేలా ఉండ‌డంతో చ‌ర‌ణ్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని తెలుస్తోంది. అంటే ఐదు నెల‌లుగా స్తంభించిపోయిన షూటింగును స్టార్ట్ చేసి ముందుకు వెళుతున్న హీరోల్లో మొద‌టి పేరు రామ్‌చ‌ర‌ణ్‌దే. ఈ విష‌యంలో మెగా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక‌వైపు మెగాస్టార్ షూటింగ్ స్టార్ట్ అవుతోంది. మ‌రో వైపు త‌మ అభిమాన యంగ్ హీరో రామ్‌చ‌ర‌ణ్ షూటింగ్‌ను స్టార్ట్ చెయ్య‌డంలో అంద‌రికీ మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తున్నాడ‌ని అభిమానులు సంతోషిస్తున్నారు.

అమెరికాలో మహిళల ఓటు హక్కుకు వందేళ్లు!

 

US marks 100 years since women given right to vote

అమెరికాలో మహిళలకు ఓటు హక్కు వచ్చి వందేళ్ళ పూర్తయింది. మహిళలకు ఓటు హక్కు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేసి బుధవారానికి శత వత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ చారిత్రక వి•యాన్ని గుర్తు చేస్తూ అమెరికా అంతటా సంబరాలు జరుపుకుంటున్నారు. నవంబరు అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా ఈ సందర్భాన్ని గౌరవించుకోవాలని మహిళా రాజకీయ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటు హక్కు కావాలని కోరుతూ దశాబ్దాలుగా మహిళలు సాగించిన పోరాటం అనంతరం ఈ మేరకు 1920 ఆగస్టు 26న అమెరికా రాజ్యాంగానికి 19వ సవరణను లాంఛనంగా ఆమోదించారు. ఓటు వేయడానికి అమెరికా పౌరులకు ఉన్న హక్కును కేవలం లైంగికతను బట్టి ఆ దేశ ప్రభుత్వం లేదా మరే ఇతర రాష్ట్రం నిరాకరించడానికి లేదా కుదించడానికి వీలు లేదు అని ఆ సవరణ పేర్కొంటోంది.

ఈ నేపథ్యంలో ఆగస్టు 26ని మహిళల సమానత్వ దినంగా అమెరికాలో ప్రతి ఏటా పాటిస్తున్నారు. న్యూయార్క్ సెంట్రల్‍ పార్క్లో 19వ శతాబ్దపు మహిళల పోరాటానికి ఆద్యులైన ముగ్గురు శక్తివంతమైన మహిళలు సోజర్నర్‍ ట్రూత్‍, సుశాన్‍ ఆంటోనీ, ఎలజబెత్‍ కేడీ స్టాంటన్‍ల విగ్రహాలను ఆవిష్కంచారు. మహిళలకు ఓటు హక్కు వచ్చే నాటిని వీరు ముగ్గురూ మరణించారు. 19వ సవరణ ఆమోదం చాలా కీలకమైనది, ముఖ్యమైనది, చారిత్రాక విజయమే అయినప్పటికీ ఇది అసంపూర్తిగానే ఉంది అని మాజీ విదేశాంగ మంత్రి, 2016, డెమోక్రాట్‍ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‍ విగ్రహావిష్కరణ అనంతరం వ్యాఖ్యానించారు.