Tuesday, June 23, 2020

సరికొత్త హంగులతో 'నీకోసం నిరీక్షణ'

Kamal Hassan Rajinikanth Sridevi s Classic Remastered Version In Telugu Titled Nee Kosam Neereekshana s Ready To Release

భార‌తీయ చ‌ల‌న‌చిత్ర రంగంలో నటదిగ్గజాలు అయినటువంటి యూనివ‌ర్స‌ల్ హీరో కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు అందాల తార శ్రీదేవి నటీనటులుగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం "పదినారు వయదినిలే`‌. 70వ ద‌శ‌కంలో విడుదలైన ఈ చిత్రం ఎన్నో అవార్డుల‌తో పాటు ప్రేక్షకుల మన్ననలతో ఘనవిజయం సాధించి క్లాసిక్ మూవీగా నిలిచింది. తెలుగులో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి, చంద్ర మోహన్, మోహన్ బాబులతో 'పదహారేళ్ళ వయసు' గా రూపొందించబడి సూపర్ హిట్ గా నిలిచింది. 42 సంవత్సరాల తర్వాత తమిళ "పదినారు వయదినిలే" చిత్ర నిర్మాత ఎస్ ఏ రాజ్ కణ్ణు కుమార్తె బామ రాజ్ కణ్ణు తమిళ వెర్షన్ ను అధునాతన డాల్బీ సౌండ్ పద్ధతుల్లో తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్ చేసి తెలుగులో `నీకోసం నిరీక్షణ` టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఆన్ లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన అనంత‌రం మ‌రో నాలుగు భాషల్లో డ‌బ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్లు సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ సంద‌ర్భంగా..
నిర్మాత బామా రాజ్ కణ్ణు మాట్లాడుతూ - "40 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నిర్మించిన క్లాసిక్ ను తెలుగు వారికి అందించాలనే నా ప్రయత్నమే `నీ కోసం నిరీక్షణ`. ఒక అరగంట నిడివి గల చిత్రాన్ని ఎడిట్ చేసి డబుల్ సెన్సార్ చేశాం. రజినీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి నటించిన ఈ చిత్రం స్ట్రెయిట్ తెలుగు సినిమా లానే ఉంటుంది. అయితే ` నీ కోసం నిరీక్షణ` క్లైమాక్స్ తెలుగు రీమేక్ `పదహారేళ్ళ వయసు` కి భిన్నంగా ఉంటుంది. కొత్త సంగీత దర్శకుడు కె. కె అందించిన 5 సరికొత్త పాటలు మిమ్మ‌ల్ని అల‌రిస్తాయి. ఇళయరాజా గారి రీ- రికార్డింగ్ ను యధాతథంగా ఉపయోగించాం. ఈ చిత్ర డిజిటల్ రీ-స్టోరేష‌న్ ప్రాసెస్ కారణంగా డబ్బింగ్ చిత్రానికి అయ్యే ఖర్చు కంటే మూడు రెట్లు ఎక్కువ అయింది. రజినీకాంత్ గారు ఆర్థికంగా సహాయం చేశారు. కరోనా కారణంగా ప్రివ్యూ వేయడం కుదరలేదు. వారికి స్పెషల్ షో ఏర్పాటు చేస్తున్నాం.
ఒరిజినల్ నెగెటివ్ నుండి లాబ్ టెక్నీషియన్స్ ఒక్కో ఫ్రేమ్ ను జాగ్ర‌త‌గా కలర్ ఎన్‌హ్యాన్స్‌ చేసి సినిమాస్కోప్ లోకి మార్చ‌డం జ‌రిగింది. ముగ్గురు ఆడియోగ్రాఫర్లు ఎంతో శ్ర‌మించి సౌండ్ ను లేటెస్ట్ డాల్బీ 5.1 లో రికార్డ్ చేశారు. హీరో, విలన్ పాత్ర‌ల‌కు ఒక్క‌రే డ‌బ్బింగ్ చెప్పినా అలా అనిపించదు. అంత బాగా చెప్పారు. మొద‌ట ఈ చిత్రాన్ని 1000 థియేటర్లలో విడుదల చేద్దాం అనుకున్నాం కానీ ప్రస్తుత కరోనా కారణంగా డైరెక్ట్ గా ఆన్ లైన్లో విడుదల చేస్తున్నాం" అన్నారు.
ఈ చిత్రానికి.. సంగీతం : ఇళ‌య‌రాజా, నిర్మాత‌: బామా రాజ్ కణ్ణు, ద‌ర్శ‌క‌త్వం: భారతీరాజా.

డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన గూగుల్ సీఈవో

disappointed-says-google-ceo-sundar-pichai-on-h1-b-visa-ban

హెచ్‍ 1బీ వీసాల జారీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ తీసుకొన్న కొత్త నిర్ణయాన్ని గూగుల్‍ సీఈవో సుందర్‍ పిచాయ్‍ వ్యతిరేకించారు. ఈ ఏడాది చివరివరకూ వలసదార్ల వీసాలను తాత్కాలికంగా రద్దు చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. అమెరికా వలసదార్ల వీసాలకు సంబంధించి శ్వేతసౌధం కీలక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిచాయ్‍ ఆ ప్రకటనను ఖండిస్తూ ఓ ట్వీట్‍ చేశారు. అమెరికా ఆర్థిక బలోపేతానికి వలసవిధానమే విశేషంగా కృషి చేసిందని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టిందని చెప్పారు. అలాగే గూగుల్‍ ఇప్పుడున్న స్థితికి కూడా ఆ విధానమే కారణమని పేర్కొన్నారు. కొత్త నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురైనట్లు ఆయన విచారం వ్యక్తం చేశారు. వలసదార్లకు తాము అండగా ఉంటామని, అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

తాజా కొత్త అధ్యక్షుడిగా పాపారావు గుమ్మడపు

Telugu Association of Jacksonville Area New Committee Members
జాక్సన్‍విల్‍ తెలుగు అసోసియేషన్‍ (తాజా) కొత్త అధ్యక్షుడిగా పాపారావు గుమ్మడపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాజా వేదిక ద్వారా మరిన్ని చక్కటి కార్యక్రమాలకు రూపకల్పన చేసి అందరి సహకారంతో నిర్వహించనున్నట్లు చెప్పారు. కరోనా మహమ్మారి జనజీవితాలను నాశనం చేస్తున్న సమయంలో అందరం జాగ్రత్తగా ఉంటూ, తెలుగువాళ్ళకు ఏ అవసరం వచ్చినా, కష్టం వచ్చినా తాజా తరపున సహాయ సహకారాలను అందిస్తామని ఆయన హామి ఇచ్చారు. తెలుగు యువతకు మార్గనిర్దేశం చేస్తూ, మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
కొత్త తాజా కార్యవర్గం 2020-21 వివరాలు...
 పాపారావు గుమ్మడపు (ప్రెసిడెంట్‍), లక్ష్మీ సతీష్‍కుమార్‍ (వైస్‍ప్రెసిడెంట్‍), శంకర కుప్ప (ట్రెజరర్‍), వసుంధర శ్రీకాకుళపు (సెక్రటరీ), సురీష్‍ గుడిమెట్ల (ఆపరేషన్స్ -విపి), సురేష్‍ మిట్టపల్లి (ప్రెసిడెంట్‍ ఎలక్ట్), శ్రీనివాస రవి (యూత్‍ కమిటీ చైర్‍), లత కోట (యూత్‍ కమిటీ కో చైర్‍), మహేష్‍ బాబు గునుకుల (తెలుగు బడి చైర్‍), సంధ్య ఈశ్వర (కల్చరల్‍ చైర్‍), శ్వేత శరభన్న (కమ్యూనికేషన్స్ చైర్‍), సుమన్‍ సజ్జన్న (ఎవి చైర్‍), నవీన్‍ మొదలి (పిఆర్‍ చైర్‍), సునీల్‍ మెరుగు(వెబ్‍ చైర్‍), మాధవి (సంక్రాంతి చైర్‍), శిరీష పాలకల్లూరి (సంక్రాంతి కో చైర్‍), పద్మ ప్రియ కొల్లూరు (ఉగాది చైర్‍), సమత చంద్ర (ఉగాది కో చైర్‍), పున్నయ్య శాస్త్రి జంధ్యాల (స్పోర్టస్ చైర్‍), రాజ్‍ బండారు (స్పోర్టస్ కో చైర్‍), నారాయణ కసిరెడ్డి (ఫుడ్‍ చైర్‍), రామకృష్ణ (ఆపరేషన్స్ - చైర్‍), కావ్య పాలరపు(ఈవెంట్స్ డెకరేషన్స్ - చైర్‍), శ్రీధర్‍ కండే (ఆపరేషన్స్ - కో చైర్‍).

యాక్ష‌న్‌ హీరో విశాల్ 'చ‌క్ర' ఫ‌స్ట్ లుక్‌, గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ విడుద‌ల‌


Vishal s Chakra first look released

యాక్ష‌న్‌ హీరో విశాల్ హీరోగా ఎం.ఎస్ ఆనంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న లేటెస్ట్ మూవీ `చ‌క్ర‌`. విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  శ్ర‌ద్దా శ్రీ‌నాథ్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌లో రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మ‌నోబాలన్‌, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే ఇత‌ర పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.  కాగా  కాసేప‌టి క్రితం `చ‌క్ర`‌ తెలుగు వెర్ష‌న్‌కి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌‌ల చేశారు యాక్ష‌న్ హీరో విశాల్.  ప‌వ‌ర్‌ఫుల్ ‌లుక్‌లో ఉన్న ఈ పోస్ట‌ర్ కి మంచి  రెస్పాన్స్ వ‌స్తోంది. తాజాగా  జూన్ 22 సాయంత్రం 5 గంట‌ల‌కు `చ‌క్ర` గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ పేరుతో వీడియో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

విశాల్ సూప‌ర్ హి‌ట్ మూవీ  `అభిమ‌న్యుడు` త‌ర‌హా బ్యాంక్ రాబ‌రీ, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో కొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ వీడియోలో విశాల్  ప‌వ‌ర్‌ఫుల్  మాస్ లుక్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.
యాక్ష‌న్ హీరో విశాల్‌,  శ్ర‌ద్దా శ్రీ‌నాథ్, రెజీనా క‌సాండ్ర,మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి : బాల‌సుబ్ర‌మ‌నియం‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, నిర్మాత: విశాల్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్ ఆనంద‌న్.
https://youtu.be/DhIqvIJC4A8



నాట్స్ పద్య సంగీత విభావరి కి మంచి స్పందన


nats-telugu-padya-sangeetha-vibhavari-by-dr-gunmadi-gopala-krishna

భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో అమెరికాలో తెలుగు ప్రజలకు సేవలందిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. ఆన్‍లైన్‍లో పద్య సంగీత విభావరి నిర్వహించింది. ప్రముఖ రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ చే నాట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలుగు పద్యాల్లోని మాధుర్యాన్ని గుర్తు చేసేలా గుమ్మడి గోపాలకృష్ణ పద్య సంగీత విభావరి కొనసాగింది. నాట్స్ నాయకులు డాక్టర్‍ సూర్యం గంటి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహారించారు. నాట్స్ మాజీ ఛైర్మన్‍ డాక్టర్‍ మధు కొర్రపాటి, నాట్స్ వైస్‍ ఛైర్మన్‍ అరుణ గంటి ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
అమెరికాలోని తెలుగువారు ఆన్‍లైన్‍ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ.. శ్రీనాథుడు, అల్లసాని పెద్దన్న పద్యాలను రాగయుక్తంగా ఆలపించారు. హరిశ్చంద్ర, చింతామణి నాటక పద్యాలను కూడా ఎంతో శ్రావ్యంగా ఆలపించి తెలుగు భాషలోని మథురిమల గొప్పతనాన్ని చాటారు. తెలుగు పద్యాలు పాడటం భావ వ్యక్తీకరణకు ఎంతో దోహదం చేస్తుందని రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు. ఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్పగలిగేందుకు కూడా పద్యగానం తోడ్పడుతుందన్నారు. ఏ దేశమేగినా మాతృభాషను మరిచిపోరాదని అన్నారు.  తులభారం  నాటక పద్యాలను ప్రముఖ రంగస్థల నటీమణి రత్నశ్రీ ఆలపించి శ్రోతలను ఆకట్టుకున్నారు.
దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ పద్య సంగీత విభావరి ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగింది. అమెరికాలో ఉంటున్న తెలుగువారికి ఈ కార్యక్రమం తెలుగు పదాలు, పద్యాలను గుర్తు చేసింది. శ్రీధర్‍ అప్పసాని మాట్లాడుతూ.. వీక్షకుల కోరిక మేరకు త్వరలో ఈ కార్యక్రమం పార్ట్ 2 కూడా చేయాలని గోపాల కృష్ణ గారిని కోరారు. గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజ•ంభించి పేద కళాకారుల జీవనానికి ఆటంకంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవలసిందిగా కోరారు. డా. మధు కొర్రపాటి మాట్లాడుతూ చిన్న పిల్లలతో, నూతన కళాకారులతో కూడా మున్ముందు మంచి కార్యక్రమం చేయాలని కోరారు. పేద కళాకారుల భ•తి కోసం, గుమ్మడి గోపాల కృష్ణ ఫౌండేషన్‍ ద్వారా ఈ కళాభివృద్దికి తమ వంతు సహాయ సహకారాలు అందించటానికి నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని వివరించారు శ్రీధర్‍.  తెలుగు భాష వికాసం కోసం నాట్స్ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని నాట్స్ ఛైర్మన్‍ శ్రీథర్‍ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్‍ శ్రీనివాస్‍ మంచికలపూడి తెలిపారు.