Monday, May 25, 2020

ఎపీలో పాల‌న‌పై మేథోమ‌ధ‌నం నేటి నుంచి...

ఎపీలో పాల‌న‌పై మేథోమ‌ధ‌నం నేటి నుంచి...

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త పార్టీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌వుతున్న సంద‌ర్భంగా ప్ర‌భుత్వం మేధో మ‌ధ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నుంది. ఏడాది కాలంలో చేసిన ప‌నులు చేయాల్సిన ప‌నుల‌పై స‌మీక్ష‌ల‌తో ఈ మేధో మ‌ధ‌నం సాగ‌నుంది. సోమ‌వారం ప్రారంభ‌మ‌య్యే ఈ మేథో్ మ‌ధ‌న కార్య‌క్ర‌మం ఈ నెల 30 వ‌ర‌కూ కొన‌సాగుతుంద‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. 
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను  నెరవేర్చే దిశగా  రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వం లోని ప్రభుత్వo ఏడాది కాలంలో చేప‌ట్టిన‌ ప్రభుత్వ సం క్షేమ పథకాల అమలు పై నే ప్ర‌ధానంగా ఈ మేధోమథనం జ‌రుగ‌నుంది. ఇందులో భాగంగా   తిరుపతి ఎస్. వి యూనివర్సిటీ సెనేట్ హాల్ వేదికగా రేపటి నుండి 29వ తేదీ వరకు మన పాలన‌- మీ సూచన పేరుతో ఆ జిల్లా మంత్రుల స్వీయ పర్యవేక్షణ లో ప్రజలు, లబ్ధిదారులు,నిపుణుల తో ప్ర‌త్యేక కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త తెలిపారు... 

5 రోజ‌లు...కార్య‌క్ర‌మాలివీ...
సోమ‌వారం ఉ.10.25 గంటల కు మేథో మ‌ధ‌న కార్యక్రమం ప్రారంభమవుతుందని, 10:30 గంటల నుండి 1.30 గంటల వరకు రాష్ట్ర స్థాయిలో సీఎం క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని, 1-30 నుంచి 2-30  వరకు భోజన విరామం అనంతరం 2:30 గంటలకు   జిల్లా కలెక్టర్ ప్రారంభోత్స‌వ ప్ర‌సంగం అనంతరం జిల్లా ఇం చార్జి  మంత్రి  గౌతమ్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిలు ప్ర‌సంగిస్తారు.  అనంత‌రం సంబంధిత శాఖ‌ల‌కు సంబంధించి స‌మీక్ష ఉంటుంది. అలాగే సా.4 గం నుండి 5 గంల వరకు పథకాల లబ్ధిదారుల తో ముఖాముఖి నిర్వ‌హిస్తున్నారు. మొదటి రోజు పరిపాలన సంస్కరణలు, సంక్షేమం.. పరిపాలన వికేంద్రీకరణ పై తీసుకున్న చర్యలు 
రెండవ రోజు వ్యవసాయం, అనుబంధ రంగాలపై చర్చ మూడవ రోజున విద్యా రంగ సంస్కరణలు పథకాలపై లబ్ధిదారులు, నిపుణులతో మేఘమధనం , నాల్గవ రోజున పరిశ్రమలు, పెట్టుబడుల రంగo, నైపుణ్యాల పెంపు వాటర్ గ్రిడ్ ఇతర సంబంధిత అంశాలపై చర్చ, ఐదో రోజున వైద్య ఆరోగ్య శాఖ లో సంస్కరణ లు,ఆరోగ్యశ్రీ పైన స‌మీక్ష‌లు జ‌రుగుతాయి. చివ‌ర‌గా 30 న రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్రారంభిస్తారు. 

ఇది అంతులేని వింత క‌థ‌...!


ఇది అంతులేని వింత క‌థ‌...!
ప్ర‌భాస్‌, అనుష్క ఇద్ద‌రూ క‌లిసి బిల్లా, మిర్చి, బాహుబ‌లి సిరీస్‌లో న‌టించారు. ఈ ఇద్ద‌రి గురించి మొద‌టి నుంచి రూమ‌ర్స్ వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నార‌నే రూమ‌ర్స్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. వీళ్లకు సంబంధించి ఎప్పుడు న్యూస్ బ‌య‌టికి వ‌చ్చినా దాన్ని ఇద్ద‌రూ ఖండిస్తూ వ‌స్తున్నారు. తామిద్ద‌రం స‌హ‌స‌టులం, మంచి స్నేహితులం. అంతేత‌ప్ప మా మ‌ధ్య ఎలాంటి ఎఫైర్ లేదు అని ప‌దే ప‌దే చెబుతున్నారు.
ఈ విష‌యాన్ని కృష్ణంరాజు కూడా చాలా సార్లు ఖండించారు. అయినా వీరికి సంబంధించిన రూమ‌ర్స్ అస్స‌లు త‌గ్గ‌డం లేదు. ఏదో ఒక సంద‌ర్భంలో ప్ర‌భాస్‌, అనుష్క‌ల ప్రేమాయ‌ణం గురించి మీడియాలో ప్ర‌స్తావ‌న వ‌స్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఈమ‌ధ్య అనుష్క త‌ల్లి ప్ర‌ఫుల్లా శెట్టి సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందిస్తూ..`అనుష్క, ప్ర‌భాస్ స‌హ‌న‌టులు మాత్ర‌మే. వారి మ‌ధ్య ఎలాంటి ఎఫైర్ లేదు. అయితే నిజ జీవితంలో అనుష్క‌కు ప్ర‌భాస్ లాంటి ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ జీవిత భాగ‌స్వామి కావాల‌ని కోరుకుంటున్నాను` అని వ్యాఖ్యానించింది. దీంతో ప్ర‌భాస్‌, అనుష్క వ్య‌వ‌హారం మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. మ‌రి దీనిపై నెటిజెన్లు ఎలా స్పందిస్తారో! ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూడాలి.