Thursday, April 30, 2020

ఎవరైనా అలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు



ఎవరైనా అలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు

కరోనా నివారణ, సహాయక చర్యలపై ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. కర్నూలు జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడంపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్‍ ఎవరికైనా సోకవచ్చని, అడ్డుకున్నవారికైనా ఇలాంటి పరిస్థితే రావొచ్చనే విషయం మరువరాదన్నారు. కరోనా సోకినవారిని అంటరానివారిగా చూడటం సరికాదన్నారు. బాధితులపై ఆప్యాయత, సానుభూతి చూపించాలే తప్ప వివక్ష చూపరాదన్నారు. 
కరోనా వైరస్‍ ముందులు వేసుకుంటే పోతుందని సీఎం పునరుద్ఘాటించారు. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారిపైనే వైరస్‍ ప్రభావం చూపుతుందన్నారు. అంతిమ సంస్కారాలు నిర్వహించకుండా అడ్డుకోవడం సరికాదని, ఇక మీదట ఎవరైనా అలా ప్రవరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఇలాంటి వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. కరోనా రావడం భయానకంగా, సోకిన వారిని అంటరానివారిగా చూడటం ఎట్టిపరిస్థితుల్లోనూ తగదన్నారు.

పెళ్లికి సిద్ధమే కానీ ఇప్పుడు కాదు



పెళ్లికి సిద్ధమే కానీ ఇప్పుడు కాదు

మిల్కీ బ్యూటీగా అభిమానుల చేత కీర్తింపబడే ఆమెకు ఇటీవల దక్షిణాదిలో తీవ్ర పోటీ వచ్చింది. కొత్త హీరోయిన్లు అనేక మంది వచ్చేస్తున్నారు. దాంతో సీనియర్లకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఈ పరిణాం సహజమే. పూర్తిగా పరిశ్రమ పక్కన పెట్టకముందుగానే ఓ ఇంటిది అంటే పెళ్లి చేసుకోవాలని భావించిందట. కొద్ది రోజుల క్రితం సోషల్‍ మీడియాలో తమన్నా పెళ్లికి సంబంధించిన వార్తలు షికారు చేశాయి. వీటిని ఆమె ధృవీకరించలేదు ఖండించలేదు. తను పెళ్లిసి సిద్ధంగానే ఉన్నానని మాత్రం తెలియజేసింది. ఆ తర్వాత కూడా ముంబైలోనే స్థిరపడాలనే ఆలోచనతో ఖరీదైన ఫ్లాట్‍ కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అకస్మాతుగా ఆమె ఆలోచన మారిందని అంటున్నారు. పెళ్లిని మరికొద్ది రోజులు వాయిదా వేసి, ఈలోపు ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తోందట. ఎందుకంటే తమన్నా రేంజ్‍కి కనీసం యాభై లక్షలు పైగా పారితోషికం చెల్లిస్తారు. అందుకే వీలయినంత వరకు ఆర్థికంగా మరింత స్థిరపడ్డాకే మూడు ముళ్ళ గురించి ఆలోచిస్తుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. తమన్నా ప్రస్తుతం సీటీమార్‍ అనే తెలుగు చిత్రం చేస్తోంది. ఇందులో మహిళా కబడ్డీ కోచ్‍గా నటిస్తోంది.

గూగుల్ మీట్ సేవలు ఉచితం



గూగుల్ మీట్ సేవలు ఉచితం
సెర్చింజిన్‍ దిగ్గజం గూగుల్‍ తన వీడియో కాన్ఫరెన్సింగ్‍ యాప్‍ మీట్‍ సేవలను భారత్‍ సహా ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందించాలని నిర్ణయించింది. రానున్న వారాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మీట్‍లో ప్రతిరోజు 300 కోట్ల నిమిషాలపాటు వీడియో సమావేశాలు జరుగుతున్నాయి. రోజు 30 లక్షల మంది కొత్త వినియోగదారులు చేరుతున్నారు. కరోనా వైరస్‍ ఉద్థ•తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆన్‍లైన్‍ సమావేశాలు పెరిగిపోయిన నేపథ్యంలో మీట్‍ సేవలను ఉచితం చేయాలని గూగుల్‍ నిర్ణయించినట్లు సమాచారం. మీట్‍ సేవలు వినియోగించుకోవాలనుకునే వారికి కచ్చితంగా గూగుల్‍ ఖాతా ఉండాలి.