Wednesday, May 6, 2020

ప్రభుత్వం నుండి పోస్ట్ ప్రొడక్షన్ అనుమతి కై ఎదురు చూస్తున్న టాలీవుడ్

ప్రభుత్వం నుండి పోస్ట్ ప్రొడక్షన్ అనుమతి కై ఎదురు చూస్తున్న టాలీవుడ్



లాక్ డౌన్ నుంచి చిత్ర‌సీమ మిన‌హాయింపులు కోరుకుంటు తెలుగు సినీ పరిశ్రమ తామ బాధ‌లు, ఇబ్బందులు, స‌మ‌స్య‌లు చెప్పుకుంటూ సినిమాటోగ్రఫీ మినిస్టర్ త‌ల‌సాని శ్రీ‌నివాస యాదవ్ తో మే ౫న ఉదయం ఫిలిం ఛాంబర్లో సినీ పెద్దలు ఓ ‌ విన‌తి ప‌త్రాన్ని అంద‌చేసింది. అదే రోజు ముఖ్య మంత్రి కేసీఆర్ సుదీర్ఘమైన ప్రెస్ మీట్ లో ప్రసంగించారు. అయితే చిత్ర‌సీమ‌కు కూడా ఏవైనా కొన్ని మిన‌హాయింపులు ప్ర‌క‌టిస్తార‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూశారు. అన్ని రంగాల గురించీ మాట్లాడిన కేసీఆర్ సినిమాల గురించి ప్ర‌స్తావించ‌లేదు. ఆ సంగ‌తి మ‌ర్చిపోయారో, లేదంటే… అస‌లు సినిమాల గురించి ఆలోచించ‌లేదో తెలీదు గానీ, కేసీఆర్ నుంచి ఏమైనా మిన‌హాయింపులు ఆశించిన చిత్ర‌సీమకి నిరాశే ఎదురైంది.
ఆల్రెడీ కేరళ ప్రభుత్వం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇక్కడ కూడా 
షూటింగుల విష‌యంలో ప్ర‌భుత్వం అనుమ‌తిస్తుంద‌న్న ఆశ లేకపోయినా... క‌నీసం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు అనుమతులు ఇస్తుంద‌ని ఎదురు చూసింది. కానీ అలాంటి సంకేతాలేం క‌నిపించ‌లేదు. టోటల్ షూటింగ్ ముగించుకుని, ఎడిటింగ్‌, రీరికార్డింగ్, డ‌బ్బింగ్ ప‌నులు బాకీ ప‌డిన సినిమాలెన్నో చాలా ఉన్నాయి. లాక్ డౌన్ ఎత్తేసేలోపుగా ఈ పనుల‌న్నీ పూర్తి చేసుకోవచ్చు అని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించారు. స్మాల్ బడ్జెట్ సినిమాలు థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌క‌పోయినా, క‌నీసం ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌కి అమ్ముకోవాల‌న్నా స‌రే, సినిమా పూర్తి స్థాయిలో రెడీగా ఉండాలి క‌దా? ఆ అవ‌కాశం కూడా ఇప్పుడు లేకుండా పోయింది.
అయితే త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ మాత్రం ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్తాన‌ని ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నిన్నటి ఫిలిం ఛాంబర్ మీటింగ్ లో హామీ ఇచ్చారని తెలిసింది. అతి త్వ‌ర‌లో డ‌బ్బింగ్ స్టూడియోలు, రికార్డింగ్ థియేట‌ర్లు, లాబ్ ల‌కు ప‌ర్మిష‌న్లు ఇవ్వొచ్చ‌న్న సంకేతాలు అందుతున్నాయి. డ‌బ్బింగ్‌, ఎడిటింగ్‌, రీ రికార్డింగ్ ప‌నులు ప‌రిమిత వ్య‌క్తుల‌తో లాక్ డౌన్ నియమ నిభంధనలతో ముగించుకునే సౌల‌భ్యం ఉంది. క‌నుక ముఖ్యమంత్రి ఈ విష‌యంలో సానుకూలంగా స్పందిస్తారని పరిశ్రమ భావిస్తోంది.

No comments:

Post a Comment