
జాతీయ స్థాయిలో నటనా పరంగా ప్రతిభ వున్నా నటి క్వీన్ కంగనారౌనత్. ఆమె పర్సనల్ విషయానికి వస్తే తనకు ఏది మనసుకు అనిపిస్తే దానిని నిర్మోహమాటంగా, ఎదుటి వారు బాధపడతారేమో అనే ఆలోచన లేకుండా ముఖం మీదనే చెప్పేయడం కంగనా నైజం. అందరు అది పొగరు అంటే ఆమె మాత్రం దానిని తన ముక్కుసూటితనం అని అంటుంది. ఆమె ప్రవర్తన కొందరికి మాత్రం బాగా నచ్చుతుంది. కానీ ఇదే ముక్కుసూటితనం ఈమెని పలు వివాదాల్లో ఉంటుంది. ఈమె చేసింది ఒకే ఒక తెలుగు చిత్రం ఏక్ నిరంజన్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అప్పట్లో అందిరితో కలివిడిగా వుండే అజాత శత్రువు డార్లింగ్ ప్రభాస్ తో కూడా ఈమె ఏక్ నిరంజన్ సమయంలో గొడవ పడిందని అంటారు. ఇక తన మాజీ బోయ్ ఫ్రెండ్ హృతిక్ రోషన్ నుంచి దీపికా పడుకోనే వరకు అందరు ఈమె టార్గెట్ కి గురైనవారే. అలాగని తన తీరుని మార్చుకునే రకం కాదు ఈమె. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో తాను మిస్ అయిన పలు చిత్రాల గురించి చెప్పుకొచ్చింది.
మహేష్ బాబు కెరీర్ లోనే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి చిత్రం టాలీవుడ్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. పోకిరి మూవీ ఓ ట్రెయిన్డ్ సెట్ చేసి మహేష్ ప్రిన్స్ స్థాయి నుంచి టాలీవుడ్ సూపర్ స్టార్ అయ్యాడు. 2006లో విడుదలైన పోకిరి చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. పోకిరి తర్వాత ఇలియానా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఏకంగా టాలీవుడ్‌లోనే కోటి రూపాయల పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకుంది. అయితే ఈ చిత్రంలో మొదట మహేష్‌తో నటించే అవకాశం క్వీన్ కంగనా రౌనత్‌కి వచ్చిందట. ఈ విషయాన్ని కంగనానే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ, నేను మొదట నాగార్జున హీరోగా నటించిన 'బాస్ ఐ లవ్ యూ' చిత్రం కోసం ఆడిషన్స్ కి హాజరయ్యాను. అక్కడ చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. ఆడిషన్స్ ఎలాగో కష్టపడి పూర్తి చేసినా అందులో నటించడం ఇష్టం లేక ఆ చిత్ర యూనిట్ కి దొరక్కుండా నా ఫోన్ నెంబర్ మార్చేసాను. ఆ తర్వాత కొత్తవారితో గ్యాంగ్ స్టర్ అనే మూవీ ఆడిషన్స్ కి వెళ్లాను.
అదే సమయంలో పూరీ జగన్నాథ్ మహేష్ పోకిరి కోసం ఆడిషన్స్ జరుపుతూ ఉంటే దానికి కూడా హాజరయ్యాను. ఒకేసారి గ్యాంగ్ స్టర్, పోకిరి రెండు చిత్రాలలో నటించే అవకాశం వచ్చింది. గ్యాంగ్ స్టర్ కి డేట్స్ ఇచ్చేయడం వల్ల పోకిరి చిత్రం అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. నేను డేట్స్ ఇచ్చిన సినిమా ఆర్థికపరంగా ఇబ్బందులు ఉండడం వల్ల నేను ఒక్క షాట్ కూడా చేయకుండానే అది ఆగిపోయింది. ఆనాడు ఒక వేళ పోకిరిలో నటించి ఉంటే టాలీవుడ్ లో నేను మరింత ఉన్నత స్థానం లో ఉండేదానిని అని చెప్పుకొచ్చింది. నిజమే.. ఎందుకంటే పోకిరి సినిమాయే ఒక సంచలనం.
ఆ సినిమాతో ఐటెం గర్ల్ గా చేసిన ముమయత్ ఖాన్ ఫుల్ బిజీ అయ్యింది. దక్షిణాదిన హీరోలలో నాకు మహేష్ అంటే చాలా ఇష్టం. అవకాశం వస్తే మహేష్ బాబుతో ఖచ్చితంగా ఓ చిత్రం చేస్తాను. మహేష్‌తో కలిసి పనిచేయాలని మాత్రం బలమైన కోరికగా ఉందని కంగనా చెప్పుకొచ్చింది. మరి ఆ కాంబినేషన్ ఏ దర్శకుడు సెట్ చేస్తాడో చూద్దాం.
No comments:
Post a Comment