Thursday, April 30, 2020

ఎవరైనా అలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు



ఎవరైనా అలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు

కరోనా నివారణ, సహాయక చర్యలపై ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. కర్నూలు జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడంపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్‍ ఎవరికైనా సోకవచ్చని, అడ్డుకున్నవారికైనా ఇలాంటి పరిస్థితే రావొచ్చనే విషయం మరువరాదన్నారు. కరోనా సోకినవారిని అంటరానివారిగా చూడటం సరికాదన్నారు. బాధితులపై ఆప్యాయత, సానుభూతి చూపించాలే తప్ప వివక్ష చూపరాదన్నారు. 
కరోనా వైరస్‍ ముందులు వేసుకుంటే పోతుందని సీఎం పునరుద్ఘాటించారు. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారిపైనే వైరస్‍ ప్రభావం చూపుతుందన్నారు. అంతిమ సంస్కారాలు నిర్వహించకుండా అడ్డుకోవడం సరికాదని, ఇక మీదట ఎవరైనా అలా ప్రవరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఇలాంటి వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. కరోనా రావడం భయానకంగా, సోకిన వారిని అంటరానివారిగా చూడటం ఎట్టిపరిస్థితుల్లోనూ తగదన్నారు.

No comments:

Post a Comment