Tuesday, June 23, 2020

డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన గూగుల్ సీఈవో

disappointed-says-google-ceo-sundar-pichai-on-h1-b-visa-ban

హెచ్‍ 1బీ వీసాల జారీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ తీసుకొన్న కొత్త నిర్ణయాన్ని గూగుల్‍ సీఈవో సుందర్‍ పిచాయ్‍ వ్యతిరేకించారు. ఈ ఏడాది చివరివరకూ వలసదార్ల వీసాలను తాత్కాలికంగా రద్దు చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. అమెరికా వలసదార్ల వీసాలకు సంబంధించి శ్వేతసౌధం కీలక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిచాయ్‍ ఆ ప్రకటనను ఖండిస్తూ ఓ ట్వీట్‍ చేశారు. అమెరికా ఆర్థిక బలోపేతానికి వలసవిధానమే విశేషంగా కృషి చేసిందని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టిందని చెప్పారు. అలాగే గూగుల్‍ ఇప్పుడున్న స్థితికి కూడా ఆ విధానమే కారణమని పేర్కొన్నారు. కొత్త నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురైనట్లు ఆయన విచారం వ్యక్తం చేశారు. వలసదార్లకు తాము అండగా ఉంటామని, అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

No comments:

Post a Comment