
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన నాలో. నాతో.. వైఎస్సార్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. మహానేత 71వ జయంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ రచించిన ఈ పుస్తకాన్ని ఇడుపులపాయలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. దివంగత నేత వైఎస్సార్ సహధర్మ చారిణిగా విజయమ్మ తన 37 ఏళ్ల జీవిత సారాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. అనూహ్యంగా 2009 సెప్టెంబర్ 2, వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన నాటి నుంచి కలిగిన భావోధ్వేగాల సమాహారమే ఈ పుస్తకం. మహా నేత వైఎస్సార్ గురించి లోకం ఏమనుకున్నది, ప్రజల నుంచి తాను తెలుసుకున్న విషయాలతో పాటు ప్రజలకు తెలియని కొన్ని అంశాలను తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చినట్లు వైఎస్ విజయమ్మ తొలి పలుకుల్లో తెలిపారు.
No comments:
Post a Comment