Thursday, September 3, 2020

ఎవరితో మాకు సంబంధం లేదు : అమెరికా

 

US says it will not join global effort to find COVID-19 vaccine

కరోనా మహమ్మారి పీచమణిచే వ్యాక్సిన్‍ అభివృద్ధి, దాని పంపిణీ విషయంలో పరస్పరం సహకరించుకునేందుకు ఏర్పడిన ప్రపంచ దేశాల కూటమితో తాము కలవబోమని అమెరికా తేల్చి చెప్పింది. అలా కలవడం ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍వో) వంటి సంస్థల నిబంధనలతో తమని తాము నిర్బంధించుకోదలచుకోలేదని వ్యాఖ్యానించింది. కరోనా వైరస్‍ వ్యాప్తికి చైనా తోపాటు డబ్ల్యూహెచ్‍వో కూడా కారణమైందని ఆరోపిస్తూ సంస్థ సభ్య దేశాల నుంచి అమెరికా ఇప్పటికే వైదొలిగిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్‍ అందుబాటులోకొచ్చిన తర్వాత సరిపడా డోసులు లభించేలా కొన్ని దేశాలు జాగ్రత్త పడుతున్నాయి.

ఈ క్రమంలో తయారీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అందులో భాగంగా డబ్ల్యూహెచ్‍వో అధ్యర్యంలో 150 దేశాలు కొవాక్స్ పేరిట ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అయితే వాటితో కలిసేది లేదని, వ్యాక్సిన్‍ అభివృద్ధి, పంపిణీలో తమ దారి తమదేనని ట్రంప్‍ సృష్టం చేశారు. కాగా ట్రంప్‍ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహమ్మారిని ఓడించే ప్రయత్నాన్ని ఇది నీరుగార్చే ప్రమాదముందని కొందరు హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment