Sunday, September 6, 2020

సీఎం కేసీఆర్ కు బాలకృష్ణ కృతజ్ఞతలు

 

Balakrishna thanks CM KCR for including NTR s life history in 10th standard syllabus

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍కు అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి జీవితాన్ని భవిష్యత్‍ తరాలకు తెలిపేలా పాఠ్యపుస్తకాల్లో ప్రచురించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు బాలయ్య ఫేస్‍బుక్‍ వేదికగా ఓ పోస్టు చేశారు. పుస్తకంలో కథనానికి సంబంధించిన ఫొటోల్ని కూడా షేర్‍ చేశారు. కళకి, కళాకారులకి విలువ పెంచి కథానాయకుడు, తెలుగోడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా వినిపించిన మహానాయకుడు ఎన్నో సహసోపేతమన ప్రజారం జక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజా నాయకుడు, మద్రాసీయులమనే పేరుని చెరిపి భారతదేశ పటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతను తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ మా నాన్నగారు నందమూరి తారకరామారావు. భవిష్యత్‍ తరాలకు స్ఫూర్తినిచ్చేలా ఆయన గురించి 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రికి కేసీఆర్‍కు నా హృదయ పూర్వక ధన్యవాదాలు అని బాలయ్య పేర్కొన్నారు.

No comments:

Post a Comment