Saturday, September 5, 2020

3వేల అడుగుల ఎత్తులో మనిషి!

 

officials-investigate-guy-in-jetpack-seen-flying-near-lax-airport-nk-

ఒకటి కాదు రెండు కాదు, 3 వేల అడుగుల ఎత్తులో ఒక మనిషి జెట్‍ప్యాక్‍ సాయంతో ఎగురుతున్నాడని విమాన పైలట్లు చెప్పడం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. లాస్‍ఏంజిలిస్‍ విమానాశ్రయం పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‍పోర్టుకు వస్తున్న ఓ విమానంలోని పైలట్లు ఇద్దరు కిటికిలోంచి ఒక వ్యక్తి ఎగురుతూ వెళ్లడాన్ని గమనించినట్లు కంట్రోల్‍ రూమ్‍కు సమాచారమిచ్చారు. వారి నివేదిక మేరకు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‍బిఐ దర్యాప్తు ప్రారంభించింది. జెక్‍ప్యాక్‍ సాయంతో లాస్‍ ఏంజిలిస్‍ వంటి రద్దీ ప్రాంతంలో అంత ఎత్తున ఎగరడం అసాధ్యమని జెట్‍ప్యాక్‍ ఏవియేషన్‍ సంస్థ సీఈఓ డేవిడ్‍ మేమాన్‍ తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న సాంకేతికత బట్టి చూస్తే జెట్‍ ప్యాక్‍ సాయంతో 3 వేల అడుగుల ఎత్తున ఎగిరి తిరిగి కిందకు మామూలుగా రావడం జరగని పని. ఆ స్థాయిలో ఇంధనాన్ని జెట్‍ ప్యాక్‍లో తీసుకెళ్లడం అసాధ్యం. లాస్‍ ఏంజిలిస్‍ సమీపంలోనే జేట్‍ ప్యాక్‍ ఎగిరి ఉన్నట్లైతే కచ్చితంగా ప్రజల్లో చాలామందికి కనిపిస్తుంది. ఒకవేళ సిబ్బంది చూసింది డ్రోన్‍ అయి ఉండచ్చు. అత్యున్నత సాంకేతికత కలిగిన డ్రోన్లు మాత్రమే 3 వేల అడుగుల ఎత్తులో ఎగరగలవు. ఒకవేళ అది నిజంగా జెట్‍ ప్యాక్‍ అయ్యుంటే మాత్రం ఎవరో సోంతంగా తయారుచేసినది అయి ఉండాలి. అమెరికా సైనికావసరాల కోసం మేము జెట్‍ప్యాక్‍లను తయారు చేస్తున్నాం. కానీ అవి అమ్మకానికి లేవు అని ఆయన వెల్లడించారు.

ఒకవేళ నిజంగా జెట్‍ ప్యాక్‍తో ఎగిరిన వ్యక్తే అయి ఉంటే అతడికి రూ.20 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‍లో ఒక జెట్‍ ప్యాక్‍ సాయంతో 6వేల అడుగుల ఎత్తుకు విన్స్ రెఫెట్‍ అనే  వ్యక్తి ఎగరగలిగాడు. కానీ కిందకు దిగేందుకు పారాచూట్‍ను వాడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో డ్రోన్‍ చూసి జెట్‍ప్యాక్‍గా పైలట్లు భ్రమించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment