
వ్యక్తులను తాకకుండా వారి నుంచి ఎలాంటి నమూనాలు సేకరించకుండా, కేవలం ఐదు క్షణాల్లో కరోనా గుట్టును తేల్చే ఎక్స్ర్ సాఫ్ట్ వేర్ పరీక్షా విధానం కొలిక్కి వచ్చింది. ఈ సాఫ్ట్వేర్‍ను ఉపయోగించడానికి ఆమోదం తెలపాలంటూ రూర్కీ ఐఐటీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)ను కోరింది. రూర్కీ ఐఐటీలోని సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ కమల్ జైన్ మాట్లాడుతూ సాఫ్ట్వేర్‍లో ఒక వ్యక్తి ఛాతి ఎక్స్రేను అప్‍లోడ్ చేయగానే కేవలం ఐదు సెకన్లలోనే కొవిడ్ 19 వైరస్ సోకిందా? లేదా? అనే ఫలితం వస్తుందన్నారు.
No comments:
Post a Comment