Wednesday, July 1, 2020

సినీ పరిశ్రమ పాలిట శాపంగా కరోనా రక్కసి - కేవలం నాలుగు చిత్రాల రన్ తో 2020 అర్ధ భాగం


2020 ఏడాదిలో అర్ధ2020 Telugu Movies First Half Reviewభాగంగా ఒడిదుడుకుల మధ్య ముగిసిపోయింది. ఈ ఆరు నెలలలో సినిమా థియేటర్స్ రన్నింగ్ లో వున్నది  కేవలం 81 రోజులు మాత్రమే. భారీ విజయాలతో శుభారంభం అందించిన టాలీవుడ్ కరోనా  రక్కసి దెబ్బకు కుదేలయ్యింది. ప్రస్తుతం షూటింగులు, సినిమాల రిలీజ్ లేక భారతీయ సినిమా పరిశ్రమ అవస్థలు పడుతున్నది. ఇక గత ఆరు నెలల్లో సినిమాల రిలీజ్, అవి సాధించిన విజయాలు, కలెక్షన్లను ఓ సారి పరిశీలిద్దాం. జనవరి నుంచి జూన్ వరకు ఏ సినిమాలు బాక్సాఫీస్‌ను కుదిపేశాయి.. ఏ చిత్రాలు అపజయం పాలయ్యాయొ చూద్దాం. టాలీవుడ్ 2020 సంవత్సరంలో తొలి నెల జనవరిలో ఆగస్త్య మంజు దర్శకత్వం వహించిన బ్యూటిఫుల్ చిత్రంతో, అలాగే నటుడు సత్య ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఊల్లాలా ఊల్లాల చిత్రంతో మొదలైంది. ఆ తర్వాత  ఉత్తర, హల్‌చల్, వైఫ్ ఐ, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో, ఎంత మంచి వాడవురా, డిస్కో రాజా, డబ్‌స్మాష్, అశ్వత్థామ, చూసి చూడంగానే చిత్రాలు విడుదలయ్యాయి.

తరువాత  ఫిబ్రవరి నెలలలో జాను, 3 మంకీస్, సవారీ, డిగ్రీ కాలేజ్, నీవల్లే నేనున్నా, వరల్డ్ ఫేమస్ లవర్, ఒక చిన్న విరామం, శివ 143, లైఫ్ అనుభవించు రాజా, భీష్మ, ప్రెజర్ కుక్కర్, వలయం, చీమ ప్రేమ మధ్యలో భామ, రాహు, హిట్: ది ఫస్ట్ కేస్, స్వేచ్ఛ రిలీజ్ అయ్యాయి.
ఇక మార్చిలో కాలేజ్ కుమార్, పలాసా 1978, ఓ పిట్ట కథ, అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, మార్చి 13న మాధ, అర్జున చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత కరోనా విజృంభించడం, లాక్ డౌన్ కారణంగా సినిమాల ప్రదర్శన నిలిపివేయడంతో సినిమా పరిశ్రమ ఎప్పుడూ లేని సంక్షోభం లో కూరుకు పోయింది.  

ఆ తరువాత ఇక ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు  వరకు కూడా సినిమా హాళ్ల మూసివేత కొనసాగుతుండటంతో నిర్మాత, దర్శకులు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. ఏప్రిల్‌లో అమృతరామం, మే నెలలో రన్, జూన్‌లో పెంగ్విన్, కృష్ణ అండ్ హిజ్ లీల, 47 డేస్ చిత్రాలు సక్సెస్‌ఫుల్‌గా రిలీజ్ అయ్యాయి. ఇలా ఆరు నెలల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఇలా కనిపించింది. ఈ అయిదు చిత్రాలలో కేవలం ఒకే ఒక చిత్రం కృష్ణ అండ్ హిజ్ లీల ని జనాలు  స్ట్రీమింగ్ చేస్తున్నారు.  
2020 ఏడాదిలో తెలుగు సినిమా పరిశ్రమకు జోష్‌ను ఇచ్చిన చిత్రాల్లో అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు ముందు వరుసలో ఉంటాయి. ఈ చిత్రాలు రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం 262 కోట్ల గ్రాస్ అంటే 161.22 కోట్ల షేర్ ని రాబట్టింది. అలాగే మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతూ 260 కోట్ల గ్రాస్ అంటే 144 కోట్ల షేర్ ని  సొంతం చేసుకొన్నది. ఇక భీష్మ 28.52 కోట్ల షేర్ ని,  హిట్ 7.26 కోట్ల వసూళ్లు సాధించడంతో హిట్ చిత్రాలుగా నిలిచాయి.
బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్‌ను కలెక్షన్లపరంగా డిజాస్టర్ అయినా  చిత్రాల్లో రవితేజ నటించిన' డిస్కో రాజా' (7.81 కోట్లు),  సమంత, శర్వానంద్ నటించిన' జాను' (7.92 కోట్లు), విజయ్ దేవరకొండ నటించి 'వరల్డ్ ఫేమస్ లవర్' రూ.9.17 కోట్లు, నాగశౌర్య నటించిన' అశ్వత్తామ' రూ.4.31 కోట్లు, కల్యాణ్ రామ్ నటించిన 'ఎంత మంచి వాడవురా' రూ.(6.38) కోట్లు రాబట్టాయి. అయితే ఈ చిత్రాలు చేసిన బిజినెస్ కంటే తక్కువగా వసూళ్లను రాబట్టడంతో డిస్టిబ్యూటర్లు నష్టపోయారనేది సినీ మార్కెట్ అభిప్రాయం. 

No comments:

Post a Comment