Wednesday, July 1, 2020

రివ్యూ : క్రైమ్ థ్రిల్లర్ '47 డేస్'

47 days movie review
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
ఓ టి టి వేదిక : ZEE 5
నటీనటులు: సత్యదేవ్, శ్రీకాంత్ అయ్యంగార్, పూజా జవేరి, రోహిణి, రవివర్మ. సత్య ప్రకాశ్, ముక్తార్ ఖాన్, కీర్తి దామరాజు   తదితరులు
ఎడిటింగ్ : యస్. ఆర్. శేఖర్, ఆర్ట్ : బ్రహ్మ కడలి,  సంగీతం : రఘు కుంచె,
సినిమాటోగ్రఫీ : జి.కె. సహా నిర్మాత : అనిల్ కుమార్ సోహ్ని
నిర్మాతలు : విజయ్ డొంకాడ, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, దబ్బర శశి భూషణ్ నాయుడు
కథ, దర్శకత్వం : ప్రదీప్ మద్దాలి
విడుదల : 2020 జూన్ 30  
నలభై ఏళ్ళ క్రితం  మెగాస్టార్ చిరంజీవి, జయ ప్రధ హీరో హీరోయిన్లుగా వెర్సిటైల్ డైరెక్టర్ కె బాలచందర్ కాంబినేషన్‌లో వచ్చిన '47 డేస్' అనే  తెలుగు తమిళ్ సినిమా అప్పట్లో మంచి క్రేజీ  మూవీ గా వచ్చింది.    మళ్లి అదే  టైటిల్‌తో  ఓ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనడం సహజం. యువ హీరో సత్యదేవ్ హీరోగా దర్శకుడు ప్రదీప్ మద్దాలి కలయికతో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా జూన్ 30న ఓ టి టి ప్లాటుఫామ్ జీ 5 లో విడుదల అయ్యింది. సింగర్, సంగీత దర్శకుడు రఘు ఈ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించారు. ఈ లాక్ డౌన్ సమయంలో ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ అయింది. ‘జీ5’లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం  
కథ :వైజాగ్‌లో ఏసీపీగా పనిచేసే సత్య (సత్యదేవ్) చిన్నప్పటి నుండి తనతో అనాధ ఆశ్రమంలో పెరిగిన పద్దూ (రోషిణి ప్రకాష్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇక అంతా హ్యాపీగా వెళ్తున్న వాళ్ల లైఫ్ లో సడెన్ గా పద్దూ ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. అసలు పద్దూ అలా ఎందుకు చేసిందో అర్ధం కాక సత్య డిప్రెషన్ లో వెళ్లి జాబ్ నుండి సస్పెండ్ అవుతాడు.  ఆరు నెలల సస్పెన్షన్‌లో ఉంటారు. తన భార్య పద్దు మరణం  విషాదంతో బాధపడుతూ.. ఆమె మరణం వెనుక కారణాలను అన్వేషిస్తుంటాడు. అదే సమయంలో ఫార్మా కంపెనీ అధినేత శ్రీనివాసరావు అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఆ రెండు మరణాలకు పోలీకలు ఉండటంతో అధికారులు దృష్టికి తీసుకెళ్తాడు. అయితే అప్పటికే ఆ కేసు ఫైల్స్ మూసి వేయడం వల్ల దర్యాప్త చేయడానికి పోలీసు కమిషనర్ నిరాకరిస్తారు. అయితే తన ప్రయత్నాలను మానుకోకుండా రాజారాం అనే హెడ్ కానిస్టేబుల్‌ సహాయంతో దర్యాప్తు చేస్తుంటాడు. ఈ క్రమంలో జూలియట్ (పూజా జవేరి) అనే యువతి ఈ దర్యాప్తులో కీలకంగా మారుతుంది.

కథలో ట్విస్టులు తన భార్య పద్దు మరణానికి అసలు కారణమేమిటి? అదే క్రమంలో ఫార్మా కంపెనీ అధినేత శ్రీనివాసరావు మృతి వెనుక వాస్తవాలు ఏమిటి? సత్య దర్యాప్తులో తన స్నేహితుడు, పోలీస్ ఆఫీసర్ రవి (రవి వర్మ) ఎలాంటి పాత్ర పోషించాడు? ఇక రాజారాం హెడ్ కానిస్టేబుల్ (శ్రీకాంత్ అయ్యంగార్) ఎలాంటి సహకారం అందించారు. వేర్వేరు సంవత్సరాల్లో ఒకే రోజు జరిగిన రెండు మరణాలకు లింక్ ఏమైనా ఉందా? జూలియట్ ఈ దర్యాప్తులో ఎంత వరకు ఉపయోగపడిందనే చిక్కు ముడులకు సమాధానమే ఈ చిత్ర కథ.
నటి నటుల హావభావాలు:సత్యదేవ్ వన్ మ్యాన్ షోతో నడిచిన ఈ సినిమాలో.. సత్యదేవ్ రెండు గెటప్స్ లో చక్కగా నటించాడు. తన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారనిపిస్తుంది,  ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ సప్సెన్స్ సీక్వెన్స్ స్ లో సత్యదేవ్ చాలా బాగా నటించాడు. సినిమాకే హైలైట్ గా నిలిచాడు. ఇక హీరోయిన్ గా నటించిన రోషిణి ప్రకాష్ తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో హీరోయిన్ గా చేసిన పూజాజవేరి కూడా తన పరిధి మేరకు  బాగానే నటించింది. విలన్ గా నటించిన ముక్తార్ ఖాన్  కూడా చాల బాగా నటించాడు. అలాగే హీరో ఫ్రెండ్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. ఇక దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని లవ్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సెకెండ్ హాఫ్ లో ఆయన రాసుకున్న కొన్ని సస్పెన్స్ సీన్స్ మరియు విలన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ కూడా పర్వాలేదనిపిస్తోంది.
సాంకేతిక వర్గం పని తీరు :
దర్శకుడు ప్రదీప్ మద్దాలి గురించి దర్శకుడు ప్రదీప్ మద్దాలి రాసుకొన్న స్క్రిప్టులోనే చాలా లోపాలు ఉన్నాయి. నాసిరకమైన స్క్రీన్ ప్లే కారణంగా కథలో ఇన్వెస్టిగేషన్ తీరు ఆకట్టుకోలేకపోయింది. క్రైమ్ థ్రిల్లర్‌కు కావాల్సిన థ్రిల్లింగ్ మూమెంట్స్ ఎక్కడా కనిపించవు. కథాపరంగా బలంగా ఉండి ఉంటే డైరెక్షన్ పరంగా కూడా ఆకట్టుకొని ఉండే వారేమో అనిపిస్తుంది. టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా  మ్యూజిక్ సినిమాకు ప్లస్ ఆయింది. రీరికార్డింగ్ ఫర్వాలేదనిపిస్తుంది.  అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. అయితే దర్శకుడు ఆకట్టుకునే ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకుని ఉండి ఉంటే సినిమా  ఇంకా బాగుండేది.

తీర్పు :
47 డేస్’ అంటూ వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మరియు న్యూ ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నా.. ఇంట్రస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు కథనాన్ని దెబ్బ తీశాయి. అయితే ఈ లాక్ డౌన్ లో ఖాళీగా ఉంటే మాత్రం..సత్యదేవ్, శ్రీకాంత్ అయ్యంగార్ ఫెర్ఫార్మెన్స్‌ కారణంగా సినిమాకు కాస్త గౌరవం దక్కే అవకాశాలు పెరిగాయి. దర్శకుడిగా ప్రదీప్ మద్దాలి ప్రయత్నంలో నిజాయితీ కనిపించినా కథలో కొన్ని లోపాల కారణంగా ఆశించినంత ఫలితం దక్కకపోవచ్చు..... బాడ్ సినిమా మాత్రం కాదు... ఓ సారి చూడొచ్చు.  

No comments:

Post a Comment