
ముంబయి వాసులకు లాల్‍బాగ్చా రాజా గణపతీ పై .. కరోనా ప్రభావం ఆయన మీద కూడా పడింది. ఈ సారి లాల్‍బాగ్ఛా రాజా ఉత్సవాలకు అక్కడి ప్రజలు దూరం కానున్నారు. వైరస్ ఉద్ధ•తి కారణంగా ఈ ఏడాది లాల్‍బాగ్ ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు నిర్ణయించారు. 87 ఏళ్ల చరిత్రలో ఉత్సవాలను రద్దు చేయడం ఇదే తొలిసారి. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ఈ ఏడాది విగ్రహాన్ని ప్రతిష్టించడం లేదు అని లాల్ బాగ్ గణేశ్ మండలి కార్యదర్శి సుధీర్ సాల్వి వెల్లడించారు. ముంబయిలోని లాల్‍బాగ్ వద్ద ఏటా గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు పెద్దఎత్తున హాజరవుతుంటారు. అయితే ఈ ఏడాది పండగ సమయంలో రక్తదాన, ప్లాస్మా థెరసీ శిబిరాలను ఏర్పాటు చేయనున్నామని నిర్వాహకులు వెల్లడించారు.
No comments:
Post a Comment