Friday, August 28, 2020

అమెరికాలో మహిళల ఓటు హక్కుకు వందేళ్లు!

 

US marks 100 years since women given right to vote

అమెరికాలో మహిళలకు ఓటు హక్కు వచ్చి వందేళ్ళ పూర్తయింది. మహిళలకు ఓటు హక్కు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేసి బుధవారానికి శత వత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ చారిత్రక వి•యాన్ని గుర్తు చేస్తూ అమెరికా అంతటా సంబరాలు జరుపుకుంటున్నారు. నవంబరు అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా ఈ సందర్భాన్ని గౌరవించుకోవాలని మహిళా రాజకీయ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటు హక్కు కావాలని కోరుతూ దశాబ్దాలుగా మహిళలు సాగించిన పోరాటం అనంతరం ఈ మేరకు 1920 ఆగస్టు 26న అమెరికా రాజ్యాంగానికి 19వ సవరణను లాంఛనంగా ఆమోదించారు. ఓటు వేయడానికి అమెరికా పౌరులకు ఉన్న హక్కును కేవలం లైంగికతను బట్టి ఆ దేశ ప్రభుత్వం లేదా మరే ఇతర రాష్ట్రం నిరాకరించడానికి లేదా కుదించడానికి వీలు లేదు అని ఆ సవరణ పేర్కొంటోంది.

ఈ నేపథ్యంలో ఆగస్టు 26ని మహిళల సమానత్వ దినంగా అమెరికాలో ప్రతి ఏటా పాటిస్తున్నారు. న్యూయార్క్ సెంట్రల్‍ పార్క్లో 19వ శతాబ్దపు మహిళల పోరాటానికి ఆద్యులైన ముగ్గురు శక్తివంతమైన మహిళలు సోజర్నర్‍ ట్రూత్‍, సుశాన్‍ ఆంటోనీ, ఎలజబెత్‍ కేడీ స్టాంటన్‍ల విగ్రహాలను ఆవిష్కంచారు. మహిళలకు ఓటు హక్కు వచ్చే నాటిని వీరు ముగ్గురూ మరణించారు. 19వ సవరణ ఆమోదం చాలా కీలకమైనది, ముఖ్యమైనది, చారిత్రాక విజయమే అయినప్పటికీ ఇది అసంపూర్తిగానే ఉంది అని మాజీ విదేశాంగ మంత్రి, 2016, డెమోక్రాట్‍ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‍ విగ్రహావిష్కరణ అనంతరం వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment