Wednesday, September 2, 2020

కొవిడ్ ఫలితం చెప్పే.. ల్యాంప్ పరికరం!

 

LAMP Lights Up COVID 19 Testing

ఎలాంటి ప్రయోగశాలతో పనిలేకుండా, ఉన్న చోటే కొవిడ్‍-19 పరీక్ష నిర్వహించి, ఫలితాన్ని తెలుసుకునే సరికొత్త పరికరాన్ని అమెరికా పరిశోధకులు రూపొందించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలాచోట్ల కొవిడ్‍ పరీక్ష ఫలితం కోసం బాధితులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. చాలా ప్రయోగశాలల్లో సిబ్బంది కొరత కూడా ఉంటోంది. దీన్ని అధిగమించేందుకు తాము సులభంగా వినియోగించుకోదగ్గ పరికరాన్ని రూపొందించామని.. పరిశోధనలో పాల్గొన్న భారత సంతతి శాస్త్రవేత్త రషీద్‍ బషీర్‍ చెప్పారు. కొవిడ్‍ పరీక్ష నిమిత్తం వ్యక్తుల నుంచి స్వాబ్‍ సేకరించి, ఆర్టీ-పీసీఆర్‍ పక్రియ నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో వైరస్‍ ఆర్‍ఎన్‍ఏను రకరకాల ఉష్ణోగ్రతల వద్ద పరీక్షించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రత్యేక పరికరాలు, నిపుణులు అవసరం. అయితే, మేము రూపొందించిన ల్యాంప్‍ పక్రియ ద్వారా ఒకేసారి 65 సెంటీగ్రేడ్‍ ఉష్ణోగ్రత వద్ద వైరస్‍ను పరీక్షించి, ఫలితమేంటన్నది తెలుసుకోవచ్చు. క్యాటరిడ్జ్లా ఉండే పరికరంలో ఓవైపు నమూనాను, మరోవైపు ల్యాంప్‍ కెమికల్‍ను ఉంచుతాం. తర్వాత దాన్ని చేత్తో పట్టుకోదగ్గ హీటింగ్‍ ఛాంబర్‍లో వేడి చేస్తాం. పాజిటివ్‍ ఫలితం ఉంటే అరగంటలో ఫ్లోరోసెంట్‍ లైటు వెలుగుతుంది అని పరిశోధకులు వివరించారు.

No comments:

Post a Comment